RS.29కే స్మార్ట్‌ఫోన్లు అంటూ వాట్సప్‌లో మెసేజ్ హల్ చల్..... జాగ్రత్తగా ఉండండి

|

ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డేస్ సేల్స్ మొదలై ఇప్పటికి నాలుగు రోజులు అవుతోంది. ఇంకా మిగిలింది కేవలం రెండు రోజలు మాత్రమే. ఈ రెండు రోజులలో ఇంకా ఎక్కువగా అక్కటుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఒక్క రూపాయికే స్పీకర్, సోనీ హెడ్‌ఫోన్ రూ.9, ఒప్పో స్మార్ట్‌ఫోన్ రూ.19, సాంసంగ్ మొబైల్ రూ.29 లకు అంటు సొషల్ మీడియాలో మెసేజ్ లు హాల్ చల్ చేస్తున్నాయి.

 

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆఫర్లు ఇవీ అంటూ వాట్సప్‌లో ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. ఇటువంటి మెసేజ్లు చూసి షాకయ్యారా? అందులో ధరలు చూసి అంతా షాకవుతున్నారు కదూ. రూ.19 లకే స్మార్ట్‌ఫోన్ అమ్ముతున్నారు అని అవాక్కవుతున్నారు కదూ కానీ అసలు విషయం తెలిస్తే అందరు షాకవ్వాల్సిందే. అవి నిజమైన ఆఫర్లు కాదు మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు సృష్టించిన మోసపూరిత మెసేజ్ అది.

 

Rs.699 లకే జియో ఫోన్: దీపావళి ఆఫర్Rs.699 లకే జియో ఫోన్: దీపావళి ఆఫర్

లింక్స్
 

అందులో ఉన్న లింక్స్ క్లిక్ చేస్తే ఫ్లిప్‌కార్ట్ పోలినట్టుగా ఉన్న నకిలీ వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది. అందులో పేజ్ డిజైన్, ఫోటోలు అన్నీ ఫ్లిప్‌కార్ట్‌ అసలు వెబ్‌సైట్‌ను పోలినట్టుగానే ఉంటాయి. కాబట్టి యూజర్లు సులువుగా మోసపోయే అవకాశముంది. ఇక ఆ నకిలీ సైట్‌లో ఆఫర్లు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. నమ్మలేని ఆఫర్లు ఊరిస్తుంటాయి. ఈ ఆఫర్లు నిజమని నమ్మి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే అడ్డంగా బుక్కైపోతారు జాగ్రత్త.

 

అమెజాన్ లో వీటి మీద RS.90,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చుఅమెజాన్ లో వీటి మీద RS.90,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు

నకిలీ వెబ్‌సైట్‌

ఫ్లిప్‌కార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే మీ లాగిన్ డీటైల్స్ ఏవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీ అడ్రస్ మాత్రమే అడుగుతుంది. మీరు అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఈ లింక్ 10 మందికి షేర్ చేయాలన్న మెసేజ్ కనిపిస్తుంది. మీరు మెసేజ్ షేర్ చేసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ అవుతుందనుకుంటే పొరపాటే. అక్కడితో ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. మళ్లీ మొదటి నుంచి ఆర్డర్ చేయాలి. ఇలా మీరు ఎన్నిసార్లు చేసినా ఆర్డర్ చేయమని పేజీ ఓపెన్ కాదు. దాంతో ఇది నకిలీ వెబ్‌సైట్ అని అర్థమవుతుంది.ఈ వెబ్‌సైట్‌ ప్రొమోషన్ ను సంపాదించడానికి కొందరు మోసగాళ్లు రూపొందించిన వెబ్‌సైట్ ఇది. ఈ మెసేజ్ నమ్మారంటే మీరు టైమ్ వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు.

 

శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్..... ధరకు తగ్గ ఫీచర్స్ !!!!శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్..... ధరకు తగ్గ ఫీచర్స్ !!!!

మీరేం చేయాలి

ఇలాంటి మెసేజ్‌లు వస్తే మరి మీరేం చేయాలి? ఏం చేయొద్దు. డిలిట్ చేయడమే మంచిది. ఇలాంటి ఆఫర్లు మీరు నమ్మి, ఫార్వర్డ్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేశారంటే వాళ్లు కూడా మోసపోవాల్సి వస్తుంది. ఆఫర్ల పేరుతో ఇలాంటి మెసేజ్‌లు ఏవైనా వస్తే ఫార్వర్డ్ చేయడానికి ముందు ఈ ఆఫర్లు నిజమ కాదా అని ఓసారి ఆరా తీయడం చాలా మంచిది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ యొక్క ఒరిజినల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏ ఆఫర్ ఉన్నా అఫీషియల్ వెబ్‌సైట్‌లో వివరాలుంటాయి.

 

 

Best Mobiles in India

English summary
Users Must Be Aware Of Fake E-commerce Websites: Learn How To Take Steps Against Fraudulent Acts

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X