Home
News

ఈ టెక్నాలజీ మీ సాధారణ కార్లను ఎలక్ట్రిక్ కారుగా మార్చగలదు

ప్రపంచం మొత్తం అభివృద్ధి మీద ఎక్కువ దృష్టిని ఉంచాయి. తమను తాము అభివృద్ధి చేసుకోవడం కోసం వాతావరణాన్ని ఎక్కువగా కాలుష్యం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు వాహనాల వినియోగం ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు విడుదల చేసే పొగ కారణంగా కాలుష్యం కూడా అధికంగా పెరిగింది. దీనిని నివారించడానికి కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను కనుగొన్నారు.

EV కన్వర్షనల్ టెక్నాలజీ

ఎలక్ట్రిక్ వాహనాలను కనుగొన్న తరువాత పాత వాటిని ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారా? దానికి పరిష్కారం కోసం ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ సంస్థ ఇప్పుడు కొత్తగా EV కన్వర్షనల్ టెక్నాలజీని విడుదల చేసింది. కాలుష్యం మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి EV రెట్రోఫిటింగ్ లేదా కన్వర్షన్లు ఉత్తమ మార్గం అని స్టార్టప్ భరత్ మోబి సంస్థ తెలిపింది.

 

EV రెట్రోఫిటింగ్ / కన్వర్షనల్

కాలుష్య రహిత ఇండియా కోసం దోహదపడే సులభమైన మార్గాలలో EV కన్వర్షనల్ టెక్నాలజీ కూడా ఒకటి. ఇందుకోసం సహకారం కోరేందుకు ఢిల్లీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ యాజమాన్యం పేర్కొంది. అంతేకాకుండా స్టార్టప్ లాంచ్ ఈవెంట్‌లో వారు కొత్తగా మార్చబడిన ఎలక్ట్రిక్ సెడాన్‌ను ప్రదర్శించింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు అక్బర్ బేగ్ మాట్లాడుతూ డిల్లీ వాయు కాలుష్యానికి స్థిరమైన పరిష్కారంగా వారు EV రెట్రోఫిటింగ్ / కన్వర్షనల్ లను అందిస్తున్నారని చెప్పారు.

 

భారత్‌మొబి ఎలక్ట్రిక్ వాహనాల కన్వర్షనల్  వివరాలు

భారత్‌మొబి ఎలక్ట్రిక్ వాహనాల కన్వర్షనల్ వివరాలు

ఇప్పుడు మీరు ఒక్క చుక్క ఇంధనం లేకుండా మీ స్వంత కారును నడపవచ్చు. రెట్రోఫిటింగ్ కిట్‌తో మీ యొక్క కారు కాలుష్య రహిత, గేర్‌లెస్ మరియు శబ్దం లేని వాహనంగా మారుతుంది. ఇది కఠినమైన నిబంధనల నుండి మిమ్మల్ని తప్పించగలదు. ఈ టెక్నాలజీ భద్రతను మరింత పెంచుతుంది. కార్బన్ విద్యుత్ ఉత్పత్తి మిశ్రమాన్ని తగ్గిస్తుంది మరియు గ్రీన్హౌస్ వాయు ప్రమాదాలను నిరోధిస్తుంది. ఈ కిట్ విస్తృత శ్రేణి కార్ల భద్రత కోసం ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది సున్నితమైన, సమర్థవంతమైన మరియు ఇంధన రహిత డ్రైవ్‌ను అందిస్తుంది. ఈ కిట్ కోసం మీరు రూ.5 లక్షలు ఖర్చు చేయవలసి ఉంటుంది అని బేగ్ పేర్కొన్నారు.

 

భారత్‌మొబి

భారత్‌మొబి సహ వ్యవస్థాపకుడు అషర్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ కంపెనీ పెద్ద సంఖ్యలో వాహనాలను విద్యుదీకరించగల ప్రామాణిక ఈవీ కన్వర్షన్ కిట్‌ను రూపొందించింది. సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన మరియు స్థిరమైన ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడమే కంపెనీ లక్ష్యం.

 

 జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్

సాంప్రదాయ పెట్రోల్ / డీజిల్ కార్లను జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ వాహనాలుగా ఖచ్చితంగా మార్చవచ్చు. హ్యాచ్‌బ్యాక్‌లు మరియు సెడాన్‌లను మార్చడం ద్వారా సాంప్రదాయ కార్లను ఎలక్ట్రిక్ కారుగా మార్చవచ్చు. ఇలా చేయడంతో కస్టమర్‌కు ఆమోదయోగ్యమైన పరిధిని అందించవచ్చు. ఇటువంటి కిట్‌ ఆదారంగా అనేక ఇతర మోడళ్లను కూడా రెట్రోఫిట్ చేయవచ్చు.

 

EV స్వీకరణ

కంపెనీ యొక్క శ్రేయోభిలాషుల నుండి లభించిన ప్రతిస్పందనతో ఈ టెక్నాలజీ మరింత ఊపును అందుకున్నది. ఈ టెక్నాలజీను ఇంత త్వరగా అందరికి అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు మరియు దీనిని సృష్టించేటప్పుడు కలిగిన అనుభవాన్ని అందరితో పంచుకోవడం చాలా ఆసక్తిగా ఉందని కంపెనీ యొక్క ప్రతినిధి ఢిల్లీలో జరిగిన ఈవెంట్లో వెల్లడించారు. ఇది ప్రభుత్వ సహకారంతో EV స్వీకరణ రేటును పెంచాలని కోరుకుంటుంది.

 

 1969 మోడల్

ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం మరియు వాహన స్క్రాపింగ్ సమస్యలను దీర్ఘకాలంలో పరిష్కరించాలని కంపెనీ కోరుకుంటుంది. ఇప్పటికే 25 వాహనాలను కంపెనీ మార్పిడి చేసింది. ఈ టెక్నాలజీ పాతకాలపు మోడళ్లపై కూడా పనిచేస్తోందని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులలో ఒకటి ఫోర్డ్ ముస్తాంగ్ 1969 మోడల్ అని తెలిపారు. కన్వర్షనల్ ల కోసం ముందస్తు ఆర్డర్లు తీసుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Using EV Technology, Consumers Can Convert Their Conventional cars into electric vehicles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X