Home
News

ఫోన్ చేతిలో ఉంటే షాపింగ్ పిచ్చి ఎక్కువవుతుంది: స్టడీ నిజాలు

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతారు. యూట్యూబ్, ఫేస్‌‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్‌లలో విహరిస్తుంటారు. మన పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా వీడియోలు, ఫోటోలు

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతారు. యూట్యూబ్, ఫేస్‌‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్‌లలో విహరిస్తుంటారు. మన పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా వీడియోలు, ఫోటోలు చూస్తూ లైకులు, షేర్లతో హోరెత్తిస్తాం. స్టేటస్‌లు పెడుతూ సంబరపడుతుంటాం. అయితే ఇంత వరకు పరిమితమయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉంటే పర్సు గుల్ల అవుతోందట. అమెరికాలో ఓ స్టడీ దీని మీద కొన్ని ఆశ్చర్యకర విషయాలను వెల్లడించింది.

ఫోన్ చేతిలో ఉంటే షాపింగ్ పిచ్చి ఎక్కువవుతుంది: స్టడీ నిజాలు

ఫోన్ చేతిలో ఉంటే ఆటోమేటిగ్గా షాపింగ్ వైపు మనసు లాగుతుందట. మీకు తెలియకుండానే షాపింగ్ కు బానిసలవుతారని ఆ సర్వే నిగ్గు తేల్చింది. మీకు ఇష్టం లేకపోయినా ఆ వస్తువులు అంతగా అవసరం లేకపోయినా మీరు కొనేస్తారట.

230 మంది మీద ఈ ప్రయోగాలు

230 మంది మీద ఈ ప్రయోగాలు

యుఎస్ లోని Fairfield Universityకి చెందిన వారు ఈ మధ్య దీని మీద ఓ సర్వే నిర్వహించారు. ఈ స్టడీకి సంబంధించిన విషయాలను Academy of Marketing Scienceలో ప్రచురించారు. ఈ సర్వే ప్రకారం చాలామంది ఫోన్ చేతిలో ఉంటే ఆటోమేటిగ్గా ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీదకు వెళుతుందని తెలిపారు. దాదాపు 230 మంది మీద ఈ ప్రయోగాలు జరపగా వారంతా తమకు తెలియకుండానే షాపింగ్ చేసేస్తున్నామని అన్నారట.

షాపింగ్ వైపు మనసు లాగడమనేది

షాపింగ్ వైపు మనసు లాగడమనేది

అందరూ మొబైల్ తో ఛాటింగ్ చేస్తూ సోషల్ మీడియాలో గంటల తరబడి గడిపేస్తున్నారనే వార్తలు మనం విన్నాం. అయితే ఆశ్చర్యంగా ఇలా షాపింగ్ వైపు మనసు లాగడమనేది అర్థం కాని విషయమేనని వారంటున్నారు. అవసరం లేకపోయినా ఆ వస్తువును కొనేందుకు సిద్ధపడుతున్నారని సర్వేలో తేలింది. డిస్కౌంట్ లో వస్తుందనో లేక ఆఫర్ ఏదైనా ఉందనో తెలియగానే దాని బుక్ చేయడం చేస్తున్నారని సర్వే తెలిపింది.

ఫామ్‌జాకింగ్‌

ఫామ్‌జాకింగ్‌

సాధారణంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ పండగల సమయాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే సమయంలో హ్యాకర్స్‌ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ నార్టాన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం పండగల రద్దీని పురస్కరించుకొని హ్యాకర్లు ఆన్‌లైన్‌ షాపర్స్‌గా మారి ‘ఫామ్‌జాకింగ్‌' దాడులకు పాల్పతున్నారు. ఈ ప్రమాదకర హ్యాకింగ్‌ దాడి నుంచి బయటపడేందుకు నార్టాన్‌ సెక్యూరిటీ రీసెర్చర్లు కొన్ని కీలక సూచనలు చేశారు.

హ్యాకర్ల సర్వర్స్‌లోకి

హ్యాకర్ల సర్వర్స్‌లోకి

ఫామ్‌జాకింగ్‌'లో భాగంగా హ్యాకర్లు ఓ ప్రమాదకర జావా స్క్రిప్ట్‌ను ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లకు సంబంధించిన చెక్‌ అవుట్‌ వెబ్‌ పేజీలలో లోడ్‌ చేస్తారు. దీంతో ఈ పేజీలలో ఎంటర్‌ కాగానే నగదుకు సంబంధించిన వివరాలు హ్యాకర్ల సర్వర్స్‌లోకి వెళ్లిపోతాయి. ఈ హ్యాకింగ్‌ ఉచ్చులో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్, టికెట్‌ మాస్టర్‌ వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లు చిక్కుకున్నాయి. పర్యవసానంగా 3.8 లక్షల యూజర్లకు సంబంధించిన క్రెడిట్‌ కార్డుల వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి

విభిన్నమైన పాస్‌వర్డ్‌లను

విభిన్నమైన పాస్‌వర్డ్‌లను

ఫామ్‌జాకింగ్‌' దాడుల నుంచి ఆన్‌లైన్‌ అకౌంట్లను కాపాడుకునే క్రమంలో శక్తిమంతమైన, విభిన్నమైన పాస్‌వర్డ్‌లను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే పాస్‌వర్డ్‌లో అప్పర్‌కేస్, లోయర్‌ కేస్‌ సింబల్స్‌ ఇంకా నెంబర్స్‌ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకే రకమైన పాస్‌వర్డ్‌ను మల్టీపుల్‌ అకౌంట్‌లకు ఉపయోగించవద్దు.

అవి క్లిక్‌ చేయొద్దు

అవి క్లిక్‌ చేయొద్దు

పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజెస్‌ లేదా అటాచ్‌మెంట్స్‌ను ఓపెన్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి. ఇదే సమయంలో ర్యాండమ్‌ లింక్స్‌పై క్లిక్‌ చేయొద్దు. సైబర్‌ నేరగాళ్లు మీ మిత్రులకు చెందిన ఈ-మెయిల్‌ లేదా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా కూడా మాలీషియస్‌ లింక్స్‌ను పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వెబ్‌ లింక్‌పై క్లిక్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవటం మంచిది.

వైర్‌లెస్‌ కనెక్షన్స్‌తో జాగ్రత్త

వైర్‌లెస్‌ కనెక్షన్స్‌తో జాగ్రత్త

కొత్త నెట్‌వర్క్‌ కనెక్టెడ్‌ డివైస్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్నపుడు డీఫాల్ట్‌ పాస్‌వర్డ్‌ను కొత్త పాస్‌వర్డ్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలి. ఇదే సమయంలో మీ వైర్‌లెస్‌ కనెక్షన్‌లను శక్తిమంతమైన పాస్‌వర్డ్‌లతో ప్రొటెక్ట్‌ చేసుకోవడం ఎంతో మంచిదని రీసెర్చర్స్‌ సూచిస్తున్నారు

Best Mobiles in India

English summary
Using phones while shopping may make you buy more: Study
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X