స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి మెరుగైన ఫోటోలను తీయడానికి టిప్స్ & ట్రిక్స్

|

స్మార్ట్‌ఫోన్‌లు గత కొన్ని సంవత్సరాలుగా మెరుగైన ఫీచర్లతో అప్ డేట్ అవుతూ వచ్చాయి. అందులో భాగంగానే స్మార్ట్‌ఫోన్ కెమెరాల ఫీచర్స్ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. 2021 లో నేడు చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు అధికంగా కనీసం మూడు కెమెరా సెన్సార్‌లతో వస్తున్నాయి. అలాగే కొన్ని అధిక ధరల వద్ద లభించే ఫోన్లు గరిష్టంగా ఐదు లెన్స్‌లను ఉపయోగిస్తున్నాయి. నోకియా 9 ప్యూర్ వ్యూ 2019 సంవత్సరంలో పెంటా-రియర్ కెమెరా సిస్టమ్ తో భారతదేశంలో లాంచ్ చేయబడింది.

 
స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి మెరుగైన ఫోటోలను తీయడానికి టిప్స్ & ట్రిక్స్

ఒక దశాబ్దం క్రితం లాగా కాకుండా నేడు వినియోగదారులు తమ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని సంగ్రహించడానికి ఎక్కువగా తమ స్మార్ట్‌ఫోన్‌లపై ఆధారపడుతున్నారు. తరచూ ఫోటోలను తీయడానికి మీరు కూడా మీ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగిస్తూ ఉంటే కనుక మెరుగైన ఫోటోలను క్లిక్ చేయడానికి 5 సులభమైన చిట్కాలను మేము జాబితా చేసాము. ఈ చిట్కాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మెరుగైన స్మార్ట్‌ఫోన్ ఫోటోలను క్లిక్ చేయడానికి చిట్కాలు

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి మెరుగైన ఫోటోలను తీయడానికి టిప్స్ & ట్రిక్స్

టిప్ 1: మెరుగైన స్మార్ట్‌ఫోన్ ఫోటోలను క్లిక్ చేయడానికి మీరు షూటింగ్ చేయడానికి ముందు మీ ఫోన్ లెన్స్‌ని తప్పనిసరిగా శుభ్రంగా తుడవాలి. మీరు తరచుగా చూసే మసక ప్రభావం ఫిల్టర్ కాదు కావున లెన్స్‌లో నమోదయ్యే నూనె వంటి దానిని శుభ్రపరచాలి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి మెరుగైన ఫోటోలను క్లిక్ చేయడానికి లెన్స్‌ని శుభ్రమైన వస్త్రంతో తుడవండి. లెన్స్‌ని శుభ్రం చేయడానికి మీ T- షర్టును ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే దానిపై కొన్ని మార్కులు ఉంటాయి.

టిప్ 2: స్మార్ట్‌ఫోన్ లో మెరుగైన చిత్రాలను సంగ్రహించడానికి ఎక్స్‌పోజర్‌ను సమతుల్యం చేయడానికి స్క్రీన్ యొక్క ప్రకాశవంతమైన భాగాన్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితం లభిస్తుంది.

టిప్ 3: విరుద్ధమైన బ్యాక్ గ్రౌండ్ ని ఉపయోగించండి. దీని ద్వారా ఫోటో మునుపెన్నడూ లేనంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీకు ఉపయోగించడానికి విరుద్ధమైన బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రకాశవంతమైన నీలి ఆకాశంలో ఉండే బ్యాక్ గ్రౌండ్ ని ఉపయోగించండి. ఇది ఫోటో తీస్తున్న సమయంలో వస్తువును ప్రత్యేకంగా చేస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి మెరుగైన ఫోటోలను తీయడానికి టిప్స్ & ట్రిక్స్

టిప్ 4: మీరు ఏదైనా ఒక వస్తువును మరింత హైలైట్ చేయడానికి మీరు తప్పనిసరిగా పోర్ట్రెయిట్ మోడ్‌ని ఉపయోగించాలి. మీరు ఒక అందమైన పువ్వు, జంతువు లేదా ఏదైనా ఇతర వస్తువుల ఫోటోలను సంగ్రహించడానికి ప్రయత్నిస్తుంటే పోర్ట్రెయిట్ కెమెరా మోడ్‌ని ఉపయోగించండి. ఈ మోడ్ వస్తువును హైలైట్ చేయబడి మరియు బ్యాక్‌గ్రౌండ్ పూర్తిగా అస్పష్టంగా ఉండేలా నిర్ధారిస్తుంది. ఈ రోజుల్లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు పోర్ట్రెయిట్ మోడ్‌ను బ్యాక్ మరియు ఫ్రంట్ కెమెరాతో అందిస్తున్నాయి. పోర్ట్రెయిట్ మోడ్‌లోని ఫలితాలు మిమ్మల్ని తరచుగా ఆశ్చర్యపరుస్తాయి. మీరు కూడా దీనిని ఒకసారి ప్రయత్నించండి.

టిప్ 5: ఆరుబయట ఫోటోలను క్లిక్ చేస్తున్నప్పుడు మెరుగైన ఫోటోలను పొందడానికి సూర్యుడు మీ వెనుక ఉన్నాడని నిర్ధారించుకోవాలి. ఇంటి లోపల కూడా మెరుగైన ఫోటోలను క్లిక్ చేయడానికి అలాగే మెరుగైన ఫలితం కోసం అదే నియమాన్ని కాంతికి వర్తింపజేయండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Using Smartphone How to Take Better Photos: Here are Tips & Tricks

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X