ఆన్‌లైన్‌లో విమాన టిక్కెట్‌లను డిస్కౌంట్ ధర వద్ద పొందాలని చూస్తున్నారా? ఈ ట్రిక్స్ ఉపయోగించండి...

|

ప్రయాణం అనేది నేటి రోజులలో సాధారణం అయింది. బిజినెస్ పని మీద నెలలో అదిక రోజులు వివిధ చోట్లకు తిరిగే వారు అధికంగా ఉన్నారు. అయితే వీరు త్వరగా వారి యొక్క గమ్యస్థానానికి చేరడం కోసం విమాన ప్రయాణాలను ఎంచుకుంటూ ఉంటారు. గత కొన్ని నెలలుగా విమాన టిక్కెట్ల ధరలు కాస్త పెరిగాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. జెట్ ఇంధనం పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని టికెట్ల ధరలను పెంచినట్లు ఇప్పటికే చాలా సందర్భాలలో తెలిపారు.

 

ఆన్‌లైన్‌ను

ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల పనుల కోసం ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అనేక వెబ్ సైట్ లు మరియు యాప్ లు విమాన టిక్కెట్లపై డిస్కౌంట్ డీల్‌లు మరియు రాయితీలను కూడా అందిస్తున్నాయి. తరచుగా మీరు విమాన టిక్కెట్‌లను పొందడం కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతుంటే కనుక డబ్బును ఆదా చేయడానికి మీకు సహాయపడే కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు మరియు ఉపాయాలతో మీరు ఆన్‌లైన్‌లో తక్కువ ధరలోనే విమాన టిక్కెట్‌లను పొందడానికి ప్రయత్నించవచ్చు. అవి ఏమిటో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Google Exploreని ఉపయోగించడం

Google Exploreని ఉపయోగించడం

Explore అనేది అన్ని ప్రయాణ సంబంధిత అవసరాల కోసం గూగుల్ యొక్క ఒక-స్టాప్ గమ్యం. ఇది హోటళ్లు, విమాన బుకింగ్ వంటి వాటితో పాటుగా మరిన్నింటిని ఆన్‌లైన్‌లో పూర్తి చేయడానికి మరియు గూగుల్ తో ప్లాన్ చేయడంలో వినియోగదారులకు సహాయపడుతుంది. దీనికి అదనంగా టూల్ విమాన ఛార్జీల స్థాయిని కూడా చూపుతుంది. ఇది సాధారణ ప్రమాణాల ప్రకారం విమాన ఛార్జీ తక్కువగా ఉందా, విలక్షణంగా ఉందా లేదా అధికంగా ఉందా వంటి వివరాలను అన్నిటిని కూడా చూపుతుంది. సాధారణంగా ఉండే ధర కంటే తక్కువ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవడంలో ఈ వెబ్‌సైట్ మీకు సహాయం చేస్తుంది.

Chrome ప్లగిన్‌ల ధర తగ్గింపు
 

Chrome ప్లగిన్‌ల ధర తగ్గింపు

గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు విమాన యొక్క ఛార్జీలను పర్యవేక్షించి సమాచారం మొత్తాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా విమాన చార్జీల ధరలు తగ్గినప్పుడు బుక్ చేయడానికి మీకు తెలియజేయగల కొన్ని మూడవ పార్టీ ప్లగ్-ఇన్‌లను అందిస్తుంది. ఈ ఎంపికలలో ఫ్లైట్ ఫేర్ కంపేర్, చౌకైన ధరలు వంటివి మరిన్ని ఉన్నాయి.

పగటిపూట విమానాలను ఎంచుకోవడంతో డబ్బును ఆదా చేయవచ్చు

పగటిపూట విమానాలను ఎంచుకోవడంతో డబ్బును ఆదా చేయవచ్చు

మీరు విమానా ప్రయాణాన్ని ఎంచుకునేటప్పుడు పగటిపూట సమయాన్ని ఎంచుకోవడం ఉత్తమమే కాకుండా అనువుగా కూడా ఉంటుంది. ఎందుకంటే పగటిపూట విమాన ఛార్జీలు రాత్రి సమయంతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. ఈ ప్రయాణాన్ని ఎంచుకోవడం వల్ల కొంత డబ్బు కూడా ఆదా అవుతుంది. దీనికి సెట్ నియమాలు లేవని గమనించండి. ఏదైనా ఒక రోజులో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు చౌకైన విమాన ప్రయాణ ధరలను కనుగొనడానికి మీరు ఆ రోజులోని అన్ని విమాన ప్రయాణ ధరలను తనిఖీ చేయాలి.

అన్ని రోజుల విమాన ఛార్జీలను తనిఖీ చేయడం

అన్ని రోజుల విమాన ఛార్జీలను తనిఖీ చేయడం

మీరు ప్రయాణం చేయడం కోసం విమాన టిక్కెట్ల కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక వెబ్‌సైట్ సాధారణంగా దాదాపు ఒక వారం ముందు నుంచి కూడా విమాన ప్రయాణ వివరాలను అందుబాటులో ఉంచుతుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి అతి తక్కువ విమాన ఛార్జీని కూడా చూపుతుంది. మీరు మీ ప్రయాణ తేదీలతో అనువుగా ఉంటే కనుక విమానాలకు ముందు లేదా తర్వాత ఒక రోజు కోసం వెతకడానికి ప్రయత్నించండి. మీరు సాపేక్షంగా తక్కువ ధరలో విమానాన్ని పొందవచ్చు.

బ్యాంక్ ట్రావెల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లు

బ్యాంక్ ట్రావెల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లు

ఆన్‌లైన్‌లో టికెట్ లను బుక్ చేసుకోవడం కోసం అనేక బ్యాంకులు తమ యొక్క వినియోగదారుల కోసం ప్రత్యేక ట్రావెల్ కార్డ్‌లను అందిస్తున్నాయి. ఇవి విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకునేటప్పుడు అదనపు తగ్గింపులను అందిస్తాయి. కాబట్టి మీరు టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ బ్యాంక్‌తో ఏవైనా డిస్కౌంట్ లభిస్తుందో అని తనిఖీ చేయండి. ముఖ్యంగా ట్రావెల్ కార్డ్‌తో బుక్ చేసుకోవడంతో మీకు అదనపు తగ్గింపులు లభిస్తాయి. విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి దాన్ని ఉపయోగించడంతో సాధారణ ధర కంటే డిస్కౌంట్ ధరకు దీనిని పొందవచ్చు.

ఎయిర్‌లైన్ లాయల్టీ పాయింట్‌లు

ఎయిర్‌లైన్ లాయల్టీ పాయింట్‌లు

తమ కస్టమర్ బేస్ ను పెంచుకోవడానికి చాలా ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ లాయల్టీ ప్రోగ్రామ్‌లను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లైట్ బుకింగ్‌పై ఎప్పటికప్పుడు కొత్త కొత్త డీల్స్ మరియు డిస్కౌంట్లను అందజేస్తున్నాయి. కొన్ని విమానయాన సంస్థలు విమాన టిక్కెట్ల కోసం రీడీమ్ చేసుకోగల లాయల్టీ పాయింట్లు మరియు ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తాయి. వీటిని తనిఖీ చేసుకొని టికెట్ లను బుక్ చేసుకోవడం ఉత్తమం.

సోషల్ మీడియా ఆఫర్లు

సోషల్ మీడియా ఆఫర్లు

ఎయిర్‌లైన్స్ మరియు ఇతర ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అన్ని కూడా సాధారణంగా ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను అనుసరిస్తూ తరచుగా వారు అందిస్తున్న మరియు ప్రస్తుతం కొనసాగుతున్న డీల్‌లు మరియు ఆఫర్‌లను సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తూ ఉంటారు. వాటిని అనుసరించడం వలన మీరు మంచి డీల్స్ మరియు డిస్కౌంట్లను కనుగొనడంలో సహాయపడవచ్చు.

అజ్ఞాత మోడ్‌ని ఉపయోగించడం

అజ్ఞాత మోడ్‌ని ఉపయోగించడం

విమానయాన సంస్థలు లేదా ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కుక్కీల ద్వారా వినియోగదారుల సెర్చ్ నమూనాలను ట్రాక్ చేస్తాయి. ఉదాహరణకు మీరు న్యూ ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లే విమాన టిక్కెట్ కోసం వెతికినప్పుడు దానిని బుక్ చేసుకోవడానికి కొంత సమయం తర్వాత తిరిగి అదే సైట్ కి వచ్చినట్లయితే కనుక మీరు అధిక ధరను చూసే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి ఎల్లప్పుడూ అజ్ఞాత మోడ్‌ని ఉపయోగించండి లేదా కుక్కీలను తొలగించండి.

Best Mobiles in India

English summary
Using These Tricks Book Flight Tickets Through Online at Discount Prices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X