యుటివి ఇండియా గేమ్స్ సరిక్రొత్త రికార్డు..!

Posted By: Super

యుటివి ఇండియా గేమ్స్ సరిక్రొత్త రికార్డు..!

 

మొబైల్ అప్లికేషన్ డెవలపర్ కంపెనీ 'యుటివి ఇండియా గేమ్స్' ఓ సరిక్రొత్త మైల్ స్టోన్‌ని సాధించింది.  వివరాల్లోకి వెళితే యుటివి ఇండియా గేమ్స్ రూపొందించిన రా.వన్ జినెసెస్ అప్లికేషన్‌ని ప్రపంచ వ్యాప్తంగా 3 మిలియన్ల డౌన్‌లోడ్స్  చేసుకోగా, మరో అప్లికేషన్ 'క్రికెట్ ఫీవర్'ని 9 మిలియన్ల డోన్‌లోడ్స్  చేసుకున్నారని అధికారకంగా ప్రకటించారు. మొత్తంగా గనుక చూసుకున్నట్లేతే.. నోకియా స్టోర్ ద్వారా 50 మిలియన్ల డౌన్ లోడ్స్‌కు చేరుకున్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లేతే ఇప్పటి వరకు 57 మిలియన్ల డౌన్ లోడ్స్ జరిగాయని తెలిపారు.

యుటివి ఇండియా గేమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన లేటేస్ట్ అప్లికేషన్ రా.వన్ జెనెసిస్ అప్లికేషన్ విడుదల చేసి మూడు నెలలు గడవక ముందే 3 మిలియన్లు డౌన్ లోడ్స్ జరగడం పట్ల కంపెనీ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఇండియాలో ఇప్పటి వరకు ఫాస్ట్‌గా డౌన్ లోడ్ చేసుకున్న గేమ్ రా.వన్ జెనెసిస్ కావడం విశేషం.

కంపెనీ కేటలాగ్‌ని గనుక పరిశీలించినట్లేతే.. క్రికెట్, బాలీవుడ్, రేసింగ్, యాక్షన్, క్రీడలు లాంటి అన్నింటిని కలగలుపుకోని 300 వరకు గేమ్స్‌ని కలిగి ఉంది. వీటితో పాటు పాపులర్ గేమ్ అల్లాద్దిన్, ది న్యూ అడ్వంచర్, మెర్కురీ మెల్డ్ డౌన్, డి3 కమాండో, ఫోర్స్, టెర్రర్ ఎటాక్, మోనిస్టర్ ట్రక్ డ్యాష్ కూడా వీరికి చెందినదే. రేసింగ్, యాక్షన్, క్రికెట్ గనుక పోల్చితే రా.వన్ జెనరస్ గేమ్ ఎక్కువ డౌన్‌లోడ్స్‌గా  నమోదయ్యాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot