BSNLను రెండవ సిమ్‌గా వాడుతున్న వ్యాలిడిటీ లవర్స్ కోసం సరైన ప్రీపెయిడ్ ప్లాన్

|

భారత ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన యొక్క వినియోగదారుల సౌలభ్యం కోసం ఏడాది మొత్తం చెల్లుబాటుతో కేవలం రూ.797 ధరతో అత్యంత సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ఒక సంవత్సరం లేదా ఏడాది పొడవు చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్రయోజనంతో లభిస్తుంది. ఈ ధరకు సంబంధించి గందరగోళం ఉండవలసిన అవసరం లేకుండా స్పష్టంగా కంపెనీ మొత్తం సంవత్సరానికి రూ.797 ధరతో 2GB రోజువారీ డేటాను ఎలా ఆఫర్ చేస్తుంది అన్న విషయానికి వస్తే ఈ ప్లాన్ అందించే అన్ని రకాల ఉచితాలు మొదటి 60 రోజులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మీకు వాయిస్ కాలింగ్/డేటా/SMS ప్రయోజనాలు కావాలంటే మీరు వాటిని BSNL నుండి విడిగా కొనుగోలు చేయవలసి ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

సెకండరీ ఎంపికగా BSNL SIM

BSNL SIMని మీరు సెకండరీ ఎంపికగా ఉంచుకోవడానికి నిర్ణయించుకుంటే కనుక మీరు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే కనుక ఈ ప్లాన్ అందించే చెల్లుబాటు కారణంగా మీ SIM సంవత్సరం పొడవునా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే ఈ ప్లాన్‌తో BSNL ప్రస్తుతం 30 రోజుల అదనపు వాలిడిటీని కూడా అందిస్తోంది. కాబట్టి ఇప్పుడు 365 రోజులకు బదులుగా వినియోగదారులు 395 రోజుల చెల్లుబాటును కూడా పొందుతారు. వినియోగదారులు మొదటి 60 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. మొదటి 60 రోజుల తర్వాత మీరు మీ BSNL SIMని ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు చాలా సౌకర్యవంతంగా డేటా వోచర్‌లు లేదా SMS/వాయిస్ కాలింగ్ వోచర్‌లను కొనుగోలు చేయవచ్చు.

BSNL ప్రీపెయిడ్ ప్లాన్ సమ్మర్ ఆఫర్‌

BSNL ప్రీపెయిడ్ ప్లాన్ సమ్మర్ ఆఫర్‌

BSNL ప్రభుత్వ టెల్కో రూ.2399 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌తో సమ్మర్ ఆఫర్‌ ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 2GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను పొందుతారు. వీటితో పాటుగా కాలర్ ట్యూన్స్ సర్వీసును మరియు Eros Nowకి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ని కూడా లభిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్ 365 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. కానీ సమ్మర్ ఆఫర్ లో భాగంగా వినియోగదారులు 60 రోజుల అదనపు వాలిడిటీని కూడా పొందుతారు. అంటే వినియోగదారులు ఈ ప్లాన్‌తో మొత్తం 425 రోజుల చెల్లుబాటు కాలంతో అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు. BSNL రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్ విలువైనదేనా లేదా అనేది వినియోగదారులపై ఆధారపడి ఉంటుంది. ఇది అధిక మొత్తంలో డేటాను అది కూడా హై-స్పీడ్ తో కోరుకునే వ్యక్తుల కోసం రూపొందించిన ప్లాన్ కాదు. BSNLకి 4G నెట్‌వర్క్ లేకపోవడంతో ఇంటర్నెట్ బ్రౌసింగ్ చేయడానికి వీలుపడదు. దీని అర్థం మీరు 2GB రోజువారీ డేటాను పొందినప్పటికీ ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా లేకపోవడంతో అది మీకు ఉపయోగపడకపోవచ్చు. అయితే ఈ ప్లాన్ తగినంత మొత్తంలో డేటాను వినియోగిస్తూ కేవలం ఫోన్ కాల్స్ కోసం ఉపయోగిస్తున్న వారి కోసం అనువుగా ఉంటుంది. అటువంటి వారు ఎలాంటి చింత లేకుండా ఈ ప్లాన్ ను ఎంచుకోవచ్చు.

BSNL 4G నెట్‌వర్క్‌లు

BSNL 4G నెట్‌వర్క్‌లు

ఇండియాలో ప్రస్తుతానికి BSNLకి 4G నెట్‌వర్క్‌లు అందుబాటులో లేవు. కానీ ఈ సంవత్సరం చివరి నాటికి దేశంలోని అనేక ప్రాంతాల్లో BSNL యొక్క 4G నెట్‌వర్క్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి పూణెలో 4G నెట్‌వర్క్‌లు ప్రారంభించే అవకాశం ఉందని BSNL ఇండియా గురువారం తెలిపింది. ఇదే సమయంలో BSNL కేరళ అంతటా 4G నెట్‌వర్క్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి మీరు సెకండరీ సిమ్‌ను సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో దీర్ఘకాలికంగా ఉంచాలనుకుంటే కనుక మీరు BSNL అందించే రూ.797 ప్లాన్‌ని ప్రయత్నించవచ్చు.

Best Mobiles in India

English summary
Valid Prepaid Plan For Long Term Validity Lovers Using BSNL as Their Second SIM

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X