సైబర్ నేరగాడిగా మారిన కూరగాయల వ్యాపారి.. 6 నెలల్లో ఏకంగా రూ.21 కోట్లు చోరీ!
టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సైబర్ నేరగాళ్లు ఈ టెక్నాలజీని ఉపయోగించి అనేక మందిని మోసం చేస్తున్నారు. మాయమాటలు చెప్పి లేదా బెదిరించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. ఈ ఘటనలపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. ఎక్కచో చోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
షాకింగ్ విషయాలు: గతంలో నమోదైన సైబర్ నేరంపై దర్యాప్తు చేసిన అధికారులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. భారత్‌లో కరోనా ప్రవేశించకముందు రిషబ్ శర్మ కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించాడు. అయితే భారత్‌లో కరోనా ప్రభావంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. దీంతో ఎలాగైన డబ్బు సంపాదించాలనే ఆశతో వర్క్ ఫ్రం హోం స్కీమ్ పేరిట సైబర్ క్రైంలు చేయడం ప్రారంభించాడు.

అయితే కేవలం 6 నెలల కాలంలోనే ప్రజలను మోసం చేసి ఏకంగా రూ.21 కోట్లు దోచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. సుమారు 10 రాష్ట్రాల్లో 37 కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. దాంతోపాటు మరో 855 నేరాల్లోనూ పాత్ర ఉందని చెప్పారు.
అక్రమంగా నగదు బదిలీ : రిషబ్ శర్మను అక్టోబర్ 28న పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకు లావీదేవీలు ఆధారంగా చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతోపాటు మరిన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఇతర దేశాల్లో అంటే చైనా, సింగపూర్ నేరస్థుల ముఠాలతో పనిచేసి ఉండొచ్చని, అక్రమ మార్గాల్లో వారికి నగదు బదిలీ చేసి ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు.

కరోనా ముందు వరకు ఫరీదాబాద్‌లో రిషబ్ శర్మ కూరగాయలు విక్రయిస్తూ ఉండేవాడు. అయితే కరోనా ప్రభావం అనంతరం భారీగా నష్టపోయాడు. అయితే కుటుంబానికి అండగా ఉండేందుకు, పార్ట్‌టైం ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఆన్‌లైన్ నేరాలకు పాల్పడుతున్న తన పాత స్నేహితుడిని కలిశాడని పోలీసులు తెలిపారు.
సదరు పాత స్నేహితుడు.. రిషబ్‌కు కొన్ని ఫోన్ నంబర్లు ఇచ్చాడని, వారికి ఫోన్ చేసి తమ వద్ద మంచి ఉద్యోగాల అవకాశాలు ఉన్నట్లు చెప్పాలని సూచించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరి చేతిలో డెహ్రాడూన్‌కు చెందిన ఓ వ్యక్తి 20 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసి మోసం చేసినట్లు గుర్తించారు. హోటల్ గ్రూప్‌పై రివ్యూలు రాయాలంటూ మోసగించారని పోలీసులు పేర్కొన్నారు.
ఇందుకోసం ఓ టెలిగ్రామ్ గ్రూప్‌ను ఏర్పాటుచేశారు. అందులో సదరు హోటల్‌పై పాజిటివ్ రివ్యూలు రాయాలని సూచించారు. బాధితుడికి విశ్వాసం కలిగించేందుకు తొలుత రూ.10 వేల రూపాయలు అందించారు. అనంతరం భారీగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయంటూ నమ్మించారని పోలీసులు తెలిపారు. ఒక్కసారి నగదు అందుకున్నాక.. బాధితులతో పూర్తిగా సంబంధాలు తెంచుకొనేవారని పోలీసులు వెల్లడించారు.
రిషబ్‌పైన చీటింగ్, సహా ఇతర నేరాలను నమోదుచేశారు. విదేశాల్లోని ఇతర నేరస్థుల బృందాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ గ్రూప్.. భారత్‌లో కొంతమందిని నియమించుకొందని, వారి ద్వారా బ్యాంక్ అకౌంట్లు తెరిచి, నగదు దోచుకోవడం సహా అక్రమ మార్గంలో నగదును విదేశాలకు పంపించేందుకు ఉపయోగించేవారని తెలిపారు. భారత్‌లోని సుమారు 10 రాష్ట్రాల్లో అనేక నేరల్లో రిషబ్ పాత్ర ఉందని పోలీసులు వెల్లడించారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








