శామ్సంగ్ గెలాక్సీ S10 5G ప్రీ-ఆర్డర్స్ ను విడుదల చేసిన వెరిజోన్
గత నెల శామ్సంగ్ గెలాక్సీ S10 5G ను వెరిజోన్ మే నెలలో లాంచ్ చేస్తున్నట్లు సూచనలు వచ్చింది
గత నెల శామ్సంగ్ గెలాక్సీ S10 5G ను వెరిజోన్ మే నెలలో లాంచ్ చేస్తున్నట్లు సూచనలు వచ్చింది. ఈ రోజు క్యారియర్ ఆ విడుదల తేదీని ధ్రువీకరించారు.

ఫోన్ యొక్క ప్రీ-ఆర్డర్ పేజీ ప్రత్యక్షంగా ఉంది మరియు మీరు ఈ బ్రాండ్ కొత్త 5G ఫోన్లను మే 16 నాటికి అందుకోవచ్చు.

మోడల్ కాస్ట్
256GB మోడల్ కాస్ట్ $ 1,299 మరియు 512GB వేరియంట్ కాస్ట్ $1,399లు. ఫోన్ మాత్రం మెజెస్టిక్ బ్లాక్ మరియు క్రౌన్ సిల్వర్ కలర్ వైవిధ్యాలలో వస్తుంది.

ముందస్తు ఆర్డర్ పొందినవారికి
ముందస్తు ఆర్డర్ పొందినవారికి బోనస్ గా ఒక జత గెలాక్సీ బడ్స్ మరియు శామ్సంగ్ వైర్లెస్ ఛార్జింగ్ బ్యాటరీ ప్యాక్లను అందుకోవచ్చు.

వెరిజోన్
గెలాక్సీ S10 5G ప్రీ-ఆర్డర్లతొ పాటు 5G కవరేజ్ను 20 US నగరాలలొ పొందవచ్చు అని వెరిజోన్ ప్రకటించింది. ఈ జాబితాలో అట్లాంటా, బోస్టన్, షార్లెట్, సిన్సినాటి, క్లీవ్లాండ్, కొలంబస్, డల్లాస్, దేస్ మోయిన్స్, డెన్వర్, డెట్రాయిట్, హూస్టన్, ఇండియానాపోలిస్, కాన్సాస్ సిటీ, లిటిల్ రాక్, మెంఫిస్, ఫీనిక్స్, ప్రొవిడెన్స్, శాన్ డియాగో, సాల్ట్ లేక్ సిటీ మరియు వాషింగ్టన్ DC ఉన్నాయి.

5G నెట్వర్క్
ఈ విస్తరణ కోసం క్యారియర్ ఖచ్చితమైన సమయాన్ని కేటాయించలేదు ఈ ప్రాంతాలలొ ఈ సంవత్సరం చివరకి 5G నెట్వర్క్ కవరేజ్ను విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది


Click it and Unblock the Notifications








