మార్చి 9నుండి ఫేస్‌బుక్ ద్వారా మాత్రమే...!

Posted By: Super

 మార్చి 9నుండి ఫేస్‌బుక్ ద్వారా మాత్రమే...!

ప్రముఖ ఈమెయిల్ మ్యూజిక్ వీడియో సైట్ 'వీవో' తమ యొక్క యూజర్స్‌కు మార్చి 9వ తారీఖు నుండి రిజిస్ట్రేషన్స్‌ని ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా అంగీకరించడతాయని తెలిపింది. ఇది మాత్రమే కాకుండా త్వరలో వివో.కామ్ వెబ్‌సైట్ రానుంది. గత సంవత్సరం జరిగిన 'ఎఫ్ 8' కార్యక్రమంలో ఫేస్‌బుక్ ఓపెన్ గ్రాఫ్‌ని విడుదల చేసిన సందర్బంలో వీవో వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు ఫేస్‌బుక్ ఇంటిగ్రేషన్ ద్వారా వీవోలో ఉన్న మ్యూజిక్ వీడియోలను స్నేహితులతో షేర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

 మార్చి 9నుండి ఫేస్‌బుక్ ద్వారా మాత్రమే...!

వినియోగదారులు గమనించాల్సిన విషయం మరోకటి ఏమిటంటే వీవో కంపెనీ యూనివర్సిల్ మ్యూజిక్ గ్రూప్‌కి చెందిన కంపెనీ అని రూమర్స్ వస్తున్నాయి. ఫేస్‌బుక్ దీనితో కలవడానికి కారణాలను విశ్లేషిస్తే  సెర్చ్ ఇంజన్ గెయింట్ ప్రముఖ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌ని కలిగి ఉన్న విషయం విదితమే. సోనీ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్, అబుదాబి మీడియా కంపెనీ అయిన వీవోని ఫేస్‌బుక్‌లో ఇంటిగ్రేట్ చెయ్యడం వల్ల యూట్యూబ్‌కి కొంత పోటీని ఇవ్వొచ్చనే భావనలో ఉన్నారు.

ఫేస్‌బుక్‌లో ఎకౌంట్‌ని కలిగి ఉన్న మ్యూజిషియన్స్ అప్పుడప్పుడు పాటలకు సంబంధించిన ట్రాక్‌లను అభిమానుల కోసం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. వీవో వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు ఫేస్‌బుక్ ఎకౌంట్ ద్వారా డైరెక్టుగా వీవో.కామ్‌కు కనెక్టు అవ్వోచ్చు. ఫేస్‌బుక్ ఎకౌంట్ ద్వారా వీవో వెబ్‌సైట్ లోకి లాగిన్ అయి వీవో మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్‌ని సొంతం చేసుకోండి.

 మార్చి 9నుండి ఫేస్‌బుక్ ద్వారా మాత్రమే...!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot