Home
News

వొడాఫోన్ ఐడియా యూజర్లకు అదిరిపోయే న్యూస్.. 5G నెట్ వచ్చేస్తోంది.. ధర అన్నిటికంటే తక్కువే..!

Vi 5G launches: దేశంలో 5G సేవలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న Vi యూజర్లకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు వొడాఫోన్ ఐడియా (Vi) తమ 5G సర్వీసులను లాంచ్ చేయడానికి నడుం బిగించింది. ఇప్పటికే ఎయిర్‌టెల్, జియోలు 5G రేసులో పరుగులు తీస్తున్నాయి. వెనకబడిపోయిన Vi ఇప్పుడు ఆ రేసులోకి దిగడానికి సిద్ధమయ్యింది. 2025 మార్చి నుంచి Vi 5G సేవలు మొదలవుతాయని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

మొదటగా ముంబై నగరంలో Vi 5G సర్వీసులు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత 2025, ఏప్రిల్‌లో బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ, పాట్నా నగరాల్లో కూడా 5G సేవలు అందుబాటులోకి వస్తాయి. మరిన్ని సిటీలలో కూడా 5Gని ఎక్స్‌పాండ్ చేస్తామని Vi చెబుతోంది కానీ, ఆ లిస్ట్ మాత్రం ఇంకా చెప్పలేదు.

Vi 5G Launching March 2025  Cheaper Plans to Take on Jio  amp amp  Airtel

గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం మినిమమ్ 5G రోల్‌ ఔట్ చేయాల్సిన టైమ్ లైన్‌ని Vi ఆల్రెడీ క్రాస్ చేసింది. 2024, డిసెంబర్ నాటికే 17 నుంచి 19 టెలికాం సర్కిళ్లలో 5G నెట్‌వర్క్‌ను రెడీ చేసింది. కానీ, అది ఇంకా కమర్షియల్ లాంచ్ మాత్రం కాదు. ఇక Vi 5G స్పీడ్, స్పెక్ట్రమ్ వివరాలతో పాటు స్పీడ్‌ వంటి వివరాలు తెలుసుకుందాం.

* స్పీడ్

Vi 5G యూజర్లకు ఎంత స్పీడ్ ఇస్తుందో ఇంకా అఫీషియల్‌గా చెప్పలేదు. కానీ, ట్రయల్స్‌లో మాత్రం సత్తా చాటింది. పూణేలో ఏకంగా 5.92 Gbps డౌన్‌లోడ్ స్పీడ్ చేరుకుంది. బెంగళూరులోని MG రోడ్ మెట్రో స్టేషన్‌లో 1.2 Gbps స్పీడ్ అందుకుంది. కమర్షియల్ లాంచ్ కోసం 3.5GHz (C-బ్యాండ్), 1,800MHz స్పెక్ట్రమ్‌ను వాడతారు.

ఈ ఫ్రీక్వెన్సీలతో హై-స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు మంచి కవరేజ్ కూడా ఉంటుందని Vi చెబుతోంది. Vi 5G ప్లాన్స్, ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుంటే.. Vi 5G ప్లాన్స్ జియో, ఎయిర్‌టెల్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ కంటే ఏకంగా 15% తక్కువ ధరకే ఉంటాయట. అంటే 5G ఇండస్ట్రీలో ప్రైస్ పోటీ ఉంటుందని చెప్పవచ్చు.

* 4G నెట్‌వర్క్‌ కూడా

5Gతో పాటు Vi 4G నెట్‌వర్క్‌ను కూడా బాగా డెవలప్ చేస్తోంది. 2024, డిసెంబర్ నాటికి 4G కవరేజ్ ఏకంగా 4.1 కోట్ల మందికి పెరిగింది. మొత్తం 107 కోట్ల మందికి Vi 4G నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను భారీగా పెంచారు. 4 వేలకు పైగా కొత్త బ్రాడ్‌బ్యాండ్ టవర్లను యాడ్ చేశారు.

ఐడియాతో మెర్జ్ అయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున బ్రాడ్‌బ్యాండ్ టవర్లను పెంచడం ఇదే మొదటిసారి. Vi 4G యూజర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. Q3 FY24లో 12.56 కోట్లుగా ఉన్న 4G యూజర్లు, Q3 FY25కి వచ్చేసరికి 12.6 కోట్లకు చేరారు. కానీ, టోటల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మాత్రం తగ్గింది.

అదే టైమ్‌లో 21.52 కోట్ల నుంచి 19.98 కోట్లకు పడిపోయింది. అంటే 1.54 కోట్ల మంది యూజర్లను Vi కోల్పోయింది. యూజర్లు తగ్గినా కానీ Vi రెవెన్యూ మాత్రం పెరిగింది. యూజర్ల నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) క్యూ2 FY25లో రూ.166 ఉండగా, క్యూ3కి వచ్చేసరికి రూ.173కి పెరిగింది. అంటే 4.7% గ్రోత్ కనిపించింది.

దీనికి కారణం టారిఫ్ రేట్లు పెంచడం, యూజర్లు ఎక్కువ ధర ఉన్న ప్లాన్స్‌ను ఎంచుకోవడమే. ముందు ముందు భారీగా ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌ను స్పీడ్ చేస్తామని Vi సీఈఓ అక్షయ మూంద్ర చెప్పారు. 5G రోల్‌ అవుట్ ఫేజ్ ల వారీగా జరుగుతుందని, మెయిన్ ఏరియాల మీద ఫస్ట్ ఫోకస్ చేస్తామని తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vi 5G launches in India from March 2025, starting with Mumbai. Plans will be cheaper than Jio and Airtel, offering high speeds.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X