100GB డేటా ప్రయోజనంతో VI కొత్త ప్రీపెయిడ్ ప్లాన్!!!
ప్రముఖ టెలికామ్ సంస్థ వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఇటీవల VI గా రీబ్రాండ్ చేయబడింది. టెల్కో ఇప్పటికే తన క్రొత్త వెబ్‌సైట్ ను కొత్త సమర్పణలతో అప్ డేట్ చేసింది. రీబ్రాండింగ్ తరువాత వోడాఫోన్ మరియు ఐడియా తన వినియోగదారులకు తక్కువ ధరలోనే ప్లాన్లను అందిస్తున్నాయి.

VI క్రొత్త వెబ్‌సైట్
కస్టమర్ సర్వీస్ నుండి ఇతర సేవల వరకు ప్రతిదాని కోసం VIను కొత్తగా క్రమబద్ధీకరించింది. టెల్కో ఇప్పటికి ఇంటి నుండి పనిచేసే వారి కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. VI టెల్కో వర్క్ ఫ్రమ్ హోమ్ సమర్పణలకు మరోక కొత్త ప్లాన్ ను జతచేసింది. రూ .351 ధర వద్ద లభించే ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

VI రూ.351 వర్క్ @ హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు
వోడాఫోన్ ఐడియా VI కొత్తగా విడుదల చేసిన రూ.351 విలువైన వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 56 రోజుల మొత్తం చెల్లుబాటు కాలానికి 100GB 2G / 3G / 4G డేటాను అందిస్తుంది. కాని ఇందులో వాయిస్ కాలింగ్ ప్రయోజనం మాత్రం అందించదు. ఈ ప్లాన్ గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది వాయిస్ కాలింగ్‌ను అందించే ప్రీపెయిడ్ ప్లాన్ కానప్పటికీ క్రియాశీల వాయిస్ కాలింగ్ ప్లాన్ అవసరం లేనివారికి మీ యొక్క ప్రస్తుత ప్లాన్ పైన ఈ యాడ్-ఆన్ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

VI వాయిస్ కాలింగ్ ప్రయోజనాల ప్లాన్‌లు
VI యొక్క రూ.351 విలువైన కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల స్టాండ్-అలోన్ యాక్సిస్ ను కలిగి ఉంది. ఇది కస్టమర్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారా లేదా అనే దానిపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కస్టమర్ కోరుకుంటే రూ.351 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ తో పాటు యాక్టివేట్ చేయబడిన చిన్న టాక్ టైమ్ ప్లాన్‌ను కూడా పొందవచ్చు. ఈ విధంగా కస్టమర్ వేర్వేరు ప్లాన్లతో వాయిస్ కాలింగ్ మరియు డేటా ప్రయోజనాలను పొందవచ్చు.

VI రూ.251 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్
VI రూ.251 ధర వద్ద వర్క్ ఫ్రమ్ హోమ్ యాడ్-ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 50GB 2G / 3G / 4G డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్‌లో కూడా వాయిస్ కాలింగ్ ప్రయోజనం లభించదు. ఈ ప్యాక్ యొక్క చెల్లుబాటు కేవలం 28 రోజులు మాత్రమే. తక్కువ మొత్తంలో అధిక డేటాను కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

VI రూ.351 ప్లాన్ vs VI రూ.251 ప్లాన్
VI కొత్తగా ప్రవేశపెట్టిన రూ .351 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాక్ తో రూ.251 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాక్ ను పోల్చిచూస్తే కనుక రూ .351 ప్లాన్ విలువైనదిగా ఉంది. ఎందుకంటే రెండు ప్లాన్‌ల మధ్య కేవలం రూ.100 మాత్రమే తేడా ఉంది. కానీ డేటా ప్రయోజనాలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. వినియోగదారులు రూ.351 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌తో కేవలం 100 రూపాయలు అదనంగా చెల్లించి రూ.251 ప్యాక్ కంటే రెండు రెట్లు ప్రయోజనాలను పొందవచ్చు.

VI యాడ్-ఆన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌లలో బెస్ట్ ఏది?
వోడాఫోన్ ఐడియా యొక్క రూ .251 యాడ్-ఆన్ ప్యాక్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే కేవలం 100 రూపాయలు అదనంగా చెల్లించడం ద్వారా రూ.351 ప్యాక్ తో కస్టమర్ 56 రోజుల చెల్లుబాటు కాలానికి అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. డేటా కూడా రూ.251 ప్యాక్‌లో 50GB మాత్రమే కానీ రూ.351 ప్యాక్‌తో రెట్టింపుగా 100GB డేటాను పొందవచ్చు. కాబట్టి కస్టమర్ రూ .351 ప్యాక్‌ను రెండుసార్లు రీఛార్జ్ చేసుకున్నప్పుడు రూ .251 కంటే అదనపు ప్రయోజనాలు పొందడంతో పాటు వినియోగదారునికి రూ.151 ఆదా కూడా చేస్తుంది.


Click it and Unblock the Notifications








