Vi యూజర్లకు గుడ్ న్యూస్!! MFine భాగస్వామ్యంతో వైద్యులను సంప్రదించడం మరింత సులువు..

|

వోడాఫోన్ ఐడియా (Vi) తన యొక్క యూసర్ బేస్ ను పెంచుకోవడానికి కొత్తగా తన వినియోగదారులకు సులభమైన మరియు వేగవంతమైన వైద్య సంప్రదింపులను అందించే లక్ష్యంతో టెల్కో MFine తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ టెక్నాలజీ యొక్క వినియోగంను అనేక విదాలలో పెంచుకుంటున్నారు. స్మార్ట్ఫోన్ ద్వారా ఫోన్ కాల్ లేదా టెక్స్ట్ లను పంపడం ద్వారా వైద్యులతో సంప్రదింపులు చేయడం మరియు కరోనావైరస్ ప్రమాదం బారిన పడకుండా మరియు పడ్డవారు వైద్య సహాయం పొందడం సులభం మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. Vi వినియోగదారులకు MFineతో భాగస్వామ్యం ఎంతలా ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

600 భాగస్వామి ఆసుపత్రులతో కనెక్ట్ అయ్యే అవకాశం

600 భాగస్వామి ఆసుపత్రులతో కనెక్ట్ అయ్యే అవకాశం

ఇండియాలో AI- పవర్డ్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్ లో పనిచేసే మొట్టమొదటి టెలికాం Vi కావడం గమనార్హం. MFine సుమారు 600కి పైగా భాగస్వామి ఆసుపత్రులలో 35 ప్రత్యేకతలతో 4,000 మంది వైద్యులను కలిగి ఉంది. ఫోన్ కాల్స్ ద్వారా Vi వినియోగదారులు వారి వైద్య సమస్యల గురించి సంప్రదించి వారి యొక్క సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కారాన్ని పొందగలుగుతారు.

Vi - MFine భాగస్వామ్యం

Vi - MFine భాగస్వామ్యం

Vi వినియోగదారులు భాగస్వామి ఆసుపత్రులతో లేదా వైద్యులతో మెసేజ్ చాట్లలో పాల్గొనవచ్చు. అలాగే అవసరమైతే వీడియో కాల్‌ల ద్వారా సంప్రదించడాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఏ వైద్యుడు మరియు ఏ ఆసుపత్రిని ఎన్నుకోవాలనుకుంటున్నారనే దానిపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. రోగులు లేదా వినియోగదారులు వారి వైద్య పరిస్థితికి చికిత్స కోసం ఖచ్చితమైన సూచనను పొందడానికి MFine యొక్క ప్లాట్‌ఫామ్‌లో అవసరమైన ఫోటోలు, ప్రిస్క్రిప్షన్లు, గతంలోని మెడికల్ రికార్డులు మరియు అవసరమైన వివరాలను అప్‌లోడ్ చేసే అవకాశాన్ని కూడా కలిగి ఉంటారు.

MFine టెలిమెడిసిన్

MFine టెలిమెడిసిన్

Vi - MFine భాగస్వామ్యంతో వినియోగదారులు వైద్య సేవలను వినియోగించే విధానాన్ని మార్చడానికి మరియు సాధారణంగా ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను చూడటానికి కట్టుబడి ఉంటుంది. వైద్యుడు లేదా నిపుణుడితో సంప్రదింపులు జరపడానికి వినియోగదారులు తమ ఇంటి నుండి బయటకు కూడా రావలసిన అవసరం లేదు కాబట్టి ఇది కరోనావైరస్ బారిన పడకుండా వారిని సురక్షితంగా ఉంచుతుంది.

MFine హెల్త్‌కేర్

MFine హెల్త్‌కేర్

Vi తో భాగస్వామ్యం ద్వారా హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం టెల్కో యొక్క కస్టమర్ బేస్ ను యాక్సెస్ చేయగలదు. గత ఆరు నెలల్లో ఇంతకుముందు టెలిమెడిసిన్ ఉపయోగించని వ్యక్తులు ఇప్పుడు భారతదేశం అంతటా వైద్యులు మరియు ఆసుపత్రులతో సంప్రదిస్తున్నారని చౌదరి చెప్పారు. పరిమిత ఆరోగ్య సదుపాయాలతో దేశంలోని చిన్న నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు MFine యొక్క సేవలు ప్రయోజనకరంగా ఉంటాయి.

Best Mobiles in India

English summary
Vi-MFine Partnership: Much Easier to Consult a Doctor and Medical Consultation

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X