Home
News

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో రూ.125 MPL & రూ.200 జోమాటో విలువ గల ప్రయోజనాలు

Vi(వోడాఫోన్ ఐడియా) ఇప్పుడు తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో వినియోగదారులకు కొత్తరకమైన ప్రయోజనాలను అందిస్తోంది. కొద్ది రోజుల క్రితం Vi తన RedX పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అప్‌డేట్ చేసింది. ఇది వినియోగదారులకు 4G డేటా వేగాన్ని అందిస్తుందని మరియు క్లెయిమ్‌ను పూర్తిగా ప్లాన్ల నుండి తొలగించిందని తెలిపారు. అయితే టెల్కో యొక్క కస్టమర్ సపోర్ట్ ద్వారా దీనిని పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు RedX ప్లాన్ కస్టమర్లకు ప్రాధాన్యత లభిస్తుంది. Vi యొక్క పోస్ట్ పెయిడ్ ప్లాన్లు ఇప్పుడు తన వినియోగదారులకు జోమాటో మరియు MPL వంటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల సరికొత్త ప్రయోజనాలు

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల సరికొత్త ప్రయోజనాలు

Vi ప్రస్తుతం తన వినియోగదారుల కోసం అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది. ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే ప్రతి ప్లాన్‌లతో MPL మరియు Zomato యొక్క రెండు కొత్త ప్రయోజనాలను కొత్తగా చేర్చబడ్డాయి. జోమాటో అనేది తన వినియోగదారులకు ఫుడ్ ను ఇంటి వద్దకి అందించే సంస్థ మరియు MPL(మొబైల్ ప్రీమియర్ లీగ్) ఇ-స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ సాయంతో మీరు డబ్బును గెలుచుకోనే అవకాశం ఎక్కువగా ఉంది.

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ జోమాటో ప్రయోజనాలు

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ జోమాటో ప్రయోజనాలు

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో కొత్తగా అందిస్తున్న జోమాటో ప్రయోజనం విషయానికి వస్తే వినియోగదారులు వారు ఒక రోజులో ఫుడ్ యొక్క ఆర్డర్‌లపై రూ.200 వరకు తగ్గింపు పొందుతారు. వాస్తవానికి ఆఫర్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి. ప్రతి ఆర్డర్ కొనుగోలుపై రూ.200 తగ్గింపు లభించదు. వీటి మీద లభించే డిస్కౌంట్ అనేది కొనుగోలు సమయంలో ఉత్పత్తి చేయబడిన బిల్లు మొత్తం మీద ఆధారపడి ఉంటుంది.

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ MPL ప్రయోజనాలు

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ MPL ప్రయోజనాలు

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో కొత్తగా అందిస్తున్న MPL ప్రయోజనం విషయానికి వస్తే వినియోగదారులు ఇ-స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో గేమ్లను ఆడటానికి రూ.125 MPL నగదును గెలుచుకోవడానికి అర్హతను అందిస్తుంది. జోమాటో మరియు ఎంపిఎల్ రెండూ వినియోగదారులకు అందించే కొత్త ప్రయోజనాలు.

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాలు

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాలు

Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో పాత ప్రయోజనాలు ఇప్పటికీ అలాగే అందిస్తున్నాయి. టెల్కో అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో దేనినైనా కొనుగోలు వారికి అమెజాన్ ప్రైమ్ వీడియోను ఇప్పుడు కూడా ఉచితంగా పొందడానికి అర్హులు అవుతారు. ఈ రెండు కొత్త ప్రయోజనాలు కూడా Vi Redx ప్లాన్ లో చేర్చబడ్డాయి.  Vi Redx ప్లాన్ ఇప్పటికి వినియోగదారులకు రూ.5,988 విలువైన ఒక సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ OTT ప్రయోజనాలను అందిస్తుంది. టెల్కో యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో వినియోగదారులకు Vi మూవీస్ మరియు Vi టివి వంటి యాప్ లకు ఉచిత యాక్సిస్ ను కూడా అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vi postpaid Every plan Offers MPL and Zomato Benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X