Home
News

Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇతర టెల్కోలకు ఎంత బిన్నంగా ఉన్నాయో ఓ లుక్ వేయండి..

వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థ తన యొక్క వీకెండ్ డేటా రోల్‌ఓవర్ సదుపాయాన్ని ఏప్రిల్ వరకు పొడిగించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ వీకెండ్ డేటా రోల్‌ఓవర్ సదుపాయంతో పాటు Vi టెలికాం మరికొన్ని ఇతర ఆఫర్లను అదనంగా కలిగి ఉంది. Vi యొక్క డబుల్ డేటా ఆఫర్లు ఎక్కువ ప్రజాదరణను పొందుతుండగా ఎంచుకున్న కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో వినియోగదారులకు 5GB వరకు అదనపు డేటాను అందించే మరొక డేటా ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. Vi అందించే 'ఎక్స్‌ట్రా డేటా' ఆఫర్‌లో భాగంగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందిస్తున్నాయి. ఈ అదనపు డేటా ఆఫర్‌ను పొందడానికి వినియోగదారులు Vi మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ప్లాన్‌లను రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఈ ఎక్స్‌ట్రా డేటా ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అదనపు డేటా ఆఫర్‌ను అందించే Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు

అదనపు డేటా ఆఫర్‌ను అందించే Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఎక్స్‌ట్రా డేటా ఆఫర్‌లో లభించే మొదటి మరియు సరసమైన రూ.149 Vi ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ 2GB డేటా మరియు 1GB అదనపు డేటాను అందిస్తుంది. రూ.219 ప్లాన్ రోజుకు 1GB డేటాతో పాటుగా 2GB అదనపు డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. రూ.249 ధర వద్ద లభించే ప్లాన్ రోజుకు 1.5Gb డేటాతో పాటుగా 5GB అదనపు డేటా 28 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. రూ.399 ధర వద్ద లభించే ప్లాన్ 56 రోజుల వాలిడిటీకి రోజుకు 1.5GB డేటాతో పాటుగా 5Gb అదనపు డేటా లభిస్తుంది. చివరిగా రూ.599 ధర వద్ద లభించే ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో రోజుకు 1.5GB డేటాతో పాటుగా 5Gb అదనపు డేటాతో వస్తుంది. ఈ ప్లాన్‌లు అన్ని కూడా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్, , రోజుకు 100SMS ప్రయోజనాలతో లభిస్తాయి.

VI RED ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల అదనపు OTT ప్రయోజనాలు

VI RED ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల అదనపు OTT ప్రయోజనాలు

వొడాఫోన్ ఐడియా సంస్థ తన యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో మొదటి కనెక్షన్ల కోసం అమెజాన్ ప్రైమ్ చందాను ఉచితంగా అందిస్తుంది. వీటితో పాటుగా మొదటి మరియు రెండవ కనెక్షన్ల కోసం Vi మూవీస్ & టివి సబ్స్క్రిప్షన్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రూ.1,099 ధర వద్ద గల REDX ఫ్యామిలీ ప్లాన్ Vi యొక్క వెబ్‌సైట్‌లో ఇప్పుడు జాబితా చేయబడింది. అయితే కంపెనీ ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేదు. Vi ఇప్పటికే వ్యక్తిగత వినియోగదారుల కోసం 1,099 రూపాయల ధర వద్ద REDX ప్లాన్‌ను అందిస్తోంది.

Vi అందిస్తున్న కాంబో ప్లాన్‌ల వివరాలు

Vi అందిస్తున్న కాంబో ప్లాన్‌ల వివరాలు

Vi టెలికాం సంస్థ కొత్తగా రూ.65 ధర వద్ద అందించే కాంబో ప్లాన్ ప్రస్తుతం ఉన్న రూ.39, రూ.49, రూ.79 మరియు రూ.95 కాంబో ప్లాన్‌ల జాబితాలో చేరింది. ఈ కాంబో ప్లాన్‌ల యొక్క ప్రయోజనాలలో పరిమిత టాక్ టైమ్ మరియు పరిమిత 2G / 3G / 4G డేటా ప్రయోజనాలు ఉన్నాయి. వాయిస్ కాల్స్ సెకనుకు ఒక పైస చొప్పున వసూలు చేయబడతాయి. ఈ ప్లాన్‌లను ఎంచుకోవడానికి గల కీలకమైన అంశాలలో సిమ్ యాక్టీవ్ లో ఉండడానికి మరియు తక్కువగా ఫోన్ కాల్స్ చేస్తున్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్ ప్లాన్‌లు

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా (Vi) టెలికాం సంస్థ రూ.299, రూ.449, రూ.699 ధర వద్ద గల మూడు ప్లాన్‌లతో కంపెనీ ఇప్పుడు డబుల్ డేటాను అందిస్తోంది. ఇంతకు ముందు ఐదు ప్లాన్‌లతో ఈ డబుల్ డేటా ఆఫర్ ను అందించేది. రూ.299 ధర వద్ద లభించే ఈ ప్లాన్ వినియోగదారులకు అందించే 2GB రోజువారి బేస్ డేటాకు అదనంగా మరొక 2GB అదనపు డేటాను అందిస్తుంది. వీటితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది వొడాఫోన్ ప్లే మరియు Zee5 లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vi Prepaid Plans Data Offers Different From Other Telcos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X