Home
News

Vodafone Idea(VI) ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా Zee5 OTT ప్రయోజనాలు...

ఇండియాలోని టెలికాం ఆపరేటర్లలో ఒకటైన వోడాఫోన్ ఐడియా ఇప్పుడు VI గా రూపాంతరం చెందిన తరువాత కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి వినూత్నమైన ఆఫర్లను అందిస్తున్నది. ఇప్పుడు తన చందాదారులకు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అదనపు ఖర్చు లేకుండా రూ.999 విలువైన ZEE5 ప్రీమియం చందాను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.

Vi ప్రీపెయిడ్ ప్లాన్‌ల OTT ప్రయోజనాలు

Vi ప్రీపెయిడ్ ప్లాన్‌ల OTT ప్రయోజనాలు

Vi ఇప్పుడు మొత్తంగా రూ .355, రూ .405, రూ .595, రూ .795 మరియు రూ .2,595 ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ZEE5 ప్రీమియం సభ్యత్వంను ఉచితంగా అందిస్తున్నది. ZEE5 ఇటీవల భారతి ఎయిర్‌టెల్‌తో విడిపోయినందున ఇది వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు మాత్రమే అందుటులో ఉంది. VI టెల్కో ZEE5 ప్రీమియం సభ్యత్వాన్ని అందిస్తోంది కాబట్టి మీరు రూ.355 డేటా యాడ్-ఆన్ ప్లాన్‌ను కొనుగోలు చేసినప్పటికీ మీరు 999 రూపాయల విలువైన ఒక సంవత్సరం ZEE5 ప్రీమియం సభ్యత్వానికి అర్హులు అవుతారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ZEE5 ప్రీమియంను ఉచితంగా అందిస్తున్న వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ZEE5 ప్రీమియంను ఉచితంగా అందిస్తున్న వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం వార్షిక ZEE5 ప్రీమియం సభ్యత్వంను రూ.355 ధర గల Vi డేటా ప్లాన్ మరియు Vi కాంబో ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ .405, రూ .595, రూ .795 మరియు రూ .2,595 తో లభిస్తుంది. ఈ ప్లాన్‌ల యొక్క ప్రయోజనాల విషయానికొస్తే రూ.355 డేటా ప్లాన్‌ 28 రోజుల చెల్లుబాటుతో 50GB డేటాతో పాటు రూ.999 విలువైన Zee5 ప్రీమియం సభ్యత్వంను అందిస్తుంది. అలాగే రూ.405 ప్లాన్‌ విషయానికి వస్తే ఇది 28 రోజుల చెల్లుబాటు కాలంలో 90GB డేటా బెనిఫిట్ లభిస్తుంది. ఇవి భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది.

Vi రోజువారి 2GB డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

Vi రోజువారి 2GB డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వోడాఫోన్ ఐడియా యొక్క రూ.595 మరియు రూ.795 ధర వద్ద గల ప్రీపెయిడ్ ప్లాన్లు రోజుకు 2 జిబి డేటాను వరుసగా 56 మరియు 84 రోజుల చెల్లుబాటుతో అందిస్తున్నాయి. చివరగా రూ.2595 ప్లాన్ కూడా రోజుకు అదే 2GB డేటాను అందిస్తుంది కాని 365 రోజుల చెల్లుబాటు కాలానికి. ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS లు, ఒక సంవత్సరం Zee5 ప్రీమియం సభ్యత్వంను అదనంగా అందిస్తాయి.

ZEE5 ప్రీమియం vs డిస్నీ + హాట్స్టార్ VIP

ZEE5 ప్రీమియం vs డిస్నీ + హాట్స్టార్ VIP

ఇతర టెల్కోలు స్మార్ట్ఫోన్ లను కలిగి ఉన్న వారి కోసం డిస్నీ + హాట్స్టార్ VIP సభ్యత్వాన్ని అందించడంపై దూకుడుగా దృష్టి సారిస్తున్న సమయంలో VI తన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ZEE5 ప్రీమియం సభ్యత్వంను ఉచితంగా అందించడం మంచి చర్యగా భావించవచ్చు. Vi దాని ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ZEE5 ప్రయోజనాన్ని అందించడాన్ని ముందు ఆపివేసినట్లు మేము గమనించాము. ఏదేమైనా ఇది ఇప్పుడు కొత్త ప్లాన్‌లతో మళ్ళి తిరిగి వచ్చింది. ఇది చాలా మంది వినియోగదారులను ఆకర్షిస్తున్నది.

Best Mobiles in India

English summary
VI Prepaid Plans Offers ZEE5 Premium Subscription at Free of Cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X