Home
News

2019లో తొలగించిన కాంబో రీఛార్జ్ ప్యాక్‌ను తిరిగి తీసుకొస్తున్న Vodafone Idea(Vi)

2019 డిసెంబర్‌లో టెలికాం సంస్థలు టారిఫ్ పెంపును ప్రకటించిన తరువాత వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌లను వినియోగదారులకు అందించింది. అయితే ఇప్పుడు 'కాంబో' ప్లాన్ సెక్షన్ కింద తొలగించిన రూ.65 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌ను తిరిగి తీసుకువచ్చింది. వోడాఫోన్ ఐడియా సంస్థలు రెండు కూడా గతంలో రూ.65 యాక్టివ్ రీఛార్జ్ ప్యాక్‌ను రూ .52 టాక్ టైమ్ బెనిఫిట్ తో అందించేది. అయితే తొలగించిన పాత రూ.65 యాక్టివ్ ప్లాన్‌తో పోలిస్తే తిరిగి ప్రవేశపెట్టిన రూ.65 కాంబో ప్లాన్ యొక్క ప్రయోజనాలు కొద్దిగా భిన్నంగా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi రూ .65 కాంబో ప్లాన్ ప్రయోజనాలు

Vi రూ .65 కాంబో ప్లాన్ ప్రయోజనాలు

Vi సంస్థ మళ్ళి తిరిగి ప్రవేశపెట్టిన రూ.65 కాంబో ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ ఇప్పుడు రూ.52 టాక్ టైమ్ బెనిఫిట్ మరియు 100MB డేటాను 28 రోజుల సర్వీస్ వాలిడిటీ కాలానికి అందిస్తోంది. అయితే ఇందులో గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే ఈ ప్లాన్ ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియాలోని మొత్తం 22 టెలికాం సర్కిల్‌లలో దీని లభ్యత త్వరలోనే లభించే అవకాశం ఉంది. ఈ ప్లాన్ అన్ని సర్కిల్‌లలో ప్రస్తుతం లభించదు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, మహారాష్ట్ర & గోవా, ముంబై వంటి ఎంచుకున్న సర్కిల్‌లలో మాత్రమే లభిస్తుంది.

 

Vi అందిస్తున్న కాంబో ప్లాన్‌ల వివరాలు

Vi అందిస్తున్న కాంబో ప్లాన్‌ల వివరాలు

Vi టెలికాం సంస్థ కొత్తగా రూ.65 ధర వద్ద అందించే కాంబో ప్లాన్ ప్రస్తుతం ఉన్న రూ.39, రూ.49, రూ.79 మరియు రూ.95 కాంబో ప్లాన్‌ల జాబితాలో చేరింది. ఈ కాంబో ప్లాన్‌ల యొక్క ప్రయోజనాలలో పరిమిత టాక్ టైమ్ మరియు పరిమిత 2G / 3G / 4G డేటా ప్రయోజనాలు ఉన్నాయి. వాయిస్ కాల్స్ సెకనుకు ఒక పైస చొప్పున వసూలు చేయబడతాయి. ఈ ప్లాన్‌లను ఎంచుకోవడానికి గల కీలకమైన అంశాలలో సిమ్ యాక్టీవ్ లో ఉండడానికి మరియు తక్కువగా ఫోన్ కాల్స్ చేస్తున్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

Vi కాంబో ప్లాన్‌ల డేటా ప్రయోజనాలు

Vi కాంబో ప్లాన్‌ల డేటా ప్రయోజనాలు

Vi టెలికాం సంస్థ ఇప్పుడు తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐదు కాంబో ప్లాన్‌లను అందిస్తున్నది. రూ.39 ధర వద్ద లభించే ప్యాక్‌ రూ.30 టాక్‌టైమ్ మరియు 100MB డేటా ప్రయోజనంను 14 రోజుల వాలిడిటీతో వస్తుంది. అలాగే రూ.49 కాంబో ప్యాక్ వినియోగదారులకు రూ.38 టాక్ టైమ్ మరియు 150MB డేటా ప్రయోజనాలను 28 రోజుల వాలిడిటీతో అందిస్తుంది. చివరిగా రూ.95 కాంబో ప్లాన్‌ 56 రోజుల వాలిడిటీతో రూ.74 టాక్‌టైమ్ మరియు 200MB డేటాను అందిస్తుంది. Vi మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఈ కాంబో ప్లాన్‌లను రీఛార్జ్ చేయడం ద్వారా వినియోగదారులు డబుల్ డేటాను పరిమిత కాల ఆఫర్‌ను కూడా పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea(Vi) Bring Back Combo Prepaid Recharge pack That Was Removed in 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X