Home
News

Vi రూ.948 పోస్ట్‌పెయిడ్ ప్లాన్!! మొత్తం ఫ్యామిలీకి అపరిమిత డేటా & వాయిస్ కాల్ బెనిఫిట్స్

వోడాఫోన్ ఐడియా టెలికాం సంస్థలు ఇటీవల Vi గా రూపాంతరం చెందిన తరువాత యూజర్ బేస్ ను పెంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా తన పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు కొత్తగా మరొక పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను జోడించింది. ఇది ముఖ్యంగా ప్రైమరీ వినియోగదారులకు "అపరిమిత" హై-స్పీడ్ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ప్లస్ 699F అని పిలువబడే కొత్త Vi పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ రెండు కనెక్షన్లతో 948 రూపాయల ధర వద్ద లభిస్తుంది. కానీ యూజర్లు ఐదుగురు సభ్యులను ఈ కుటుంబ ప్లాన్‌లో ప్రతి కొత్త కనెక్షన్‌కు రూ.249 అదనపు మొత్తం చెల్లించి జోడించవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi రూ.948 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ డేటా & వాయిస్ కాల్ ప్రయోజనాలు

Vi రూ.948 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ డేటా & వాయిస్ కాల్ ప్రయోజనాలు

ఈ కొత్త ప్లాన్ Vi వెబ్‌సైట్‌లో ఇంకా జాబితా చేయబడలేదు. అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యమయ్యే సమాచారం ప్రకారం రూ.948 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ ప్రస్తుతం డిసెంబర్ 3, 2020 నుండి ఉత్తర ప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌కు పరిమితం చేయబడింది. ఈ ప్లాన్ ద్వారా మొదటి కనెక్షన్‌కు అపరిమిత హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అలాగే రెండవ కనెక్షన్ కోసం 30GB పరిమిత డేటా రోల్‌ఓవర్‌ను కూడా తెస్తుంది. అలాగే వాయిస్ కాలింగ్ ప్రయోజనాల పరంగా ఈ ఫ్యామిలీ ప్లాన్ అపరిమిత లోకల్, STD మరియు రోమింగ్ కాల్‌ల ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే రెండు కనెక్షన్ల కోసం నెలకు 100 SMSల ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

 

Vi రూ.948 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ OTT యాప్ అదనపు ప్రయోజనాలు

Vi రూ.948 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ OTT యాప్ అదనపు ప్రయోజనాలు

వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క రూ.948 కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ అందిస్తున్న అదనపు ప్రయోజనాలలో మొదటి మరియు రెండవ కనెక్షన్‌లకు ఒక సంవత్సరం పాటు Vi మూవీస్ మరియు టీవీ యాక్సెస్‌ను ఉచితంగా అందిస్తుంది. మొదటి కనెక్షన్‌లో ఉన్న వినియోగదారుడు అదనపు ఛార్జీలు లేకుండా వార్షిక ప్రాతిపదికన అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు Zee5 ప్రీమియంను ఉచితంగా పొందటానికి కూడా అర్హులు అవుతారు.

భారతీయ టెల్కోల వాయిస్ కాల్ & డేటా వాణిజ్య పరిమితులు

భారతీయ టెల్కోల వాయిస్ కాల్ & డేటా వాణిజ్య పరిమితులు

వోడాఫోన్ ఐడియా (Vi) దాని వాణిజ్య వినియోగ విధానం ప్రకారం పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల బిల్లు చక్రంలో యూజర్లు "అపరిమిత" డేటా ప్రయోజనాలలో 150GB మరియు వాయిస్ ప్రయోజనాలలో 50 నిమిషాల కన్నా తక్కువ (ఇన్‌కమింగ్ కాల్‌లతో సహా) వాయిస్ వినియోగం ఉంటుంది అని వాణిజ్యంగా పిలువబడుతుంది. దీని అర్థం డేటా మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు సాంకేతికంగా అపరిమితంగా ఉండవు కానీ ఇందులో కొన్ని పరిమితులు ఉండడం అనేది అన్ని భారతీయ టెల్కోలలో ఇది ఒక సాధారణ పద్ధతి.

Best Mobiles in India

English summary
Vi Provide Rs.948 New Postpaid Family Plan With ‘Unlimited’ Data, Voice Calls
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X