Vi యూజర్లకు ఉచితంగా 3GB డేటా: మీకు వచ్చిందా? చెక్ చేయండి...
వొడాఫోన్ ఐడియా Vi గా మార్పు చెందాక తన చందాదారులకు అద్భుతమైన ఉచిత ఆఫర్లను అందిస్తున్నది. తమ యొక్క నెట్‌వర్క్ నుండి వదలకుండా ఉంచడానికి మరియు ఇతరులను ఆకట్టుకోవడానికి ఇటువంటి ఆఫర్లను అందిస్తున్నది.

ZEE5 ప్రీమియం సభ్యత్వంను ఉచితంగా
సంస్థ ఇప్పుడు ‘VI' బ్రాండ్ కింద మెరుగైన నెట్‌వర్క్ ను అందించే క్రమంలో కొన్ని రోజుల క్రితం ZEE5 ప్రీమియం సభ్యత్వంను ఉచితంగా Vi యొక్క కొత్త ప్లాన్ లలో అందిస్తున్నది. జియో మరియు ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు అందిస్తున్న డిస్నీ + హాట్‌స్టార్ VIP లతో పోల్చినప్పుడు ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది కాకుండా Vi తన ప్రీపెయిడ్ వినియోగదారుల అకౌంటులలో అదనంగా 3GB డేటాను జమ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi యూజర్లకు ఉచితంగా 3GB డేటా ప్రయోజనం
Vi అందిస్తున్న 3GB డేటా ప్రయోజనం పూర్తిగా యాదృచ్ఛికం మరియు మీరు దాన్ని పూర్తిగా స్వీకరించకపోవచ్చు. Vi తన రూ.49 ఆల్ రౌండర్ రీఛార్జ్ ప్యాక్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ఉచిత డేటా ప్రయోజనాన్ని మీ యొక్క అకౌంటులలో జమ చేస్తున్నట్లు కనిపిస్తోంది. Vi షిప్‌ల నుండి రూ.49 ప్యాక్ రూ.38 టాక్ టైమ్, 100MB డేటాను 28 రోజుల సర్వీస్ వాలిడిటీతో అందిస్తుంది.

అదనంగా 200MB డేటా
Vi చందాదారుడు సంస్థ యొక్క వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ నుండి రూ.49 ప్లాన్‌ను ఎంచుకుంటే కనుక వారికి అదనంగా 200MB డేటాను కూడా పొందుతారు. కంపెనీ 3GB డేటా యాడ్-ఆన్‌ను 28 రోజుల వాలిడిటీతో రూ.48 ధరకు విక్రయిస్తోంది. అయితే కొంతమంది వినియోగదారులకు ఇది ఉచితంగా ఇవ్వబడుతోంది.


Click it and Unblock the Notifications