Vi నుంచి 30 రోజుల వాలిడితో తక్కువ ధరలోనే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు!! జియోకు ఎదురుదెబ్బ...
ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలలో ఒకటైన Vi (వోడాఫోన్ ఐడియా) తన యొక్క వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను విడుదల చేస్తోంది. ఈ Vi సంస్థ అన్ని రకాల వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ప్లాన్ లను విడుదల చేస్తున్నది. ఇప్పుడు 30 రోజుల చెల్లుబాటు కాలంతో రూ.267 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 25GB డేటా ప్రయోజనాలతో లభిస్తుంది.

Vi యొక్క రూ.267 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ జియో ఇదే చెల్లుబాటుతో అందించే రూ.247 ప్యాక్ 25GB హై-స్పీడ్ డేటా యాక్సెస్‌ను అందిస్తుంది. Vi టెల్కో తన యొక్క వినియోగదారులకు రూ.267 ప్లాన్ తో పాటుగా అదనంగా రూ.128 ధర వద్ద మరొక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను 28 రోజుల పాటుతో అందిస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi రూ. 267 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు
Vi (వోడాఫోన్ ఐడియా) టెల్కో యొక్క వెబ్‌సైట్ మరియు యాప్ లోని సమాచారం ప్రకారం రూ.267 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది 25GB డేటా యాక్సెస్ మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో సహా ప్రయోజనాలతో పాటుగా ఈ ప్లాన్ రోజుకు 100SMS మెసేజ్ లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంతేకాకుండా రూ.267 ధర వద్ద లభించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ Vi మూవీస్ మరియు టీవీ యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. Vi టెల్కో రూ.267 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను ఇండియా మొత్తంగా 23 సర్కిల్‌లలో అందిస్తుంది. దీనిని అమెజాన్ పే, గూగుల్ పే మరియు పేటిఎమ్‌తో సహా అన్ని మూడవ పార్టీ యాప్ ల నుండి కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు.

Vi రూ.128 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు
అధిక డేటా అవసరం అవసరం లేని వారు లేదా కేవలం వాయిస్ కాలింగ్ ప్రయోజనాల కోసం చూస్తున్న వినియోగదారుల కోసం Vi టెల్కో రూ.128 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యొక్క ప్రయోజనాలలో 10 లోకల్ ఆన్-నెట్ నైట్ నిమిషాలను అందిస్తుంది. అలాగే స్థానిక మరియు జాతీయ కాల్‌లకు సెకనుకు 2.5 పైసల చొప్పున 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. రాత్రి 11-6 మధ్య అందుబాటులో ఉంటాయి. అదనంగా కస్టమర్లు రూ.128 ప్రీపెయిడ్ ప్లాన్‌కు రీ రేటుతో ఎస్‌ఎంఎస్ ఛార్జీలు లభిస్తాయి. స్థానికంగా రూ.1, ఎస్టీడీకి రూ.1.5 వసూలు చేస్తాయి. అలాగే ISD SMS మెసేజ్ లకు రూ.5 వసూలు చేయబడతాయి.

మై Vi వెబ్‌సైట్ మరియు యాప్‌లోని ప్లాన్ వోచర్ విభాగం కింద Vi రూ.128 ప్రీపెయిడ్ ప్లాన్ జాబితా చేయబడింది. ఓన్లీటెక్ నివేదించిన ప్రకారం ఇది ప్రస్తుతం ముంబై, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ (తూర్పు) మరియు ఉత్తర ప్రదేశ్ (పశ్చిమ) వంటి ఎంపిక చేసిన సర్కిళ్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే Vi దీన్ని కాలక్రమేణా ఇతర సర్కిల్‌లకు విస్తరించవచ్చు.

Vi మాదిరిగానే ఎయిర్‌టెల్‌లో కూడా రూ.128 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ సెకనుకు 2.5 పైసల స్థానిక మరియు ఎస్టీడీ కాల్ ఛార్జీలతో 28 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. అయితే ఎయిర్‌టెల్ ప్లాన్‌లో ఆన్-నెట్ నిమిషాల ప్రయోజనాలు లేవు.
గత నెలలో Vi టెల్కో 60 రోజుల చెల్లుబాటుతో 50GB డేటాతో రూ.447 ధర వద్ద ప్రీపెయిడ్ ప్లాన్ ను జియో యొక్క రూ.447 ప్లాన్ కు పోటీగా విడుదల చేసింది. ఈ ఆపరేటర్ "తక్కువ-ఆదాయ" వినియోగదారుల కోసం రూ.75 ధర వద్ద ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో ఒక ప్లాన్ ను విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








