Home
News

Vi యూజర్లకు అందుబాటు ధరలో కొత్త ప్లాన్!! రోజువారి డేటా పరిమితి లేకుండా...

ఇండియాలోని టెలికాం సంస్థలలో అధిక యూజర్ బేస్ ను కలిగిన వాటిలో మూడవ స్థానంలో గల Vi (వోడాఫోన్ ఐడియా) రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ సంస్థలకు పోటీగా ఇప్పుడు కొత్తగా ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. Vi సంస్థ అందించే ఈ కొత్త ప్లాన్ ఎటువంటి రోజువారీ పరిమితి లేకుండా 60 రోజుల మొత్తం చెల్లుబాటు కాలానికి 50GB డేటాను అందిస్తుంది.

టెలికాం ఆపరేటర్

ఈ టెలికాం ఆపరేటర్ తన చందాదారుల కోసం అందిస్తున్న ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టడంలో రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ సంస్థలను అనుసరిస్తుంది. జియో ఇటీవల ప్రకటించిన ఫ్రీడమ్ ప్లాన్ కిట్టిలో ఇలాంటి డేటా ప్రయోజనం ఉంది. ధర కూడా Vi ప్లాన్ కు సమానంగా ఉంది. ఎయిర్‌టెల్ కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి ప్యాక్‌ను ప్రకటించింది. Vi టెల్కో అందించే బల్క్ డేటా యొక్క ప్లాన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi రూ.447 కొత్త ప్రీపెయిడ్ ప్యాక్ వివరాలు

Vi రూ.447 కొత్త ప్రీపెయిడ్ ప్యాక్ వివరాలు

Vi (వోడాఫోన్ ఐడియా) సంస్థ తన వినియోగదారుల కోసం కొత్తగా ఎటువంటి రోజువారీ పరిమితి లేకుండా 50GB బల్క్ డేటాను అందించే ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ.447 ధర వద్ద అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్‌లను మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 60 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ సినిమాలు, ఒరిజినల్ కంటెంట్, లైవ్ టివి మరియు న్యూస్ కంటెంట్ ఉన్న Vi మూవీస్ మరియు టివికి ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. దీనిని Vi యాప్ లో చూడవచ్చు.

జియో రూ.447 కొత్త ప్రీపెయిడ్ ప్యాక్

జియో రూ.447 కొత్త ప్రీపెయిడ్ ప్యాక్

జియో టెలికాం సంస్థ రూ.447 అదే ధర వద్ద ఇటీవల కొత్తగా రోజువారీ పరిమితి లేకుండా 50GB బల్క్ డేటాను అందించే ప్లాన్ ను విడుదల చేసింది. 50GB పరిమితి తర్వాత డేటా స్పీడ్ 64Kbps కి పడిపోతుంది. రూ.447 ధర వద్ద లభించే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ JioTV, JioCinema, JioNews, JioSecurity మరియు JioCloud వంటి అన్ని జియో యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. రూ.447 ప్లాన్ జియో రూ. 127 మరియు రూ. 2,397 విభాగంలో అందించే ఫ్రీడమ్ ప్లాన్స్ పరిధిలో భాగంగా ఉంటుంది. బేస్ ప్లాన్ 12GB మొత్తం డేటాను 15 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. అయితే ప్రీమియం ప్లాన్ 365GB డేటాను 365 రోజుల వాలిడిటీతో అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.456 కొత్త ప్రీపెయిడ్ ప్యాక్

ఎయిర్‌టెల్ రూ.456 కొత్త ప్రీపెయిడ్ ప్యాక్

జియో కొత్తగా విడుదల చేసిన రూ.447 ప్యాక్ కు పోటీగా ఎయిర్‌టెల్ సంస్థ రూ.456 ధర వద్ద కొత్తగా ప్రీపెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. ఇది కూడా జియో మరియు వోడాఫోన్ ప్లాన్‌ల మాదిరిగానే డేటా ప్రయోజనాలను అందిస్తుంది. డేటా క్యాప్‌ ప్రకారం వినియోగదారులకు మెగాబైట్‌కు 50 పైసల రేటుతో పాటు రూ.1 స్థానిక మరియు ప్రతి జాతీయ SMS సందేశానికి రూ.1.5 ధర వద్ద అందిస్తుంది. అదనంగా ఎయిర్‌టెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ యొక్క 30 రోజుల ఉచిత ట్రయల్‌తో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం మరియు వింక్ మ్యూజిక్‌కు యాక్సిస్ ను అందిస్తుంది. హలో ట్యూన్స్ యాక్సెస్ కూడా ఉచితంగా ఉంది. అలాగే ఫాస్ట్‌టాగ్‌లో రూ.100 క్యాష్‌బ్యాక్ మరియు షా అకాడమీ అందించే ఆన్‌లైన్ కోర్సులకు ఉచిత ప్రవేశంను అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్స్

వోడాఫోన్ ఐడియా అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఉత్తమమైనది రూ.1,197 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 180 రోజులు అంటే 6 నెలల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అదనంగా ఈ ప్లాన్ ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ఆఫర్ మరియు Vi మూవీస్ & టీవీ యొక్క OTT ప్రయోజనంతో వస్తుంది. అయితే రెండవ ఉత్తమమైన ప్లాన్ రూ.1,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 365 రోజులు (1-సంవత్సరం) చెల్లుబాటుతో వస్తుంది. ఇది Vi మూవీస్ & టీవీకి ఉచిత చందాతో పాటు 24GB డేటాను మాత్రమే అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Vi(Vodafone Idea) Introduces Rs.447 New Prepaid Plan Offers 50GB Total Data With no Daily Limit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X