VI యూజర్లకు అదిరిపోయే ఆఫర్!! వారంలో మిగిలిన డేటాను వీకెండ్ లో ఉపయోగించవచ్చు

|

ఇండియాలోని టెలికామ్ రంగంలో గల పోటీని తట్టుకోవడానికి అన్ని సంస్థలు తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ప్లాన్ లను విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా VI(వోడాఫోన్ ఐడియా) సంస్థ ఇప్పుడు తన ప్రీపెయిడ్ వినియోగదారులకోసం కొత్తగా 'వీకెండ్ డేటా రోల్ఓవర్' ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇది ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా 2020 అక్టోబర్ 19 నుండి 2021 జనవరి 17 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రత్యేకంగా తెలిపింది. అయితే ఈ వీకెండ్ డేటా రోల్ఓవర్ స్కీం రూ.249 లేదా అంతకంటే ఎక్కువ ధర గల అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్‌ల మీద మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

 

VI వీకెండ్ డేటా రోల్ఓవర్ స్కీం

VI వీకెండ్ డేటా రోల్ఓవర్ స్కీం

VI వీకెండ్ డేటా రోల్ఓవర్ స్కీంలో భాగంగా వినియోగదారులు సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఉపయోగించని డేటాను వీకెండ్ లో వినియోగించడానికి ప్రస్తుతం అనుమతిస్తుంది. వినియోగదారులు సాధారణంగా ఆఫీసు పనిరోజులలో వినియోగించని మరియు సేవ్ చేసిన డేటాను వీకెండ్ రోజులలో HD స్ట్రీమింగ్ వంటి వాటిని ఎక్కువ చూడడానికి లేదా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఏదేమైనా వీకెండ్ ముగిసిన తర్వాత వారపు రోజులలో సేకరించిన డేటా గడువు ముగుస్తుందని గమనించాలి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాలు
 

Vi వీకెండ్ డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాలు

‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్' ప్రయోజనం వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రస్తుతం అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ప్రయోజనం రూ.249 మరియు అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్‌తో రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది అని గమనించాలి. ఉదాహరణకు వినియోగదారుడు అతను / ఆమె ఎవరైనా 2GB రోజువారీ డేటాను అందించే ప్లాన్‌తో రీఛార్జ్ చేసినప్పుడు సోమవారం 2GB లో 1GB మాత్రమే ఉపయోగించారు అనుకోండి. తరువాతి రోజులలో కూడా అదే మొత్తంలో డేటాను వినియోగించినప్పుడు వీకెండ్ లో  వినియోగదారుడు రోజువారీ కోటా కంటే అధికంగా 5GB అదనపు డేటాను డౌన్‌లోడ్ చేయడానికి మరియు ప్రసారం చేయడానికి పొందవచ్చు.

VI వీకెండ్ డేటా రోల్‌ఓవర్ పరిమితులు

VI వీకెండ్ డేటా రోల్‌ఓవర్ పరిమితులు

వీకెండ్ లో సేకరించగలిగే డేటా మొత్తానికి Vi ఎటువంటి పరిమితులను తీసుకురాలేదు. కాబట్టి వినియోగదారులు వారమంతా వినియోగించని డేటా మొత్తాన్ని వారం చివరిలో వినియోగించడానికి అనుమతిని ఇస్తుంది. "గడువు దగ్గర UL ప్యాక్‌ల కోసం రోల్-ఓవర్ డేటా యొక్క ప్రయోజనాన్ని ఉపయోగించడం కోసం వినియోగదారులు ప్యాక్ వాలిడిటీతో రీఛార్జ్ చేయాలి" అని ఆపరేటర్ దాని నిబంధనలు మరియు షరతుల పేజీలో తెలిపింది. ప్యాక్ వాలిడిటీలో రీఛార్జ్ చేసే కస్టమర్లు గడువు ముగిసిన లేదా గడువు ముగిసిన అన్‌లిమిటెడ్ ప్యాక్‌ల యొక్క రోజువారీ డేటా ప్రయోజనాన్ని కూడబెట్టుకొని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఒకవేళ కస్టమర్ ప్యాక్ చెల్లుబాటులో రీఛార్జ్ చేయకపోతే కనుక వారు సేకరించిన డేటాను కోల్పోతారు.

VI డేటా సేకరణ ను తనిఖీ చేసే విధానం

VI డేటా సేకరణ ను తనిఖీ చేసే విధానం

VI(వోడాఫోన్ ఐడియా) వినియోగదారులు వారం మొత్తంలో సేకరించిన డేటా మొత్తాన్ని తనిఖీ చేయడానికి Vi యొక్క మొబైల్ యాప్ యొక్క యాక్టివ్ ప్యాక్స్ & సర్వీసెస్ విభాగంలో తనిఖీ చేయవచ్చు. లేదా * 199 # SSD కోడ్ మరొక మార్గంను ఉపయోగించడం ద్వారా కూడా కనుగొనవచ్చు.

Vi డబుల్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లలో వీకెండ్ డేటా రోల్‌ఓవర్

Vi డబుల్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లలో వీకెండ్ డేటా రోల్‌ఓవర్

VI(వోడాఫోన్ ఐడియా) యొక్క డబుల్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లకు సభ్యత్వం పొందిన వినియోగదారులు వారంలో సేకరించిన డేటా ప్రయోజనాన్ని కూడా వీకెండ్ లో పొందుతారు. ఒకవేళ వినియోగదారుడి ప్లాన్ గడువు ముగియబోతున్నట్లయితే వినియోగదారుడి అకౌంటులో పేరుకుపోయిన డేటాను అలాగే ఉంచడానికి ఎటువంటి ఆలస్యం లేకుండా మళ్ళీ రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. అర్హత గల కొత్త ప్లాన్ రీఛార్జికి మరియు పాత ప్లాన్ గడువుకు మధ్య అంతరం ఉంటే సేకరించిన డేటా పూర్తిగా తొలగించబడుతుంది అని గుర్తుంచుకోవాలి.

Best Mobiles in India

Read more about:
English summary
VI Weekend Data Rollover Offer!! Rest of The Week Data Can be Used on The Weekend

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X