గుండె వేగాన్ని కొలిచే ‘బ్రా’

Posted By:

 గుండె వేగాన్ని కొలిచే ‘బ్రా’

ప్రముఖ లోదుస్తుల బ్రాండ్ విక్టోరియాస్ సీక్రెట్, హార్ట్ రేట్ మానిటర్‌తో కూడిన సరికొత్త స్పోర్ట్స్ బ్రాలను విక్రయిస్తోంది. భారత్ మార్కెట్లో వీటి ధర అంచనా రూ.4,400 నుంచి రూ.4,700 మధ్య ఉండొచ్చు. గుండె వేగాన్ని కొలిచేందకు అవసరమైన సెన్సార్లను బయటకు కనిపించకుండా బ్రా దుస్తులోనే రహస్యంగా ఏర్పాటు చేసారు. ఈ బ్రా ధరంచిన యూజర్లు తమ గుండె వేగానికి సంబంధిచిన డేటాను బ్రాతో లభించే హార్ట్ రేట్ మానిటరింగ్ డివైజ్ ద్వారా తెలుసుకోవచ్చు. క్లాథింగ్+ అనే సంస్థ ఈ టెక్నాలజీ సమకూర్చింది.

3డీ ప్రింటర్ల సాయంతో వ్యక్తిగత దుస్తులు

శాన్‌ఫ్రాన్సిస్కో ఆధారిత ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ ‘కాంటినమ్'  సరికొత్త డిజిటల్ ఫ్యాషన్‌కు శ్రీకారం చుట్టింది. 3డీ ప్రింటర్ల సాయంతో వ్యక్తిగత దుస్తులను తయారు చేసి సరికొత్తట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. 3డీ ప్రింటింగ్ విధానం 1980లోనే కనుగొన్నప్పటికి అప్పట్లో అంత ప్రాచుర్యాన్ని పొందలేక పోయింది. దిగ్గజ ఫ్యాషన్ బ్రాండ్‌లలో ఒకటైన నైక్ 3డీ ప్రింటింగ్ పై ఇప్పటికే పరిశోధనలు జరుపుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Victoria's Secret Launches Heart-Rate Monitor Compatible Sports Bra. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot