తుపాకీతో 'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని షూట్ చేసిన టెక్కీ..!

By Super
|
 తుపాకీతో 'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని షూట్ చేసిన టెక్కీ..!


కొత్త ఐప్యాడ్‌ని తుపాకులతో షూట్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే రిచర్డ్ ర్యాన్ అనే వ్యక్తి ఐప్యాడ్ మరియు దాని మన్నిక ఓర్పు పరీక్షించడానికి రైఫిల్‌ని ఉపయోగించి షూట్ చేశాడు. ఈ వీడియోని మార్చి 19వ తారీఖున యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేశాడు. దీంతో యూట్యూబ్‌లో ఎక్కువ మంది యూజర్స్ వీక్షించిన లిస్ట్‌లో ఈ వీడియో చేరింది.

 

ఈ వీడియోలో ఎక్కువ సామర్ద్యం కలిగిన రైఫిల్‌ని ఉపయోగించి 'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని షూట్ చేశాడు. రిచర్డ్ ర్యాన్ ఇలా ఆపిల్ ఉత్పత్తులను గాయ పర్చడం మొదటి సారి కాదు. గతంలో ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ మరియు ఐప్యాడ్‌లతో పాటు ఎక్స్‌బాక్స్ 360లను కూడా పరీక్షించడానికి రైఫిల్‌తో షూట్ చేశాడు.

పైనున్న వీడియోలో మీరు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీక్షించవచ్చు. ఈ వీడియోని వీక్షించిన సందర్శకులు వారియొక్క కామెంట్స్ ని క్రిందనున్న కామెంట్స్ బాక్సులో తెలుపగలరు.

ఆపిల్ ‘న్యూ ఐప్యాడ్’ వివరాలు సంక్షిప్తంగా:

శక్తిమంతమైన చిప్, హై-డెఫినిషన్ స్క్రీన్, మెరుగైన 5 మెగా పిక్సెల్ కెమెరా, 4జీ టెక్నాలజీకి అనువైనదిగా దీన్ని తీర్చిదిద్దారు. ఐప్యాడ్2 కన్నా ఇది కొంచెం మందంగా 9.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. వై-ఫై ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ సుమారు 10 గంటలు ఉంటుంది, అదే 4జీ ఉపయోగిస్తే ఒక గంట తగ్గుతుంది. ఇక స్టోరేజి సమస్యలు తలెత్తకుండా ఈ డివైజ్ లో ‘ఐక్లౌడ్’ పేరిట క్లౌడ్ సర్వీసులు కూడా అందిస్తున్నారు.

దీనితో కంటెంట్‌ను … ఐప్యాడ్‌లోనే భద్రపర్చుకోవాల్సిన పని లేకుండా కంపెనీ సర్వర్లలో ఉంచుకోవచ్చు. ఇది ఈ నెల 16 నుంచి అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో ఐప్యాడ్‌ హైడెఫినిషన్‌‌‌‌ను విక్రయించనున్నారు. భారత్‌లో దీన్ని ఎప్పుడు ప్రవేశపెడతారన్నది కంపెనీ వెల్లడించలేదు. కొత్త ఐప్యాడ్ ధర వై-ఫై రకానికైతే 499-699 డాలర్లు (రూ. 24,950- రూ. 31,450) మధ్య ఉంటుంది. అదే 4జీ వెర్షన్‌కైతే 629-829 డాలర్లు (రూ. 31,450-41,450) దాకా ఉంటుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X