శుభవార్త:వీడియోకాన్, డిష్ టీవీ యూజర్లకు 2 నెలల ఉచిత ప్రయోజనాలు

By Gizbot Bureau
|

జియో అన్ని రంగాల్లో ప్రవేశింస్తుందనే వార్తలతో ఇప్పుడు కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ తమ లాభాలను దెబ్బకొడుతోందోనని ఆత్మరక్షణలో పడ్డాయి. ఆపర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అదీగాక జియో డీటీహెచ్ రంగంలోకి ప్రవేశిస్తుందనే వార్తలు గుప్పుమనడంతో ఆ రంగంలోని కంపెనీలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిష్ టీవీ ఓ అడుగుముందుకేసి అందరికంటే ముందే ఆఫర్లను ప్రకటించింది. వీడియోకాన్ కూడా దీనికి జత కలిసింది. లాంగ్ టర్మ్ ప్లాన్ తీసుకున్నవారికి 2 నెలలు ఉచితంగా ప్రయోజనాలను అందిస్తున్నాయి. దీని ప్రకారం సంవత్సరం ప్లాన్ తీసుకుంటే మీరు 10 నెలలకు మాత్రమే పే చేయవచ్చు. అలాగే 6 నెలలకు ప్లాన్ తీసుకుంటే నెల రోజులు పాటు ఉచితంగా పొందవచ్చు.

ప్లాన్ ప్రారంభం
 

ప్లాన్ ప్రారంభం

డిష్ టీవీ 3 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూ1,292 నుంచి ప్రారంభమవుతోంది. 12 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే స్టాండర్డ్ డెఫినేషన్(ఎస్డీ) సెట్ టాప్స్ బాక్స్, ఇన్‌స్టాలేషన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్‌లో ఇండియా క్రికెట్ కూడా ఉంటుంది. ఇది యాడ్ ఆన్ సర్వీస్ రూపంలో పొందొచ్చు. టైర్ 3, టైర్ 4 మార్కెట్లలో చాలామంది ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోల్పోతున్నారు. వారి కోసమే ఆఫర్ తీసుకొచ్చినట్లు డిష్ టీవీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో అనిల్ దుయా తెలిపారు.

575ఛానల్స్

575ఛానల్స్

59 రూపాయలకే కలర్స్ మరాఠి హెచ్డి, జీ బంగ్లా, జీ మరాఠీ, కలర్స్ కన్నడ హెచ్డి, కలర్స్ బంగ్లా హెచ్డి, జీ టాకీస్, జెమినీ, ఈటీవీ, సన్ మ్యూజిక్, కెటివి, చానల్స్ను 59 రూపాయలకే అందించాలని డిష్ టీవీ భావిస్తోంది. డిష్ టీవి ఫ్లాట్ ఫాం మీద ఇప్పుడు 575ఛానల్స్ ఉన్నాయి. వాటిలో 22 ఆడియో ఛానల్స్ ఉన్నాయి. 59 హెచ్ డి సర్వీసులు ఉన్నాయి. మొత్తంగా 2297 మంది డిస్ట్రిబ్యూటర్లతో పాటు 241,346 మంది డీలర్లను కలిగి ఉంది. దేశం మొత్తం మీద 9350 పట్టణాల్లో విస్తరించి ఉంది.

హోమ్ హ్యాపీ సిల్వర్ ప్లస్

హోమ్ హ్యాపీ సిల్వర్ ప్లస్

డిష్ టీవీ ఇప్పటికే హోమ్ హ్యాపీ సిల్వర్ ప్లస్ పేరుతో ఓ ఆఫర్ ని ప్రారంభించింది. ఈ ఆఫర్‌ కింద 1690 రూపాయలు చెల్లించిన వారికి 150 రోజులు (ఐదు నెలల) పాటు అన్ని రకాల ఛానల్స్ వీక్షించవచ్చు.ఈ ప్యాకేజీ కింద రెండు దక్షిణాది భాషలను ఎంచుకోవడమే కాకుండా, బోనస్ ప్యాక్‌గా మరో దక్షిణాదిలోని రీజినల్ ల్యాంగ్వేజ్‌ను ఎంచుకోవచ్చు. అలాగే, స్పోర్ట్స్, బిజినెస్, న్యూస్, మూవీ, బ్రేక్ ఫ్రీ సినిమా, జనరల్ ఎంటర్‌టైన్మెంట్ వంటి ఛానల్స్‌ను వీక్షించవచ్చు. డిజిటల్ క్వాలిటీ నాణ్యతతో కూడిన ప్రసారాలను అందజేయనుంది.

రూ.1990 ప్లాన్
 

రూ.1990 ప్లాన్

అలాగే సెట్ ఆఫ్ బాక్స్ ఫ్రీ ఆఫర్‌ను కూడా ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద రూ.1990 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ఆఫర్లు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేశారు. ఈ ప్యాకేజీలతో ఇన్‌స్టాలేషన్ ఛార్జీల కింద అదనంగా రూ.200 చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ మార్కెటింగ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ అంజలి మల్హోత్రా తెలిపారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Videocon D2h, Dish TV Offering 2-Months Free on 10-Month Long-Term Subscription

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X