వీడియోకాన్ స్మార్ట్ టీవీ.. ఖరీదు రూ.2,09,990

Posted By: Prashanth

వీడియోకాన్ స్మార్ట్ టీవీ.. ఖరీదు రూ.2,09,990

 

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ సంస్థ వీడియోకాన్ 65 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో సరికొత్త స్మార్ట్ టీవీని ఆవిష్కరిచింది. ఖరీదు రూ.2,09,990. అత్యాధునిక 3డీ టెక్నాలజీ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4 ట్రిలియన్ డిస్‌ప్లే కలర్స్, వోమ్నీ సరౌండ్ సౌండ్, ఫరౌడ్జా వీడియో వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ స్మార్ట్ టెలివిజన్‌లో ఉన్నాయి. సరికొత్త డీడీబీ ప్లాట్ ఫామ్‌ పై డివైజ్ రన్ అవుతుంది. ఏర్పాటు హెచ్‌డిఎమ్ఐ, యూఎస్బీ, ఎంపీత్రీ అవుట్ పుట్ కనెక్టువిటీ ఆప్షన్‌లు యూజర్‌కు మరింత లబ్ధి చేకూరుస్తాయి. హెల్త్ కేర్ వ్యూ, బాడీ మాస్ ఇంటెక్స్ (బీఎమ్ఐ) వంటి ప్రత్యేక అప్లికేషన్‌లను టీవీలో లోడ్ చేశారు. డీడీబీ ప్లాట్ ఫామ్ ద్వారా యూజర్ టీవీలోనే ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు. పూర్తిస్థాయి 3డీ అనుభూతులతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ స్మార్ట్ టీవీ ఇంటిల్లిపాదికి చేరువచేస్తుంది.

ఫేస్‌బుక్ ఆఫీసులు (వరల్డ్ వైడ్)

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot