Home
News

ఐఫోన్ 15 పై రూ.12000 తగ్గింపు ఆఫర్! ధర, సేల్ వివరాలు

ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తుంది మరియు ప్రతిసారీ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, ప్రజలు కొనడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. గత సంవత్సరం, సెప్టెంబర్ 12 న Apple యొక్క వండర్లస్ట్ ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 15 ను విష్కరించబడింది.

ఇది అధికారికంగా సెప్టెంబర్ 22న మార్కెట్లో సేల్ కు వచ్చింది, ఢిల్లీలో ఇటీవల ప్రారంభించబడిన కొత్త Apple స్టోర్‌ల వెలుపల ఆసక్తిగా క్యూలో నిల్చున్న ప్రేక్షకులను చూస్తే ఈ ఫోన్ యొక్క డిమాండ్ తెలుస్తుంది.

Vijay Sales Apple Days Sale Live Now, iPhone 15 Available At Rs 12,000 Discount. And More Offers On Apple Products.

లాంచ్ సమయంలో ఐఫోన్ 15 యొక్క 128GB వేరియంట్ ధర రూ.79,900 కాగా, 256GB వేరియంట్ ధర రూ.89,900గా ఉంది. 512GB వేరియంట్ రూ.1,09,900 రూపాయలకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 14తో పోల్చినప్పుడు ఈ ఫోన్ పెద్ద అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.

ఇప్పుడు, విజయ్ సేల్స్ తన ఆపిల్ డేస్ సేల్‌లో భాగంగా సరికొత్త ఐఫోన్‌ను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఆఫర్ జనవరి 7 వరకు అందుబాటులో ఉంటుంది. మీరు విజయ్ సేల్స్ వారి 130 స్టోర్‌లలో లేదా వారి వెబ్‌సైట్‌లో ఈ డీల్‌లను పొందవచ్చు. స్టోర్ లో ఐప్యాడ్ మరియు మ్యాక్‌బుక్ ప్రో యొక్క వివిధ మోడళ్లపై ఆఫర్లను కూడా ప్రకటించింది.

ఐఫోన్ 15పై విజయ్ సేల్స్ ఆఫర్ వివరాలు
ఐఫోన్ 15 ఫోన్ యొక్క 128GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ.70,990 కి అందుబాటులో ఉంది. దీనితో పాటు, ఫోన్ యొక్క మొత్తం ధరను మరింత తగ్గించడంలో సహాయపడే అనేక ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఉదాహరణకు, మీరు HDFC కార్డ్‌ని కలిగి ఉన్నట్లయితే, మీరు తక్షణ తగ్గింపు offer రూ. 4,000 పొందవచ్చు. అందువల్ల, మొత్తం తగ్గింపు దాదాపు రూ. 12,000 ఉంటుంది. ఇతర బ్యాంక్ ఆఫర్‌లు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు, 1TB స్టోరేజ్‌తో కూడిన ఐఫోన్ 15 ప్రో రూ.1,62,990 లేదా బ్యాంక్ ఆఫర్‌తో రూ.1,59,990 కి లభిస్తుంది. ఐఫోన్ 15 ప్రో యొక్క ఇతర వెర్షన్లు కూడా డిస్కౌంట్లను కలిగి ఉన్నాయి.

ఇతర ఆఫర్ల వివరాలు
ఐప్యాడ్ మోడల్‌లు, మ్యాక్‌బుక్ ప్రో, కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 9 మరియు ఎయిర్‌పాడ్స్ ప్రో 2వ జెన్‌పై కూడా భారీ డీల్‌లు ఉన్నాయి. వివరాలను తెలుసుకోవడానికి చదవండి. iPad 9th Gen ప్రారంభ ధర రూ. 27,900. iPad 10th Gen ప్రారంభ ధర రూ. 33,430, iPad Air 5th Gen ప్రారంభ ధర రూ. 50,680 మరియు iPad Pro ప్రారంభ ధర రూ. 79,900, ఇందులో HDFC బ్యాంక్ కార్డు రూ. 4,000 వరకు తగ్గుతాయి.

ఇక ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే, M3 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 1,47,910, M3 ప్రో చిప్‌తో కూడినది రూ. 1,74,910 నుండి, M3 మ్యాక్స్ చిప్ మోడల్ రూ. 2,82,910 మరియు M2 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో రూ. 1,10,270 వద్ద అందుబాటులో ఉంది. అన్నీ HDFC బ్యాంక్ కార్డ్‌లతో ఫ్లాట్ రూ. 5,000 తగ్గింపు లభిస్తుంది.

ఇక స్మార్ట్‌వాచ్‌ల ఆఫర్ లను గమనిస్తే, కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 9 ప్రారంభ ధర రూ. 36,310, ఆపిల్ వాచ్ SE (2nd Gen) రూ. 25,690 మరియు ఆపిల్ వాచ్ సిరీస్ 8 ప్రారంభ ధర రూ. 32,620, HDFC బ్యాంక్ కార్డ్‌లతో గరిష్టంగా రూ. 2,500 తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఇయర్‌బడ్‌ల కోసం చూస్తున్నట్లయితే, AirPods Pro (2వ తరం) HDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,000 తక్షణ తగ్గింపుతో రూ. 18,990 కి లభిస్తాయి.

Best Mobiles in India

English summary
Vijay Sales Apple Days Sale Live Now, iPhone 15 Available At Rs 12,000 Discount. And More Offers On Apple Products.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X