ఇండియాలోకి రాగానే హాట్ కేకుల్లా అమ్ముడైన ఐప్యాడ్ 2

Posted By: Super

ఇండియాలోకి రాగానే హాట్ కేకుల్లా అమ్ముడైన ఐప్యాడ్ 2

ఐప్యాడ్ 2కి ఇండియాలో విశేషమైనటువంటి ఆదరణ లభించింది. దాంతో ఐప్యాడ్ అభిమానులు వైపై+3g మోడల్స్ అయినటువంటి ఐప్యాడ్2ని ఇండియాలోకి అడుగు పెట్టగానే మొత్తం కొనేయడం జరిగింది. దాంతో ప్రస్తుతం ఇండియాలో ఐప్యాడ్ 2కి మంచి గిరాకీ లభించింది.

ఎలాంటి ఆదరణ అంటే ఢిల్లీలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షాపులు కలిగినటువంటి విజయ్ సేల్స్ ఐప్యాడ్2 ఇండియాలో మాషాపులో లభిస్తుందని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ేచివరకు ఇండియాకు చేరుకుంది. ధిన్నర్, లైటర్, ఫాస్టర్ అయినటువంటి ఐప్యాడ్ 2 మీకు అందుబాటులో మీ విజయ సేల్స్... వచ్చి తీసుకోవి పోండి అంటూ విజయ్ సేల్స్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత విజయ్ సేల్స్ తన ఫాలోవర్స్ మొత్తానికి క్షమాపణను తెలియజేస్తూ ట్వీట్స్ పంపడం జరిగింది. ప్రస్తుతానికి ఆపిల్ స్టోర్స్ మాత్రమే లభిస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత విజయ్ సేల్స్‌కి వస్తాయని ట్వీట్ చేశారు.


ఇంతకీ విషయం ఏమిటంటే చాలా మంది స్నేహితులు విజయే సేల్స్ ట్వీట్‌ను చూసి అక్కడి పరిగెత్తుకోని వెళ్శడం జరిగింది. ఐతే ఇండియాలో మాత్రం ఐప్యాడ్ ఆదరైజ్డడ్ డీలర్లు అయినటువంటి క్రోమా, ఐమ్యాగజైన్, రిలయన్స్ డిజిటల్, ఐవరల్డ్ లాంటి స్టోర్స్‌కి మాత్రమే ఇవ్వడం జరిగిందంట.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot