Home
News

ఆపిల్‌ డేస్‌ సేల్‌.. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌పై భారీ డిస్కౌంట్‌లు.. ఆఫర్‌ మరో వారం రోజులు మాత్రమే..!

ఆపిల్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అనేక మంది భావిస్తుంటారు. అయితే అధిక ధర కారణంగా వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి గుడ్‌న్యూస్‌. ఆపిల్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్‌లు సహా అనేక ఆపిల్‌ ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌ ఈ నెల 24 వ తేదీనే ప్రారంభం అయింది. జూన్‌ 1 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

ఆపిల్‌ డేస్‌ సేల్ :
ప్రస్తుతం విజయ్‌ సేల్స్‌ (Vijay Sales) ప్లాట్‌ఫాంలో Annual Apple Days Sale లో భాగంగా ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌ లతోపాటు ఇతర ఆపిల్‌ డివైజ్‌లను డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఐఫోన్‌ 16 సిరీస్‌, ఐఫోన్‌ 15 సిరీస్‌, ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్‌లు సహా ఇతర ఉత్పత్తులు ఉన్నాయి.

Vijay sales offers annual apple days sale

ఐఫోన్‌ 16e స్మార్ట్‌ఫోన్ :
ఈ సంవత్సరం విడుదల అయిన ఐఫోన్‌ 16e మోడల్‌ను బేస్‌ వేరియంట్‌ రూ.59,990 ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆపిల్‌ డేస్‌ సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌లు, బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.47,990 కే సొంతం చేసుకోవచ్చు. 128GB, 256GB, 512GB స్టోరేజీ వేరియంట్స్‌తోపాటు వైట్‌, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

ఐఫోన్‌ 16e మోడల్‌ 60Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే సిరామిక్‌ షీల్డ్‌ రక్షణను పొందుతుంది. 3nm A18 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. (OIS) ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 48MP కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో మెరుగైన డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఇతర ఐఫోన్‌లపై డిస్కౌంట్‌లు :
ఐఫోన్‌ 16 స్మార్ట్‌ఫోన్‌ రూ.79900 ధరకు విడుదల అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌ ప్లాట్‌ఫాంలో రూ.66,900 కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లతో ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఐఫోన్ 16 ప్లస్‌ మోడల్‌ను రూ.74,900 కే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ను కూడా డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతో కలిపి ప్రో మోడల్‌ ను రూ.1,03,990 కే కొనుగోలు చేయవచ్చు. అదే ప్రో మ్యాక్స్‌ మోడల్‌ను రూ.1,27,650 ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్‌ 15 హ్యాండ్‌సెట్‌ను రూ.58,490, అదే ఐఫోన్‌ 15 ప్లస్‌ వేరియంట్‌ను రూ.66,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు కార్డులతో రూ.3,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఐఫోన్స్‌తోపాటు ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌ ను కూడా డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చు.

ఐప్యాడ్‌ 11 జెన్‌ రూ.34,900 కి విడుదల అయింది. ఈ ఆపిల్‌ డేస్‌ సేల్‌లో భాగంగా రూ.30,200 కే సొంతం చేసుకోవచ్చు. ఐప్యాడ్‌ ఎయిర్‌ ను రూ.52400, అదే ఐప్యాడ్‌ ప్రో మోడల్‌ను రూ.89400 కే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో మ్యాక్‌బుక్‌ ప్రో M4, మ్యాక్‌బుక్ ప్రో M4 ప్రో, మ్యాక్‌బుక్‌ ప్రో M4 మ్యాక్స్‌ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vijay sales offers annual apple days sale upto june 1 here are the great deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X