విజయవాడ రైల్వే అధికారులకు తప్పని హ్యాకింగ్ చిక్కులు

By Gizbot Bureau
|

సైబర్ క్రైమ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రపంచంలో ఎక్కడో వారు ఉంటూ ఇండియాలోని ప్రముఖ సంస్థలను హ్యాక్ చేస్తున్నారు. అలాగే అధికారులకు ఫోన్లు చేసి బ్యాంకు అకౌంట్లలో మొత్తాన్ని లాగేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జరిగింది.

విజయవాడ రైల్వే అధికారులకు తప్పని హ్యాకింగ్ చిక్కులు

 

హ్యాకర్లు విజయవాడ రైల్వే డివిజిన్ లోని అధికారులకు కాల్ చేసి వారి బ్యాంకు వివరాలను అడుగుతున్నారు. ఫేక్ నంబర్ నుంచి రైల్వే అధికారులుగా పరిచయం చేసుకుని కాల్ చేసి బ్యాంకు వివరాలను అడుతున్నారని తెలిసింది. అలాగే మీ బ్యాంకు లావాదేవీల్లో మార్పులు చేస్తున్నామని ఓటిపి నంబర్ చెప్పాలని అడుగుతున్నారు.

chief commercial inspector Sagarకి వింత అనుభవం

chief commercial inspector Sagarకి వింత అనుభవం

విజయవాడ రైల్వే డివిజన్ లో పనిచేస్తున్న chief commercial inspector Sagarకి వింత అనుభవం ఎదురయింది. ఎవరో తెలియని వ్యక్తి నుంచి ఆయనకు కాల్ వచ్చింది. రైల్వే డివిజన్ అకౌంట్ డిపార్ట్ మెంట్ నుండి మాట్లాడుతున్నామని అందులో భాగంగా ఎంప్లాయిమెంట్ డేటా కలెక్ట్ చేస్తున్నామంటూ ఫోన్ చేశారు. కాగా సాగర్ ఈ వాలెట్ యాప్ కి ఇచ్చిన బ్యాంకు అకౌంట్ వివరాల్లో అతని నంబర్ అతని ప్రమేయం లేకుండానే రిజిస్టర్ కావడంతో ఖంగుతిన్నాడు. వెంటనే నంబరుకు మెసేజ్ రావడంతో బ్యాంకుకు అలర్ట్ మెసేజ్ పంపి సేవ్ అయ్యారు.

ఇలాంటివి ఎన్నో

ఇలాంటివి ఎన్నో

అయితే ఇదొక్కటే కాదు. గత నెల వ్యవధిలో Vijayawada railway division పరిధిలో 6గురు అధికారులకు ఇలానే కాల్స్ వచ్చాయి. అందరికీ సాగర్ కు వచ్చిన మాదిరిగానే రైల్వే డివిజన్ అకౌంట్ డిపార్ట్ మెంట్ నుండి లేకుంటే divisional railway manager's office మాట్లాడుతున్నామని అందులో భాగంగా ఎంప్లాయిమెంట్ డేటా కలెక్ట్ చేస్తున్నామంటూ ఫోన్ చేశారు. అలాగే South Central Railway (SCR) పరిధిలో చాలామంది అధికారులకు ఇలానే కాల్స్ వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

వ్యక్తిగత వివరాలే టార్గెట్
 

వ్యక్తిగత వివరాలే టార్గెట్

ఈ ఫోన్ చేసే అగంతకులు వారి వ్యక్తిగత వివరాలు బ్యాంకు అకౌంట్లను సేకరిస్తున్నారని చెబుతున్నారు. వీరంతా అధికారుల నంబర్లను government websites నుండి సేకరిస్తున్నారని తెలిసింది. ఫోన్ చేసిన వ్యక్తి అధికారుల name, designation, Aadhaar number వంటి వివరాలను అడుగుతున్నారట. అవి అన్నీ అయిపోయిన తరువాత ఫోన్ కి ఐడెంటిఫై నంబర్ వస్తుందని దాన్ని కన్ఫర్మ్ చేయాలని చెబుతున్నారట. అలాగే ఓటీపి వస్తుందని అది కూడా చెప్పాలని కోరుతున్నారని అధికారులు చెబుతున్నారు.

సిటీ పోలీసుల మాటల్లో..

సిటీ పోలీసుల మాటల్లో..

అయితే సిటీ పోలీసు అధికారులు మాత్రం ఈ విషయం మీద అంతగా ఫిర్యాదులు రాలేదని చెబుతున్నారు. ఓటిపి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వివరాలను రైల్వై అకౌంట్ సెక్షన్ ఫోన్ ద్వారా అడగడం జరగదని ఈ ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు చెబుతున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vijayawada railway officers fall prey to cyber cons

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X