ఫోన్ బుక్ చేస్తే విమ్ బార్ వచ్చింది!!

Posted By:

గతకొంత కాలంగా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌ల విశ్వసనీయత పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా చోటు చేసుకున్న మరో సంఘటన ఈ-కామర్స్ ప్రపంచంలోనే కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

 ఫోన్ బుక్ చేస్తే విమ్ బార్ వచ్చింది!!

ముంబయ్‌కు చెందిన లక్ష్మీ నారాయణ స్నాప్‌డీల్.కామ్ వద్ద ఓ సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేసారు. ఆర్డర్‌ను అందుకున్న నారాయణ ఆ బాక్స్‌ను తెరిచి చూసి నిర్ఘాంత పోయారు. ఇందుకు కారణం స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిన స్థానంలో విమ్ బార్ ఉండటమే. ఆశ్చర్యంగా ఉన్నప్పటికి మీరు చదువుతున్నది నిజమే.

లక్ష్మీ నారాయణ ఈ ఉదంతాన్ని ఫోటోల రూపంలో తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేసారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ వ్యవహారం కాస్తా సోషల్ నెట్‌వర్క్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ ఆసక్తికర ఫేస్‌బుక్ పోస్ట్‌‍ను ఇప్పటి వరకు 20,830 మంది షేర్ చేసుకున్నారు.

ఒక వారం తరువాత విషయం తెలుసుకున్న స్నాప్‌డీల్ జరిగిన తప్పుకు చింతిస్తూ లక్ష్మీ నారాయణ చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది. ‘‘మంచి వార్త ఏంటంటే స్నాప్‌డీల్, నేను చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది. స్నాప్‌డీల్ మీడియా ఇన్‌ఛార్జ్ నన్ను సంప్రదించి చోటు చేసుకున్న వ్యవహారం పట్ల క్షమాపణలు కోరినట్లు'' లక్ష్మీ నారాయణ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో కొరియర్ పాత్ర ఉందని కంపెనీ తనతో వెల్లడించిందని, సొంత కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని వాళ్లకు సూచించినట్లు లక్ష్మీ నారాయణ తెలిపారు.

ఆ తరువాత ఆశ్చర్యకరంగా విమ్ బార్‌లను తయారు చేసే హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) కంపెనీ తనకు సామ్‌సంగ్ కోర్ డ్యుయో మొబైల్ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చినట్లు లక్ష్మీ నారాయణ మరో ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఫోన్‌తో రెండు విమ్ లిక్విడ్ సోప్ బాటిల్స్ అలానే ఒక సందేశంతో కూడిన లెటర్‌ను కూడా అందజేసినట్లు లక్ష్మీ నారాయణ తెలిపారు. ‘‘ మీరు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన చిత్రాల్లో మా బ్రాండ్ పేరు మారుమోగింది. అత్యధిక మంది వినియోగదారులను కలిగి ఉన్న మా ఐకానిక్ బ్రాండ్‌లో విమ్ ఒకటి. అందుకే మీకీ చిన్న కానుకను బహుకరిస్తున్నాం'' అంటూ ఆ సందేశంలో ఉందని లక్ష్మీ నారాయణ తన ఫేస్‌బుక్ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Vim Bar cleans up Snapdeal's mess. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot