Virat Kohli వాడే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏదో తెలిస్తే షాక్ అవుతారు!

|

సాధార‌ణంగా ఎక్కువ మంది ప్ర‌జ‌లు త‌మ‌కు బాగా న‌చ్చే సెల‌బ్రిటీల‌ లైఫ్ స్టైల్ ను ఫాలో అవుతుంటారు. తాము ఫాలో అయ్యే సెల‌బ్రిటీ ఏ గ్యాడ్జెట్ వాడినా వాళ్లు కూడా అదే గ్యాడ్జెట్‌ను వినియోగించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. కాబ‌ట్టి, కంపెనీలు కూడా వ్యాపార వ్యూహంలో భాగంగా త‌మ ఉత్ప‌త్తుల‌కు భారీగా డిమాండ్ పెరిగేందుకు సెల‌బ్రిటీల‌ను త‌మ బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్లుగా పెట్టుకుంటాయి. ఇప్పుడు ఇవ‌న్నీ ఎందుకు చెబుతున్నామ‌నుకుంటున్నారా..!

 
Virat Kohli వాడే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏదో తెలిస్తే షాక్ అవుతారు!

తాజాగా ప్ర‌ముఖ భార‌త క్రికెట‌ర్ Virat Kohli తాను వినియోగించే స్మార్ట్ ఫోన్ తో దిగిన ఫొటో ఇన్‌స్టాలో పోస్ట్ చేయ‌గా అది వైర‌ల్‌గా మారింది. అందులో కోహ్లీ వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఏ కంపెనీకి చెందింది.. దాని ప్ర‌త్యేక‌త‌లు ఏంటి అని అత‌ని ఫాలోవ‌ర్స్ ఆస‌క్తిగా కామెంట్లు చేస్తున్నారు. కాబ‌ట్టి ఇప్పుడు కోహ్లీ ఆ పిక్‌లో వినియోగిస్తున్న ఫోన్ ఏది, దాని ప్ర‌త్యేకత‌లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఇంత‌కీ ఆ ఫోన్ ఏది!
వాస్త‌వానికి, క్రికెట‌ర్ Virat Kohli వివో కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగుతున్న విషయం అంద‌రికీ ఇదువ‌ర‌కే తెలిసిందే. కాగా, తాజాగా కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలో తాను వినియోగిస్తున్న‌ది చూడ‌టానికి వివో బ్రాండ్‌కు చెందిన Vivo V25 Pro స్మార్ట్ ఫోన్ మాదిరి క‌నిపిస్తోంది. ఆ మొబైల్‌ను వినియోగిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ ఆయ‌న ఈ విధంగా పేర్కొన్నారు. మై ఫేవ‌రేట్ షేడ్ ఆఫ్ బ్లూ (నాకు ఎంతో ఇష్ట‌మైన నీలి రంగు) అని క్యాప్ష‌న్‌ను పోస్ట్‌కు జ‌త చేశారు. చాలా మంది ఆయ‌న ఫాలోవ‌ర్స్ కూడా అది Vivo V25 Pro స్మార్ట్ ఫోన్ అయి ఉండొచ్చ‌ని కామెంట్ల‌లో పేర్కొన్నారు. అయితే ఇది కంపెనీ ప్ర‌మోష‌న్‌లో భాగ‌మేన‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Virat Kohli వాడే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏదో తెలిస్తే షాక్ అవుతారు!

Vivo V25 Pro ప్ర‌త్యేక‌త‌లు గురించి తెలుసుకుందాం:
వివో కంపెనీ Vivo V23 Pro స్మార్ట్‌ఫోన్‌కు స‌క్సెస‌ర్ మోడ‌ల్‌గా ఈ Vivo V25 Pro ను తీసుకువ‌చ్చింది. ఇక్క‌డ విరాట్ ప‌ట్టుకున్న‌ది నిజంగా V25 Pro మొబైల్ అయితే క‌నుక త్వ‌ర‌లో ఆ V25 సిరీస్‌ను కంపెనీ మార్కెట్లో లాంచ్ చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. Vivo V23 Proతో పోల్చినప్పుడు V25 ప్రో మరింత శ‌క్తివంత‌మైన, స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో వస్తుందని భావిస్తున్నారు.

ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.56 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 120Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Mediatek Dimensity 8100 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది.

ఈ మొబైల్ 8GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రో రెండింటిలో 8 లేదా 12 మెగాపిక్సెల్‌తో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీలో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 32 మెగా పిక్సెల్ క్వాలిటీతో హై రిసోల్యూష‌న్ ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.

 

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. కనెక్టివిటీ పరంగా, డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, 5G ​​సపోర్ట్, Wi-Fi, USB టైప్-C పోర్ట్ స‌హా ప‌లు ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. స్పెసిఫికేష‌న్ల‌ను ఆధారంగా చూస్తే భార‌త్‌లో ఈ మొబైల్ దాదాపు రూ.35వేల వ‌ర‌కు ధ‌ర ఉండే అవ‌కాశం ఉంద‌ని అంతా భావిస్తున్నారు. ఈ కొత్త డివైజ్ OnePlus 10R మరియు Realme GT నియో 3 వంటి వాటితో పోటీపడుతుందని భావిస్తున్నారు.

Virat Kohli వాడే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏదో తెలిస్తే షాక్ అవుతారు!

భార‌త్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న Vivo V23 Pro స్పెసిఫికేష‌న్ల‌ను కూడా ఓ సారి చూద్దాం:
ఈ మొబైల్ కు 6.56 అంగుళాల full-HD+ AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 90Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫ‌న్‌ట‌చ్ 12 ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ MediaTek MT6893 Dimensity 1200 (6 nm) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది.

ఈ మొబైల్ 8GB,12GB RAM| 128GB, 256GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 108 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రో రెండింటిలో 8 మెగాపిక్సెల్‌తో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీలో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 50, 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో డ్యుయ‌ల్‌ ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4300mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 44W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, 5G ​​సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్ 5.2, A-GPS, NFC, USB టైప్-C పోర్ట్ను క‌లిగి ఉంది.

Best Mobiles in India

English summary
Virat Kohli Is Using A Blue Smartphone, And No, It's Not An iPhone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X