ముంబై-పూణేకు 35minలో ప్రయాణించడానికి వర్జిన్ హైపర్‌లూప్ వన్ ప్రాజెక్ట్

|

భారతదేశంలోని మహారాష్ట్ర కేబినెట్ ప్రపంచంలోని మొట్టమొదటి వర్జిన్ హైపర్‌లూప్ వన్ ప్రాజెక్టును ఆమోదించింది. ఇది పూణే నుండి ముంబైకి 35 నిమిషాల్లో ప్రయాణం చేసే విధంగా లింక్ చేస్తుంది. ఒక హైపర్‌లూప్ వెహికల్ ప్రస్తుత రవాణా విధానాల కంటే వేగంగా మరియు మరింత స్థిరంగా ఉంటుందని చెప్పబడింది.

virgin hyperloop one to connect mumbai pune in 35 mins

ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ కు ప్రజలను రవాణా చేయడానికి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ మరియు మాగ్నెటిక్ లెవిటేషన్‌ను వాక్యూమ్ పరిస్థితులలో ఉపయోగిస్తుంది.ముంబై మరియు పూణే మధ్య ప్రయాణీకుల ప్రయాణాలు 2026 నాటికి ప్రస్తుతం ఉన్న దాని కంటే 75 మిలియన్లకు రెట్టింపు అవుతాయని తెలిపింది.

virgin hyperloop one to connect mumbai pune in 35 mins

వర్జిన్ హైపర్‌లూప్ ఏటా 200 మిలియన్ల మంది ప్రయాణికులకు మద్దతు ఇస్తుందని సమాచారం. వర్జిన్ హైపర్‌లూప్-డిపి వరల్డ్ (VHO-DPW) కన్సార్టియంను గతంలో MahaIDEA కమిటీ ఒరిజినల్ ప్రాజెక్ట్ ప్రొపొనెంట్ (OPP) ఆమోదించింది.

వర్జిన్ హైపర్‌లూప్ వన్ వివరాలు:

వర్జిన్ హైపర్‌లూప్ వన్ వివరాలు:

వర్జిన్ హైపర్‌లూప్ వన్ తన హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను నడపడానికి భారతదేశంలో పూర్తి స్థాయి ట్రాక్‌ను నిర్మిస్తుంది. ఇది తక్కువ-దూర విమాన ప్రయాణానికి మరియు ప్రస్తుత రైలు నెట్‌వర్క్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. కొత్త రవాణా వ్యవస్థ జీరో ఉద్గారాలతో స్థిరంగా ఉంటుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇది 100 శాతం విద్యుత్ మార్గంగా పనిచేస్తుంది. ఇది గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 30 సంవత్సరాలలో 86,000 టన్నుల వరకు తగ్గించగలదు. భారత్‌తో పాటు అమెరికా, KSA, UAE వంటి దేశాల్లో ప్రాజెక్టులు జరుగుతుండటంతో ఈ సంస్థ ఇప్పటికే చాలా వందలాది టెస్ట్ డ్రైవ్ లను పూర్తి చేసిందని చెబుతున్నారు.

ప్రయాణ సమయం:

ప్రయాణ సమయం:

వర్జిన్ హైపర్‌లూప్ వన్ ప్రాజెక్ట్ పూణే మరియు ముంబైలను కలపడం కోసం. ఈ ప్రాజెక్ట్ లో సెంట్రల్ పూణే, నవీ ముంబై, అంతర్జాతీయ విమానాశ్రయం మరియు సెంట్రల్ ముంబైలను కేవలం 35 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు. ఇది ఇండియాలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే భారతదేశపు వేగవంతమైన రైలు గాతిమాన్ ఎక్స్‌ప్రెస్‌ను వెనుకకు నెట్టి గంటకు 1,126 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది . ఈ మొత్తం ప్రాజెక్టులో 117.5 కిలోమీటర్ల పొడవున ట్రాక్ నిర్మాణం ఉంటుంది.

వర్జిన్ హైపర్‌లూప్ వన్ చైర్మన్:

వర్జిన్ హైపర్‌లూప్ వన్ చైర్మన్:

వర్జిన్ హైపర్‌లూప్ వన్ భారతదేశానికి ప్రపంచ రవాణా మార్గదర్శకుడిగా మారడానికి మరియు ప్రపంచాన్ని మార్చే కొత్త పరిశ్రమను రూపొందించడానికి సహాయపడుతుంది. పూణే-ముంబై మార్గం జాతీయ హైపర్‌లూప్ నెట్‌వర్క్‌లో భాగంగా ఆదర్శవంతమైన మొదటి కారిడార్. ఇది భారతదేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని రెండు గంటలలోపు గణనీయంగా తగ్గిస్తుంది అని వర్జిన్ హైపర్‌లూప్ వన్ చైర్మన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

Best Mobiles in India

English summary
virgin hyperloop one to connect mumbai pune in 35 mins

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X