ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా విశాల్ సిక్కా

Posted By:

భారత్‌కు చెందిన ప్రముఖ బహుళ జాతీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కొత్త సీఈఓను ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా బయటి వ్యక్తికి సీఈఓ పగ్గాలను కట్టబెట్టి కొత్త శకానికి ఇన్ఫోసిస్ నాంది పలికింది. జర్మనీ ఐటీ సంస్థ ఎస్‌ఏపీ(శాప్) ఎగ్జిక్యూటివ్ బోర్డు మాజీ సభ్యులు అయిన విశాల్ సిక్కా (47)ను తమ కొత్త సీఈఓగా ఇన్ఫోసిస్ నియమించింది. ఈ నియామకం ఆగష్టు 1 నుంచి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం

ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా విశాల్ సిక్కా

ఇన్ఫోసిస్‌లో ప్రెసిడెంట్ అలానే పూర్తికాల సభ్యుడిగా ఉన్న యూబీ ప్రవీణ్ రావును జూన్ 14 నుంచి సీఓఓ బాధ్యతులు చేపట్టేలా ఇన్ఫోసిస్ నిర్ణయం తీసుకుంది. గతేదాది జూన్‌లో అయిదేళ్ల కాలానికి గాను నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ ఛైర్మన్ బాధ్యతలను స్వకరించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ ఏడాది జూన్ 14నే తన బాధ్యతలు నుంచి తప్పుకోనున్నారు.

మూర్తితో పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఎస్. గోపాలకృష్ణన్ కూడా వైదొలగనున్నారు. మూర్తి కంపెనీకి తిరిగి వచ్చినప్పటి నుంచి సీఎఫ్ఓ వి. బాలకృష్ణన్, అంతర్జాతీయ తయారీ విభాగాధిపతి అశోక్ వేమూరి, ప్రసిడెంట్ బి.జి.శ్రీనివాస్ సహా 12 మంది ఉన్నతాధికారులు కంపెనీని వీడిన సంగతి తెలిసిందే. మూర్తి స్థానంలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ప్రముఖ బ్యాకంర్ కె.వి. కామత్ ఇన్ఫోసిస్ బోర్డులోకి అడుగుపెట్టనున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot