Home
News

Vivo దీపావళి సంబరాలు, ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లు

By Bommu Sivanjaneyulu

దీపావళి పండుగ సమీపిస్తోన్న నేపథ్యంలో సామ్‌సంగ్ దగ్గర నుంచి వన్‌ప్లస్ వరకు అన్ని పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు, తమ స్మార్ట్‌ఫోన్‌ల పై ఆసక్తికర డిస్కౌంట్లను అనౌన్స్ చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి Vivo కూడా వచ్చి చేరింది. భారతీయుల ముఖ్య పండుగల్లో ఒకటైన దీపావళిని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వివో Diwali Carnival పేరుతో మూడు రోజుల స్పెషల్ డిస్కౌంట్ సేల్‌ను అనౌన్స్ చేసింది.

Vivo announces Diwali Carnival on Flipkart: Attractive discounts, exchange offers and more

Flipkart వేదికగా జరిగే ఈ సేల్‌లో భాగంగా కంపెనీ స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్‌తో పాటు క్యాష్ బ్యాక్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ ఇంకా జీరో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 10వ తేదీని ప్రారంభమైన ఈ సేల్ అక్టోబర్ 12వ తేదీతో ముగుస్తుంది. ఈ సేల్‌లో భాగంగా Vivo V7+, Vivo V5 Plus, Vivo V5s వంటి ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్‌ల పై స్పెషల్ డిస్కౌంట్స్‌ను అందుబాటులో ఉంచారు.

Vivo V7+ స్మార్ట్‌ఫోన్ వాస్తవ ధర రూ.21,990గా ఉండగా, ప్రస్తుత సేల్‌ను పురస్కరించుకుని రూ.19,990కే విక్రయిస్తున్నారు. ఈ డివైస్‌ను మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే అదనంగా రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది. మరో స్మార్ట్‌ఫోన్ V5 Plus పై ఏకంగా రూ.5000 తగ్గింపును వివో ప్రకటించింది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.22,990గా ఉండగా. ప్రస్తుత సేల్‌ను పురస్కరించుకుని రూ.17,990కే విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ పై రూ.21,000 వరకు ఎక్స్‌ఛేంజ్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

ఇదే సేల్‌లో భాగంగా Vivo V5S స్మార్ట్‌ఫోన్‌ పై రూ.3000 తగ్గింపును వివో ప్రకటించింది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.17,990గా ఉండగా. ప్రస్తుత సేల్‌ను పురస్కరించుకుని రూ.14,990కే విక్రయిస్తున్నారు. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌ల పై No cost EMI సౌకర్యాన్ని కూడా Vivo కల్పిస్తోంది. ఈ పద్థతిలో ఫోన్‌లను కొనుగోలు చేసిన వారకు నెలవారీ వాయిదా క్రింద రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది.

Vivo Diwali Carnival సేల్‌లో భాగంగా Axis Bank Buzz క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుని వివో ఫోన్‌లను కొనుగోలు చేసినట్లయితే 5% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్‌ను ఉపయోగించుకుని వివో ఫోన్‌లను కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా రూ.500 ఖరీదు చేసే బుక్‌మై‌షో మూవీ వోచర్స్ కూడా లభిస్తాయి. ఇదే సేల్‌లో భాగంగా Vivo Y69, Vivo Y66, Vivo Y55s, Vivo Y53 స్మార్ట్ ఫోన్ ల పై కూడా డిస్కౌంట్ లను అందుబాటులో ఉంచారు.

Best Mobiles in India

English summary
Vivo has just announced a three-day Diwali Carnival on Flipkart and it will be offering discounts, cash-backs, exchange offers, and zero cost EMI schemes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X