కొత్త OS వెర్షన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటన చేసిన ప్రముఖ సంస్థ.. వచ్చే నెలలోనే...!
స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రంగంలో గతంలో పోలిస్తే గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో యూజర్లకు అవసరం అయిన అనేక ఫీచర్‌లను క్రమంగా తీసుకొస్తున్నాయి. దీంతోపాటు యూజర్లను ఆకట్టుకొనేందుకు, సంబంధిత రంగంలో మరిన్ని అవకాశాలు సృష్టించుకొనేందుకు వీలుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
టెక్ దిగ్గజం గూగుల్ త్వరలో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంతో ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను తీసుకొస్తామని స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో వెల్లడించింది. ఫలితంగా యూజర్లతోపాటు డెవలపర్‌లకు కూడా ఉపయోగం ఉండనుందని కొందరు అంచనా వేస్తున్నారు.

వివో కీలక ప్రకటన :
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో తాజాగా కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆండ్రాయిడ్ 16 OS లో Funtouch OS కు బదులుగా OriginOS 6 ను తీసుకొస్తామని తెలిపింది. గతంలోనే ఈ అంశంపై లీక్స్ వచ్చాయి. తాజాగా వివో అధికారికంగా స్పందించింది.
ఆండ్రాయిడ్ 16 పైన పనిచేసే వివో, ఐకూ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ మార్పును గమనించవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన గ్లోబల్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 15 వ తేదీన నిర్వహించనుంది. అయితే OriginOS 6 ను చైనాలో అక్టోబర్ 10 వ తేదీన ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకే ఫీచర్లు ఉంటాయా :
అయితే చైనాలో విడుదల చేస్తున్న OriginOS 6 వెర్షన్ మరియు గ్లోబల్ వెర్షన్ ఒకే ఫీచర్‌లను కలిగి ఉంటాయా లేదా వేర్వేరు ఫీచర్‌లతో అందుబాటులోకి రానున్నాయా తెలియాల్సి ఉంది. కొత్తగా లాంచ్ కానున్న OS వెర్షన్ ప్రస్తుతం ఉన్న FuntouchOS కంటే మెరుగైన పనితీరు సహా ఫీచర్‌లను అందిస్తుందని భావిస్తున్నారు.
కొత్త OS ఫీచర్లు :
ప్రస్తుతం ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కంటే ఈ కొత్త OS పనితీరులో గణనీయమైన మార్పు ఉంటుందని భావిస్తున్నారు. పనితీరు, డిస్‌ప్లే, మెమొరి నిర్వహణపై దృష్టిసారించిన వివో.. తన ఆండ్రాయిడ్ కోర్ సిస్టమ్‌లో అనేక మార్పులు చేసింది. కొత్త ఇంటర్‌ఫేస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు సహా అనేక మార్పులను గమనించవచ్చు.
తొలి ఫోన్‌లు ఇవే :
ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 తో వివో X300, X300 ప్రో మోడల్స్ చైనాలో అక్టోబర్ 13న విడుదల కానున్నాయి. ఈ కొత్త OS వెర్షన్‌గా విడుదల కానున్న తొలి వివో ఫోన్‌లుగా ఈ మోడల్స్ గుర్తింపు పొందనున్నాయి. ఈ మోడల్స్ గ్లోబల్ మార్కెట్‌లో ఈ సంవత్సరం చివల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా OriginOS 6 పైన అనేక అంచనాలు ఉన్నాయి. యూజర్ల అంచనాలకు అనుగుణంగా కొత్త OS వెర్షన్ పనితీరు ఉండాలని వివో లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్టోబర్ 10 వ తేదీన చైనాలో ఈ OS ఆవిష్కరించునున్నారు. అనంతరం 5 రోజుల వ్యవధిలో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేయనున్నారు.
యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించడంలో భాగంగా వివో ఈ కొత్త OS ను ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తోంది. అయితే త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచి వచ్చే ఫోన్‌లలో ఈ కొత్త OS వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








