Home
News

Vivo దీపావళి పండగ సేల్ షురూ.. పలు మొబైల్స్ పై భారీ ఆఫర్లు!

దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు కస్టమర్లను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్లను అందజేస్తున్నాయి. అదేవిధంగా, కొన్ని మొబైల్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి తమ వెబ్‌సైట్లలో పండుగ విక్రయాలను కూడా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ కంపెనీ వివో కూడా దీపావళి పండుగలో భాగంగా బిగ్ జాయ్ దీపావళి సేల్‌ను ప్రకటించింది.

Vivo

Vivo బిగ్ జాయ్ దీపావళి ఆఫర్‌లను ప్రకటించింది. ఈ సేల్‌లో, Vivo తన Vivo X80 సిరీస్, Vivo V25 సిరీస్, Vivo Y75 సిరీస్, Vivo Y35 వంటి కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. బిగ్ జాయ్ దీపావళి ఆఫర్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరియు ఈ సేల్ అక్టోబర్ 31 వరకు కొనసాగుతాయి. Vivo నిర్వహించే బిగ్ జాయ్ దీపావళి ఆఫర్ కస్టమర్‌లకు క్యాష్‌బ్యాక్, పొడిగించిన వారంటీతో సహా మరికొన్ని ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తుంది.

Vivo X సిరీస్ ఫోన్లపై రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్;

Vivo X సిరీస్ ఫోన్లపై రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్;

బిగ్ జాయ్ దీపావళి సేల్ సందర్భంగా Vivo బహుళ ఆఫర్‌లను ప్రకటించింది, కంపెనీ V, X లేదా Y సిరీస్ ఫోన్‌లకు ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది. ఆఫర్‌లో ICICI లేదా SBI EMI ఎంపికలతో Vivo X80 లేదా Vivo X80 Proపై రూ.8,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే, కంపెనీ తన X సిరీస్ ఫోన్‌లకు పూర్తిగా చెల్లించినట్లయితే అదనంగా ఆరు నెలల పొడిగించిన వారంటీని అందిస్తుంది. అదేవిధంగా, Vivo V25 సిరీస్ కొనుగోలుదారులు ICICI లేదా SBI EMI ఎంపికలను ఉపయోగించి రూ.4,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. Vivo V25 సిరీస్ ఫోన్‌లపై కంపెనీ ఆరు నెలల అదనపు వారంటీని కూడా అందిస్తోంది.

Vivo Y సిరీస్ ఫోన్లపై రూ.2వేల వరకు క్యాష్ బ్యాక్;

Vivo Y సిరీస్ ఫోన్లపై రూ.2వేల వరకు క్యాష్ బ్యాక్;

ICICI లేదా SBI EMI ఎంపికలను ఉపయోగించే Vivo Y సిరీస్ కొనుగోలుదారులకు రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. Vivo Y సిరీస్ ఫోన్‌లపై రూ.10,000 విలువైన జియో డిజిటల్ లైఫ్ ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, Vivo Y75, Vivo Y35 సహా ఇతర Vivo Y సిరీస్ ఫోన్‌ల వినియోగదారులు కూడా ఆరు నెలల అదనపు వారంటీని పొందుతారు.

అందుబాటులోకి వివో Vivo రూ.101 ఆఫర్;

అందుబాటులోకి వివో Vivo రూ.101 ఆఫర్;

బిగ్ జాయ్ దీపావళి సేల్‌లో వివో ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారుడు రూ.101 మాత్రమే చెల్లించడం ద్వారా మీరు ఏదైనా vivo ఫోన్‌ని పొందవచ్చు. ఆఫర్ ప్రకారం, కొనుగోలుదారులు కేవలం రూ. 101 ప్రారంభ చెల్లింపు చెల్లించి V, X లేదా Y సిరీస్ ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

అయితే, రిటైల్ స్టోర్లలో ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుందా లేదా అనే దానిపై కంపెనీ స్పష్టమైన సమాచారాన్ని విడుదల చేయలేదు. బహుశా Vivo రూ.101 ఆఫర్ ద్వారా ఫోన్‌లపై ఆకర్షణీయమైన EMI ఆప్షన్‌ను అందిస్తాయని విష్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, అమెజాన్లో OnePlus 10R 5G పై అద్భుతమైన తగ్గింపు అందిస్తున్నారు;

మరోవైపు, అమెజాన్లో OnePlus 10R 5G పై అద్భుతమైన తగ్గింపు అందిస్తున్నారు;

దేశంలో పండగ సీజన్ సందర్బంగా కొనసాగుతున్న Amazon Great Indian Festival సేల్ లో పలు గాడ్జెట్ల పై ఆకర్షణీయమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కి చెందిన OnePlus 10R 5G పై అద్భుతమైన తగ్గింపును అందిస్తోంది. వివరాల్లోకి వెళితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో OnePlus 10R 5G పై 15 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది 8GB RAM + 128GB మోడల్‌కు రూ.6,000 ప్రైస్ డ్రాప్ పొందింది. తద్వారా ప్రభావవంతంగా ధరను రూ.38,999 నుండి రూ.31,999 తగ్గింపు తో పొందవచ్చు. అంతేకాదు, అమెజాన్ డీల్‌ను బ్యాంక్ ఆఫర్‌లతో జత చేసి మరిన్ని డిస్కౌంట్‌లను పొందవచ్చు.

మొత్తం రూ.8వేల వరకు డిస్కౌంట్ :

మొత్తం రూ.8వేల వరకు డిస్కౌంట్ :

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మీరు రూ.30 వేళలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవం ఇవ్వగల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే OnePlus 10R మంచి మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు పైన పేర్కొన్న తగ్గింపు తో పాటుగా కొనుగోలుదారులు అదనంగా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసినప్పుడు రూ.2,000 తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ మీరు OnePlus 10R ప్రైమ్ బ్లూ ఎడిషన్‌ను కొనుగోలు చేసినట్లయితే , మీరు Amazon Pay బ్యాలెన్స్‌ రూ.500 క్యాష్‌బ్యాక్ పొందుతారు.

ఎక్స్చేంజి ఆఫర్ కూడా :
నో-కాస్ట్ EMI డీల్‌లు మరియు ఇతర బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదనంగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మీరు మీ పాత ఫోన్‌ని మార్చుకుంటే రూ.28,000 తగ్గింపు పొందవచ్చు. అయితే, ఇది మీ పాత ఫోన్ పరిస్థితి మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo Big Joy Diwali Festival Sale offering more discounts on their products
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X