OriginOS సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్(OS)ను ప్రకటించిన Vivo బ్రాండ్...

|

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ప్రస్తుతం తమ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ (OS)లను విడుదల చేయడం మొదలుపెట్టాయి. వివో సంస్థ ఎట్టకేలకు ఒరిజినోస్ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ను ఇటీవల ప్రకటించింది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ప్రస్తుతం తన ఫోన్లకు ఫన్‌టౌచ్OSతో విడుదల చేస్తున్నది. కానీ దాని యొక్క స్థానంలో OriginOSను భర్తీ చేసే ఆలోచనలో ఉంది. క్రొత్త OS యొక్క యూసర్ ఇంటర్‌ఫేస్ (UI)లో అనేక మార్పులు చేయబడ్డాయి.

 

వివో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) మెరుగైన యానిమేషన్ ఫీచర్స్

వివో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) మెరుగైన యానిమేషన్ ఫీచర్స్

ఆరిజినోస్ యొక్క హోమ్ స్క్రీన్ చతురస్ర మరియు దీర్ఘచతురస్రాకార విడ్జెట్లను ఉపయోగిస్తుంది. దీనిని వివో క్లోట్స్కి గ్రిడ్ అని పిలుస్తుంది. కొత్త OS మెరుగైన యానిమేషన్లు, సరికొత్త నోటిఫికేషన్ సిస్టమ్, సౌండ్ మరియు ఇతర మెరుగైన విషయాలతో వస్తుంది. వివో సంస్థ కొత్త ఓఎస్‌ను అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి టైమ్‌లైన్‌ను కంపెనీ ఇంకా క్లియర్ చేయలేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: JioPhone మీద ధర భారీగా పెరగనున్నది!!! డిస్కౌంట్ ఆఫర్స్ అవుట్..Also Read: JioPhone మీద ధర భారీగా పెరగనున్నది!!! డిస్కౌంట్ ఆఫర్స్ అవుట్..

వివో ఒరిజినోస్ ఫీచర్స్

వివో ఒరిజినోస్ ఫీచర్స్

వివో స్మార్ట్‌ఫోన్ సంస్థ విడుదల చేసిన ప్రకటన ఆధారంగా కొత్త OS ఒరిజినోస్ సరికొత్త మెరుగైన నావిగేషన్ హావభావాలతో వస్తుంది. వీటి యొక్క సంజ్ఞలు ఎలా పని చేస్తాయో అన్న విషయం ఇంకా కంపెనీ క్లియర్ చేయలేదు. కానీ సంస్థ కమ్యూనికేట్ చేసిన ఒక విషయం ఏమిటంటే కొత్త ఆరిజినోస్ 26 విభిన్న గెస్టురెస్ కలయికతో వస్తుంది.

వివో OriginOS సూపర్ కార్డ్ ప్యాక్ ఫీచర్స్
 

వివో OriginOS సూపర్ కార్డ్ ప్యాక్ ఫీచర్స్

ఒరిజినోస్ OS లో జోడించిన కొత్త ఫీచర్లను సంస్థ ‘సూపర్ కార్డ్ ప్యాక్' అనే పేరుతో పిలుస్తారు. ఈ కార్డ్ ప్యాక్ యాక్టీవ్ గా ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా స్క్రీన్‌పై ఒకే స్వైప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. పనితీరుకు సంబంధించిన విషయానికి వస్తే కొత్త ఆరిజినోస్ మల్టీ-టర్బో 5.0 టెక్ మద్దతుతో వస్తుందని వివో తెలిపింది. దీని యొక్క ప్రాసెస్ ఆప్టిమైజేషన్, ఫ్యూజన్ మరియు అప్లికేషన్ ప్రీ-లోడింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. స్మార్ట్ఫోన్‌ను ఉపయోగించడంలో కూడా వేగవంతమైన అనుభవాన్ని అందించడానికి అల్గోరిథం ఆప్టిమైజేషన్ సహాయంతో పరికరంలోని RAM కూడా ROM తో ఆప్టిమైజ్ చేయబడింది.

వివో OriginOS సిస్టమ్ ప్రాసెస్ స్పీడ్ టెక్నాలజీ

వివో OriginOS సిస్టమ్ ప్రాసెస్ స్పీడ్ టెక్నాలజీ

ఈ కొత్త ఆప్టిమైజేషన్ టెక్నాలజీ RAM ఆపరేషన్ల కోసం ROM ను ఉపయోగించడం ఫంక్షన్లను వేగంగా చేయడం ద్వారా యూసర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. వివో ఈ ఫీచర్ యూజర్స్ మల్టీ టాస్కింగ్‌లో ఎటువంటి లాగ్స్‌ను ఎదుర్కోకుండా అనుమతిస్తుంది. ఒరిజినోస్‌తో సిస్టమ్ రెసిడెంట్ ప్రాసెస్ కూడా ఆప్టిమైజ్ అవుతుంది. ఇది ఫోన్ యొక్క మెమరీ వినియోగాన్ని 200MB వరకు తగ్గిస్తుంది. అలాగే కొత్త OSలో ప్రీ-లోడింగ్ టెక్నాలజీతో యాప్ ల ప్రారంభ సమయం 40% తగ్గించబడుతుంది.

Best Mobiles in India

English summary
Vivo Finally Announced New Operating System OriginOS

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X