Home
News

వివో గ్రాండ్ దీపావళి సేల్స్.... వీటిపై ఆఫర్లే ఆఫర్లు

ప్రముఖ చైనా కంపెనీ వివో ఇప్పుడు తన ఈ-స్టోర్ లో గ్రాండ్ దీపావళి ఫెస్ట్ సేల్స్ ను 'దీపావళి జాక్‌పాట్' సేల్ పేరుతో ప్రకటించింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సేల్స్ లో వివో ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో వివో Z1 ప్రో, వివో U10, మరియు వివో Z1x లపై ఆకర్షణీయమైన ఒప్పందాలను అందిస్తున్నాయి. వీటితో పాటు అన్ని రకాల ఫోన్లపై 50 శాతం తగ్గింపుతో పాటు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను తీసుకువస్తుందని తెలిపింది.

వివో జెడ్ 1

చైనా కంపెనీ వివో రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం వివో జెడ్ 1 ప్రో ను తన గ్రాండ్ దీపావళి ఫెస్ట్ సేల్స్ సందర్భంగా దాని యిక బేస్ వేరియంట్ 4 జిబి + 64 జిబి స్టోరేజ్ ను కేవలం 12,990 రూపాయలకు అందించనున్నారు. అలాగే దీని 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మరియు 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లను కూడా కూడా వరుసగా రూ.14,990 మరియు రూ.16,990 డిస్కౌంట్ ధర వద్ద లభిస్తుంది.

 

వివో జెడ్ 1 ప్రో

వివో జెడ్ 1 ప్రో ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ను రూ.14,990, 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను రూ.16,990, 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ.17,990 ధర వద్ద లాంచ్ చేసారు. అంటే ఇప్పుడు దీపావళి జాక్‌పాట్ సందర్బంగా ప్రతి వేరియంట్ మీద రూ.2000 తగ్గింపు లభిస్తున్నది.

 

వివో యు 10

వివో జెడ్ 1 ప్రోతో పాటు వివో యు 10 మరియు వివో జెడ్ 1 ఎక్స్ వంటి మోడళ్లపై కూడా డిస్కౌంట్లను అందించడానికి వివో సిద్ధంగా ఉంది. ఎంచుకున్న మోడళ్లతో సెల్ఫీ స్టిక్ కూడా కంపెనీ ఉచితంగా అందిస్తుంది. అదేవిధంగా డైలీఆబ్జెక్ట్స్.కామ్ ద్వారా మొబైల్ కేసులను కొనుగోలు చేసిన వారికి రూ.300 డిస్కౌంట్ కూపన్లను అందిస్తున్నారు.

 

 

 దీపావళి ఫెస్ట్ సేల్

గ్రాండ్ దీపావళి ఫెస్ట్ సేల్ కింద ఆఫర్లు వివో ఇండియా ఇ-స్టోర్ ద్వారా ప్రత్యేకంగా లభిస్తాయి. అయితే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ కూడా తమ తదుపరి దీపావళి సేల్స్ లో ఈ ఫోన్ల మీద ఆఫర్లను అందిస్తున్నాయి. వివో యొక్క గ్రాండ్ దీపావళి ఫెస్ట్ సేల్స్ అక్టోబర్ 15 వరకు ఉంటుంది. క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ యొక్క కొనుగోళ్లు మరియు EMI లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ ఇవ్వడానికి కంపెనీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది.

Best Mobiles in India

English summary
Vivo Grand Diwali Fest Sale: Vivo Z1 Pro, Vivo U10, and Vivo Z1x Smartphones gets Discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X