వివో నుంచి iQOO స్మార్ట్‌ఫోన్,ఫీచర్లు అదుర్స్

|

చైనా మొబైల్స్ మేకర్ వివో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వి15 ప్రొ ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా 32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లుగా కంపెనీ తెలిపింది. అయితే దీంతో పాటుగా ఐక్యూ(iQOO) పేరిట ఓ నూత‌న స‌బ్ బ్రాండ్‌ను చైనాలో ప్ర‌వేశ‌పెట్టింది. ఇక‌పై ఈ బ్రాండ్ పేరు కింద కూడా వివో ఫోన్ల‌ను త‌యారు చేసి విక్ర‌యించ‌నుంది.

వివో నుంచి iQOO స్మార్ట్‌ఫోన్,ఫీచర్లు అదుర్స్

 

అయితే ఈ బ్రాండ్ కింద కేవ‌లం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల‌ను మాత్ర‌మే త‌యారు చేయాల‌ని వివో భావిస్తున్న‌ట్లు తెలిసింది.

వివో కూడా అదే బాట‌లో

వివో కూడా అదే బాట‌లో

ఇప్ప‌టికే షియోమీ, నూబియాలు ఈ విష‌యంలో ప్రీమియం ఫోన్ల‌ను త‌యారు చేసి క్లిక్ అయ్యాయి. దీంతో వివో కూడా అదే బాట‌లో ప‌య‌నించాలని చూస్తున్న‌ట్లు సమాచారం. ఇక కొత్త బ్రాండ్ కింద వివో మ‌రో రెండు, మూడు నెల‌ల్లో నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు కూడా తెలిసింది.

iQOO smartphone

iQOO smartphone

iQOO smartphone ఫీచర్లు కూడా లీకయ్యాయి. లీకయిన వివరాల ప్రకారం ఈ ఫోన్ Snapdragon 855 chipsetతో రానుంది. అలాగే 12జిబి ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో రానుందని సమాచారం. 44W fast-charging supportతో సరికొత్త టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఇప్పటికే హువాయి 40W fast charge support, వన్ ప్లస్ 30W charging standardsని ప్రవేశపెట్టాయి. బ్యాటరీ విషయానికి వస్తే 4,000 mAh batteryని పొందుపరిచినట్లు సమాచారం.

అదనపు ఫీచర్లు
 

అదనపు ఫీచర్లు

ఈ ఫోన్లో అదనపు ఫీచర్లను UD fingerprint scannerతో రానుంది. కెమెరా సరికొత్త టెక్నాలజీతో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ముఖ్యంగా గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దనున్నారు. UD fingerprint scanner ఉండనుంది.

వి15 ప్రొ

వి15 ప్రొ

వివో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వి15 ప్రొ ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా 32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లుగా కంపెనీ తెలిపింది. వెనుకవైపు మూడు కెమెరాలతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా పొందుపర్చింది. దీని ధరను ధర రూ.28,990లుగా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా మార్చి 6వ తేదీనుంచి అందుబాటులోకి రానుంది.

లాంచింగ్ ఆఫ‌ర్ల‌ను

లాంచింగ్ ఆఫ‌ర్ల‌ను

ఈ సంద‌ర్భంగా ప‌లు లాంచింగ్ ఆఫ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్‌కు అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే 6 నెల‌ల కాల‌వ్య‌వధి గ‌ల ఉచిత వ‌న్‌-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫ‌ర్‌ను ఈ ఫోన్‌తో అందిస్తున్నారు. ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ ఈ ఫోన్‌పై జీరో డౌన్ పేమెంట్‌ను అందిస్తున్న‌ది.

ఇందులో 6.39 ఇంచుల డిస్‌ప్లే

ఇందులో 6.39 ఇంచుల డిస్‌ప్లే

ఇందులో 6.39 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉన్న పాప‌ప్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. కేవ‌లం 0.46 సెక‌న్ల వ్య‌వధిలోనే కెమెరా బ‌య‌ట‌కు వ‌చ్చేవిధంగా ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక భాగంలో 12, 5, 8 మెగాపిక్స‌ల్ కెమెరాలు మూడింటిని ఏర్పాటు చేశారు. ఇందులో 3700 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి డ్యుయ‌ల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు.

 వి15 ప్రొ ఫీచ‌ర్లు

వి15 ప్రొ ఫీచ‌ర్లు

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యుయ‌ల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్‌.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vivo iQOO's first phone with 12GB RAM, Snapdragon 855, 44W fast-charging will launch on March 1

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more