Vivo X60 సిరీస్ ప్రీ-బుకింగ్‌లలో అరుదైన రికార్డు!! ఊహించని నెంబర్స్...

|

వివో ఇటీవలే తన కొత్త ఫ్లాగ్‌షిప్ X60 సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో X60, X60 ప్రో మరియు X60 ప్రో + వంటివి ఉన్నాయి. వీటి యొక్క మొదటి అమ్మకం ఏప్రిల్ 2 న షెడ్యూల్ చేయబడింది. అయితే వీటిని ముందస్తుగా పొందడం కోసం ప్రీ-బుకింగ్స్ లాంచ్ అయిన రోజు నుండి కంపెనీ యొక్క వెబ్ సైట్ లో ప్రారంభించబడ్డాయి. అయితే ఈ కొత్త సిరీస్ యొక్క ప్రీ-బుకింగ్స్ ఆశ్చర్యపరిచే విధంగా మంచి విజయాన్ని సాధించాయి. కంపెనీ యొక్క ముందు తరం X50 సిరీస్ లతో పోలిస్తే ఇవి 200 శాతం కంటే ఎక్కువ ప్రీ-బుకింగ్స్ అందుకున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో X60 సిరీస్ ప్రీ-బుకింగ్స్

వివో X60 సిరీస్ ప్రీ-బుకింగ్స్

వివో X60 సిరీస్ యొక్క ప్రీ-బుకింగ్స్ మార్చి 30 వరకు అందుబాటులో ఉండి రికార్డ్ దశలో మునుపెన్నడూ లేని విధముగా ఎక్కువ మంది బుక్ చేసుకున్నారు. ఈ సిరీస్‌లోని మూడు స్మార్ట్‌ఫోన్ సమర్పణలను కలుపుకొని ఈ రికార్డు బుకింగ్స్ జరిగాయి. అయితే తమకు లభించిన ప్రీ-బుకింగ్‌ల నెంబర్ ను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సంస్థ యొక్క ఈ ప్రీ-బుకింగ్‌లు అమ్మకాలకు హామీ ఇవ్వవని గుర్తుంచుకోండి. వినియోగదారుడు వివో X60 సిరీస్లను ఉచితంగా ప్రీ-బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది. తరువాత ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులోకి ఉంచినప్పుడు వినియోగదారుడు కొనుగోలు చేయకూడదని కూడా నిర్ణయించుకోవచ్చు. ఏప్రిల్ 2 నుండి ఈ సిరీస్ ఫోన్లను మొదటిసారి అమ్మకానికి ముందుకు తీసుకురానున్నది. సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇతర ప్రధాన ఇ-కామర్స్ వెబ్‌సైట్లు మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా మొదటి అమ్మకం మొదలుకానుంది.

వివో X60 సిరీస్ ధరల వివరాలు

వివో X60 సిరీస్ ధరల వివరాలు

వివో X60 సిరీస్ లలో వివో X60 యొక్క 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.37,990 కాగా 12GB ర్యామ్ / 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.41,990. అలాగే వివో X60 ప్రో యొక్క ఏకైక 12GB ర్యామ్ / 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.49,990. చివరగా వివో X60 ప్రో + యొక్క 12GB ర్యామ్ / 256GB స్టోరేజ్ ఒకేఒక వేరియంట్‌ యొక్క ధర రూ.69,990 గా నిర్ణయించింది. వివో X60 మరియు X60 ప్రో మిడ్నైట్ బ్లాక్ మరియు షిమ్మర్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండగా ప్రీమియం X60 ప్రో + బ్లూ వేగన్ లెదర్ ఫినిష్‌లో అందుబాటులో ఉంటుంది.

వివో X60 ప్రో + ఫన్‌టచ్ OS స్పెసిఫికేషన్స్

వివో X60 ప్రో + ఫన్‌టచ్ OS స్పెసిఫికేషన్స్

వివో X60 ప్రో + ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఫన్‌టచ్ OS 11.1 తో రన్ అవుతుంది. ఇది 6.56-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలేడ్ డిస్‌ప్లేను 120HZ రిఫ్రెష్ రేట్ మరియు 240HZ, 1,080x2,376 పిక్సెల్‌ల టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంది. ఇది 398 PPI పిక్సెల్ డెన్సిటీ, 92.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు షాట్ ఎక్స్‌సేషన్ అప్ స్క్రీన్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC చేత శక్తిని పొందుతూ 12GB LPDDR5 ర్యామ్‌తో పాటు 256GB UFS 3.1 స్టోరేజ్ తో జతచేయబడి ఉంది. అలాగే ఇది వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఎఫ్ / 1.57 లెన్స్ 50 మెగాపిక్సెల్ GN1 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), ఎఫ్ / 2.2 లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX 598 సెన్సార్ గింబాల్ స్టెబిలైజేషన్ మరియు F / 2.08 లెన్స్‌తో 32-మెగాపిక్సెల్ సెన్సార్, మరియు f / 3.4 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమరాలు అమర్చబడి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.45 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా అమర్చబడి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Vivo New Flagship X60 Series Generates Record Numbers Pre-Bookings in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X