Vivo బ్రాండ్ T-సిరీస్ విభాగంలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నది!! పూర్తి వివరాలు ఇవిగో...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఇండియాలో త్వరలోనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఫిబ్రవరి 2022లో భారతదేశంలో అరంగేట్రం చేసిన కంపెనీ యొక్క T-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అప్ గ్రేడ్ విభాగంలో రానున్నాయి. ఈ సంస్థ ఈ ఏడాది మేలో రెండు కొత్త T-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు అనేక నివేదికల నుంచి లీక్ లు విడుదలయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు వివో T1 5Gకి అప్ డేట్ వెర్షన్ గా రూ.25,000 ధర లోపు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో విడుదల కానున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వివో T1 ప్రో

ఈ నెల ప్రారంభంలో బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్ గీక్‌బెంచ్‌లో వివో T1 ప్రో 5G కనిపించిన కొద్దిసేపటికే ఈ లాంచ్ నివేదికలు విడుదలయ్యాయి. వివో బ్రాండ్ నుంచి రాబోయే కొత్త ఫోన్ వివోT1 ప్రో 5G ఫోన్ బహుశా క్వాల్కమ్ సిస్టమ్-ఆన్-చిప్, స్నాప్‌డ్రాగన్ 778 5Gతో పాటుగా 8GB RAMతో జతచేయబడి వస్తుందని జాబితా సూచిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 మొబైల్ ఓఎస్‌తో రన్ అయ్యేలా టిప్ చేయబడింది. దీనికి మించి వివో బ్రాండ్ యొక్క కొత్త T-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలు ఏమీ తెలియదు.

 

Realme Pad Mini ఇండియాలో అధికారిక లాంచ్‌కు ముందే టీజర్ విడుదలైంది!!Realme Pad Mini ఇండియాలో అధికారిక లాంచ్‌కు ముందే టీజర్ విడుదలైంది!!

 

 

వివో T1 ప్రో 5G స్పెసిఫికేషన్స్

వివో T1 ప్రో 5G స్పెసిఫికేషన్స్

వివో T1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 2408×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.58-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటుగా ప్లాస్టిక్ బ్యాక్‌ నిర్మాణంను కలిగి ఉంది. బ్యాక్ కెమెరా సెటప్‌ నిలువుగా పేర్చబడి ఉంది. అలాగే ముందు భాగంలో డాట్ డ్రాప్ నాచ్‌లో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇంటర్నల్‌ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 128GB స్టోరేజ్ తో పాటుగా 8GB RAM, 6GB RAM మరియు 4GB RAM మూడు RAM వేరియంట్‌లలో లభిస్తుంది. అలాగే వివోT1 ప్రో 5G ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ద్వారా ఆధారితమై ఫన్ టచ్ OS 12.0 తో రన్ అవుతుంది.

మీ ల్యాప్‌టాప్‌లు అధికంగా వేడెక్కడానికి కారణాలు..? పరిష్కార మార్గాలు.మీ ల్యాప్‌టాప్‌లు అధికంగా వేడెక్కడానికి కారణాలు..? పరిష్కార మార్గాలు.

ఆప్టిక్స్

వివో T1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ ముందు భాగంలో 16MP కెమెరాను కలిగి ఉంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 ఎపర్చరుతో 50MP ప్రైమరీ సెన్సార్, f/2.4 ఎపర్చరుతో 2MP కెమెరా మరియు f/2.4 ఎపర్చరుతో 2MP కెమెరాలను ప్యాక్ చేయబడి ఉంటుంది. చివరిగా ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి స్టార్‌లైట్ బ్లాక్ మరియు రెయిన్‌బో ఫాంటసీ కలర్ వేరియంట్‌లలో అందుబాటులోకి రానున్నది.

Best Mobiles in India

English summary
Vivo Planning to Launch T-series Smartphones Under Rs 25,000 in India: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X