Home
News

ఇండియాలో వివో భారీ పెట్టుబడులు, వేల ఉద్యోగాలు

By Gizbot Bureau

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ఇండియాలో భారీ విస్తరణ ప్రణాళికను చేపట్టనుంది.దేశీ మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీగా దూసుకుపోతున్న వివో భారత్ మార్కెట్‌పై చాలానే ఆశలు పెట్టుకుంది. రానున్న రోజుల్లో భారీ స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టేందుకు రెడీ అయింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా మరో రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.

Vivo plans to invest over Rs 4,000 crore in India

రానున్న కాలంలో తాజా పెట్టుబడి ద్వారా ఇక్కడ తమ మొత్తం పెట్టుబడి రూ.7,500 కోట్లకు చేరనుందని వివరించింది.తొలి దశ వచ్చే నెల్లో సిద్ధం కానుండగా.. ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 2.5 కోట్ల యూనిట్ల నుంచి 3.34 కోట్ల యూనిట్లకు చేరుకోనుందని వెల్లడించింది. నూతనంగా మరో 2,700 ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. వచ్చే 10 ఏళ్లలో 40,000 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కింది.

 అదనంగా మరో రూ.3,500 కోట్లు

అదనంగా మరో రూ.3,500 కోట్లు

వివో గతేడాది భారత్‌లో రూ.4,000 కోట్లు పెట్టుబడులు పెడతామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా కంపెనీ ఇప్పుడు వీటికి అదనంగా మరో రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడించంది. దేశంలో తయారీ ప్లాంట్ల కార్యకలాపాలను మరింత విస్తారించాలని కంపెనీ భావిస్తోంది. అందుకే ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమౌతోంది.

అమ్మకాల తగ్గుదల

అమ్మకాల తగ్గుదల

దేశంలో ఆటోమొబైల్స్, కన్సూమర్ డ్యూరబుల్స్, ఫాస్ట్ యూవింగ్ కన్సూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగాలు అమ్మకాల తగ్గుదలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో బీబీకే గ్రూప్‌కు చెందిన వివో భారీ పెట్టుబడులు పెడతామని ప్రకటించడం టెక్ వర్గాల్లో ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే మారుతీ సహా పలు కంంపెనీలు రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

పదేళ్ల కాలంలో 40,000 మందికి ఉపాధి అవకాశాలు

పదేళ్ల కాలంలో 40,000 మందికి ఉపాధి అవకాశాలు

భారత్ మాకు చాలా ప్రధానమైన మార్కెట్. ఇక్కడ బలమైన కంపెనీగా ఎదగాలని భావిస్తున్నాం. మొత్తం రూ.7,500 కోట్ల పెట్టుబడులను దశల వారీగా ఇన్వెస్ట్ చేస్తాం' అని వివో ఇండియా డైరెక్టర్ (బ్రాండ్ స్ట్రాటజీ) నిపుణ్ మర్యా తెలిపారు. తమ భారీ పెట్టుబడులతో వచ్చే పదేళ్ల కాలంలో 40,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటిదాకా గ్రేటర్ నోయిడా ఫెసిలిటీపై రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.

ఏడాదికి 3.34 కోట్ల ఫోన్లు

ఏడాదికి 3.34 కోట్ల ఫోన్లు

గ్రేటర్ నోయిడాలోని ప్లాంటులో ఏడాదికి 2.5 కోట్ల ఫోన్లు తయారు చేస్తున్నారు. ఈ ప్లాంటు 7,500 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు ఈ ప్లాంటు సామర్థ్యాన్ని మరింత పెంచాలని చూస్తోంది. సెప్టెంబర్ నుంచి ఈ ప్లాంటులో ఏడాదికి 3.34 కోట్ల ఫోన్లు తయారు కానున్నాయి. అలాగే ఉద్యోగుల సంఖ్య 10 వేలకు పెరగనుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటా పరంగా భారత్‌లో షియోమి, శాంసంగ్ తర్వాత వివో మూడో స్థానంలో ఉంది. కంపెనీ త్వరలోనే వివో జెడ్1ఎక్స్ ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేయనుంది.

Best Mobiles in India

English summary
Vivo plans to invest over Rs 4,000 crore in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X