Just In
- 18 min ago
Moto Tab G62 టాబ్లెట్ విడుదలైంది!! ధరల మీద ఓ లుక్ వేయండి...
- 1 hr ago
Vivo V25 Pro 5G కలర్ మారే స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
- 2 hrs ago
Airtel ముందస్తు స్పెక్ట్రమ్ చెల్లింపుగా DoTకి ఎంత చెల్లించిందో తెలుసా?
- 3 hrs ago
జియో రూ.700 ధర పరిధిలోని రెండు ప్లాన్లలో బెటర్ ఏది?
Don't Miss
- Movies
Guppedantha Manasu రిషి పెళ్లి ఆగిపోతే స్వీట్లు పంచుకొంటారా? జగతికి దేవయాని షాక్
- Travel
ఉత్తర భారతదేశంలోని ఉత్తమ హనీమూన్ గమ్యస్థానాలు
- Automobiles
కుషాక్ యాక్టివ్ పీస్ వేరియంట్‌ను సైలెంట్‌గా అప్డేట్ చేసిన స్కోడా, ఇప్పుడు అదనపు ఫీచర్లతో..!
- News
మధ్యప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్న తెలుగు స్వామీజీ??
- Sports
Mohammed Kaif : శిఖర్ విషయంలో జరిగింది కరెక్ట్ కాదు.. ధావన్ కెప్టెన్సీలో కేఎల్ రాహుల్ ఆడితే ఏంపోయేది
- Lifestyle
Janmashtami Decorations: శ్రీకృష్ణ జన్మాష్టమికి ఈ అలంకరణలు ప్రయత్నించండి
- Finance
Gold: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గోల్డ్ ట్రేడర్.. ఎలా కుప్పకూలింది..? ఆ మోసంతో..
Vivo కొత్త ఫోన్ Vivo T1X ఇండియా లాంచ్ వివరాలు లీక్ అయ్యాయి ! ధర, ఫీచర్లు చూడండి.
Vivo భారతదేశంలో Vivo T1xగా పిలువబడే కొత్త T-సిరీస్ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ పరికరం BIS లిస్టింగ్‌లో గుర్తించబడింది, దీనిని బట్టి లాంచ్ త్వరలో ఉందని సూచిస్తుంది. ఇదివరకు వివరాలు గమనిస్తే ,ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనీస్ మరియు గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. చైనీస్ వేరియంట్ 5G నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తుంది, అయితే గ్లోబల్ మోడల్ 4G కనెక్టివిటీతో మాత్రమే వస్తుంది.

Vivo T1x త్వరలోనే ఇండియా లాంచ్
Vivo T1x BIS లిస్టింగ్‌లో V2143 నంబర్‌తో గుర్తించబడింది. జాబితా మోడల్ నంబర్ మినహా మరేమీ వెల్లడించలేదు. అదనంగా, వివో T1x దేశంలో త్వరలో ప్రారంభించబడుతుందని టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ కూడా పేర్కొన్నారు. ఖచ్చితమైన లాంచ్ టైమ్‌లైన్ ఇంకా వెల్లడి కాకపోయినప్పటికీ త్వరలోనే లాంచ్ అవుతుందని భావించవచ్చు. అంతేకాకుండా, వివో కూడా దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి వివరాలను వెల్లడి చేయలేదు. ఈ లాంచ్ వచ్చే నెలలో జరగవచ్చని మేము భావిస్తున్నాము.

Vivo T1x ఫీచర్లు
ఈ ఫోన్ Android 12 ఆధారంగా Funtouch OS 12 తో రన్ అవుతోంది. Vivo T1x స్మార్ట్ ఫోన్ 6.58-అంగుళాల పూర్తి-HD+ (1080 x 2408 పిక్సెల్‌లు) LCD డిస్ప్లేను కలిగి ఉంది. 5G వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. అయితే 4G మోడల్ ప్రామాణిక రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Vivo T1x 4G ఫోన్ యొక్క వివరాలు పరిశీలిస్తే, ఇందులో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ఉంది, అయితే 5G వేరియంట్ 8GB వరకు RAMతో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 900 SoCతో వస్తుంది.

కనెక్టివిటీ
Vivo T1x 4G స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వస్తుంది, ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్ మరియు రెండు 2MP కెమెరాలు ఉన్నాయి. అయితే 5G వేరియంట్లో 64MP డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియోల కోసం, రెండు మోడల్‌లు ముందు భాగంలో 8MP కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటాయి.
కనెక్టివిటీ ఎంపికలు గమనిస్తే 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS మరియు USB టైప్-C పోర్ట్ లు ఉన్నాయి. Vivo T1x స్మార్ట్ ఫోన్ 5,000 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. మరోవైపు, 5G మోడల్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

భారతదేశంలో Vivo T1x అంచనా ధర వివరాలు
Vivo T1x 4G ధర MYR 649 (సుమారు రూ. 11,500) నుండి ప్రారంభమవుతుంది, అయితే 5G వేరియంట్ CNY 1,699 (దాదాపు రూ. 20,000) ప్రారంభ ధరతో వస్తుంది. దీని ప్రకారం, Vivo T1x యొక్క 4G వేరియంట్ రూ.15,000 లోపు రావచ్చని మేము భావిస్తున్నాము. అయితే 5G మోడల్ సుమారు రూ.20,000. లలో భారతదేశంలో లాంచ్ కావొచ్చని అంచనాలున్నాయి. Vivo T1x యొక్క ఏ వేరియంట్ ఇండియాలో లాంచ్ అనే విషయం కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

vivo X80 మరియు X80 ప్రో మోడల్
Vivo ప్రస్తుతం స్టాండర్డ్ X80 మరియు X80 ప్రో మోడల్‌ను విడుదల చేసింది. కానీ , ఇప్పుడు ఈ బ్రాండ్ Vivo X80 Pro+ 5G గా పిలువబడే X80 సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. ఇంతకు ముందు రిపోర్ట్ ల ప్రకారం ఈ సంవత్సరం ఈ హ్యాండ్సెట్ లాంచ్ కాదని నివేదికలు సూచించాయి. కానీ, తాజా సమాచారం Vivo ఈ సంవత్సరం లో X80 Pro+ 5G మోడల్ ని తీసుకు వస్తుందని సమాచారం ఉంది.

Vivo X80 Pro+ 5G లాంచ్ టైమ్‌లైన్ రివీల్ చేయబడింది
Vivo X80 Pro+ 5G అక్టోబర్ 2022లో లాంచ్ అవుతుందని Mysmartprice (టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ సహకారంతో) నివేదిక ప్రచురించింది. అయితే ఖచ్చితమైన లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. అంతేకాకుండా, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో ప్రకటించబడుతుందని చెప్పబడింది. ఇది తప్ప, ఈ నివేదిక వేరే ఏమీ వెల్లడించలేదు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086