Home
News

వివో నుంచి మరో కొత్త 5G ఫోన్ ! ఫ్లిప్కార్ట్ లో వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు

By Maheswara

భారతదేశంలో వివో సంస్థ తమ టి సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల సిరీస్ ను విస్తృతం చేసే ప్రణాళికలో భాగంగా వివో టి2 5జి సిరీస్‌ను భారత దేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ గురించి ఫ్లిప్కార్ట్ యొక్క మైక్రోసైట్‌లో ప్రాథమిక సమాచారం కనిపించడంతో ఫోన్ త్వరలో విడుదల కాబోతుందని నిర్ధారించబడింది.

వివో T2 5G ఫోన్ యొక్క డిజైన్ ను కూడా టీజ్ చేయడం జరిగింది. ఇది దాని డిస్‌ప్లేలో సెంటర్-అలైన్డ్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని వెల్లడించింది. ఇంకా అదనంగా, వివో T2 5G స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ SoC ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుందని సూచించింది. అయినప్పటికీ ఈ చిప్‌సెట్ గురించి మరిన్ని వివరాలు ఇంకా ప్రకటించబడలేదు.

Vivo T2 5G Series India Launch Confirmed, Will Go On Sale Via Flipkart. Expected Price And Specifications.

ఈ ప్రాసెసర్ చిప్ సెట్ పేరు ఏప్రిల్ 9న విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. వివో T2 5G స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని ఫ్లిప్కార్ట్ యొక్క మైక్రోసైట్ ధృవీకరించింది. ఇందులో ఫోన్ వెనుక ప్యానెల్‌లో రెండు వృత్తాకార మాడ్యూల్స్‌లో ఉంచబడిన LED ఫ్లాష్ ఉంటుంది. అయితే, ఖచ్చితమైన కెమెరా స్పెసిఫికేషన్లు ఏప్రిల్ 7 వరకు వెల్లడి చేయబడవు.

ఇంకా, ఈ వివో T2 5G సెంటర్ అలైన్డ్ వాటర్‌డ్రాప్ నాచ్ ఒక డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. మరియు ఈ పరికరం యొక్క కుడి వైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్‌లను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే పరిమాణం మరియు రిజల్యూషన్ వంటి మరింత సమాచారం కోసం ఏప్రిల్ 5న వివరాలు విడుదల కాబోతున్నాయి.

ఇటీవల, వివో T2 5G ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్ లో గుర్తించబడింది. ఈ ఫోన్ యొక్క మోడల్ నంబర్ వివో V2222 గా జాబితా చేయబడింది. ఈ పరికరం పూర్తి-HD+ రిజల్యూషన్‌తో కూడిన వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 SoC, 8GB RAM మరియు 128GB స్టోరేజీ ని కలిగి ఉంటుందని జాబితా సూచిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం లో పనిచేస్తుందని కూడా అంచనా వేయబడింది. Vivo T2 5G రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని అంచనా వేయబడింది అందులో ఒకటి 6GB RAM,128GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్.

ప్రస్తుతం, లాంచ్ కాబోతున్న వివో T2 5G స్మార్ట్ ఫోన్, గత సంవత్సరం విడుదలైన వివో T1 5Gకి కొనసాగింపుగా ఉంటుందని భావిస్తున్నారు. మునుపటి వివో T1 5G మోడల్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ప్రాసెసర్ ని కలిగి ఉంది మరియు ఇది 6.58 అంగుళాల పూర్తి HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది, ఈ డిస్ప్లే120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ ఫీచర్లతో వస్తుంది. ఇంకా, వివో T2 ధర ₹20,000 లోపు ఉండవచ్చని అంచనాలున్నాయి. నివేదికల ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటి వరకు వివో యొక్క అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌గా రావచ్చు.

Best Mobiles in India

English summary
Vivo T2 5G Series India Launch Confirmed, Will Go On Sale Via Flipkart. Expected Price And Specifications.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X