Home
News

Vivo నుంచి కొత్త ఫోన్‌.. 6.78 అంగుళాల డిస్‌ప్లే, 8GB ర్యామ్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి కొత్త ఫోన్‌ విడుదల ఖరారు అయింది. Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్‌ 22న లాంచ్‌ కానుంది. ఈ మేరకు వివో అధికారిక ప్రకటన చేసింది. వివో కొత్త ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. ఈ ఫోటోలు ఆధారంగా కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు గోల్డెన్‌ షేడ్‌తో వస్తుంది. హోల్‌ పంచ్‌ కటౌట్‌ డిస్‌ప్లేతో రానుంది.

Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్‌ 22 మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌ ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. LED ఫ్లాష్‌ చుట్టూ ఉన్న రింగ్‌ చుట్టూ సెన్సార్లను అమర్చారు. ఇదే తరహా డిజైన్‌ iQOo Z7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉంది.

Vivo T2 Pro 5G Smartphon

వివో కొత్త ఫోన్‌ వెనుక వైపు ‌డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ఫీచర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ ప్రైమరీ కెమెరా 64MPతో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే 2MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. 16MP సెల్ఫీ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది.

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ ఆధారంగా పనిచేయనుందని సమాచారం. 4600mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే 66W ఛార్జర్‌ ఉంటుందని తెలుస్తోంది. USB-C ఫాస్ట్‌ ఛార్జర్‌ ఉంటుందని తెలుస్తోంది.

వివో T2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్+ 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ధర రూ.23,999గా ఉండే అవకాశం ఉంది. అయితే ధర, ఫీచర్లపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

* ఇటీవలే వివో V29e స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ విడుదల అయింది. 8GB ర్యా్మ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యా్మ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.26,999, రూ.28,999లకు కొనుగోలు చేయవచ్చు. ఆర్టిస్టిక్‌ రెడ్‌, ఆర్టిస్టిక్‌ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది.

వివో V29e స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పుల్‌ HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120 రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. గరిష్ఠంగా 1300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 చిప్‌సెట్‌పై ఆధారపడి పనిచేస్తుంది. భారత్‌ మార్కెట్‌లో ఆదిపత్యం చలాయించే విధంగా వివో వరుసగా ఫోన్లను విడుదల చేస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo T2 Pro 5G Smartphone launch confirmed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X