Home
News

Vivo T2 Pro స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. 6.78 అంగుళాల డిస్‌ప్లే, 8GB ర్యామ్ సహా..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Vivo T2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ లాంచ్‌ చేసింది. మిడ్‌ రేంజ్‌లోనే ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. వివో కొత్త స్మార్ట్‌ఫోన్ కర్వడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. వివో T2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 CPUపై పనిచేస్తుంది.

వివో T2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల FHD+ 3D కర్వడ్‌ 10 బిట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ 7.36mm థిక్‌నెస్‌, 175 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ కస్టమర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది.

Vivo T2 Pro 5G smartphone launched

ఈ వివో కొత్త 5G ఫోన్‌ ఆక్టాకోర్‌ 4nm డెమెన్సిటీ 7200 చిప్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత వివో ఫన్‌టచ్‌ OS 13 గ్లోబల్‌పైన పనిచేస్తుంది. ఈ (Vivo New Phone) స్మార్ట్‌ఫోన్‌ 66W ఛార్జర్‌తో 4600mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ రెండు కలర్‌ వేరియంట్లలో లభిస్తుంది. డూన్‌ గోల్డ్‌, న్యూ మూన్‌ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌ వెనుకవైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. 64MP OIS కెమెరా సహా 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. అలాగే ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వైఫై 5 GHz, బ్లూటూత్‌ 5.3, USB-C ఛార్జర్‌ను కలిగి ఉంటుంది. IP52 రేటింగ్‌తో కూడిన ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

వివో T2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 128GB వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది.

ఐసీఐసీఐ, యాక్సిస్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఎక్స్చేంజ్‌పై రూ.1000 వరకు బోనస్‌ వస్తుంది. సెప్టెంబర్‌ 29 7PM నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు వివో వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో పాగా వేసేందుకు వివో సంస్థ కీలక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మిడ్‌ రేంజ్‌లో ఫోన్లు విడుదల చేస్తోంది. కొత్త వివో T2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ డిజైన్‌ సహా ఇతర ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo T2 Pro 5G smartphone launched in india and sale from september 29th 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X