Home
News

నేటి నుంచి Vivo T2 Pro స్మార్ట్‌ఫోన్‌ సేల్‌... ధర, ఫీచర్లు, ఆఫర్ల వివరాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి సెప్టెంబర్ 22న Vivo T2 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ ప్రస్తుతం వివో అధికారిక వెబ్‌సైట్‌లో సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది.

వివో T2 Pro స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.23,999గా ఉంది. అదే 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.24,999గా ఉంది. ఈ ఫోన్లు రెండు రంగుల్లో లభిస్తాయి. మూన్‌ బ్లాక్‌, డూనే గోల్డ్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

Vivo T2 Pro smartphone on sale

ఈ ఫోన్‌ను యాక్సెస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు మరియు EMIల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందుతారు. దీంతోపాటు ఈ సేల్‌లో భాగంగా ఎక్స్చేంజిపై రూ.1000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు నోకాస్ట్‌ EMI అవకాశం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఇవాళ (శుక్రవారం) 7PM నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వివో T2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీప్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1300 నిట్స గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 చిప్‌పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఫన్‌టచ్‌ OS 13 గ్లోబల్‌పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ IP52 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.

Vivo T2 Pro smartphone on sale

ఈ వివో కొత్త ఫోన్‌ 66W ఛార్జంగ్‌ సపోర్టుతో 4600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు 64MP OIS ( ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 2MP సెకండరీ లెన్స్‌ ఉంటుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

వివో T2 ప్రో ఫోన్‌ వైఫై 5, బ్లూటూత్‌ 5.3 మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్‌ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మిడ్‌ రేంజ్‌లో స్లిమ్‌, లైట్‌వెయిట్‌ స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్న వారికి వివో T2 Pro మంచి ఎంపిక కానుంది.

ఇటీవలే భారత్‌ మార్కెట్‌లో విడుదలయిన iQoo Z7 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా ఇటువంటి స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. స్టోరేజీ, కెమెరా, డిస్‌ప్లే సహా అన్ని అంశాల్లో రెండు ఫోన్లు ఒకేలా ఉండనున్నాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.23,999గా ఉంటుంది. అయితే ఈ ఫోన్‌ బ్లూ లగూన్‌, గ్రాఫైట్‌ మ్యాటీ రంగుల్లో లభిస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Vivo T2 Pro smartphone on sale on vivo website and Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X