మార్చి 21న లాంచ్ కానున్న Vivo కొత్త ఫోన్ ఇదే! ధర, స్పెసిఫికేషన్లు,సేల్ వివరాలు
Vivo భారతదేశంలో తన కొత్త Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ యొక్క లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో విక్రయించనున్నట్లు కూడా ప్రకటించారు. ఇప్పుడు,ఈ Vivo T3 5G ఫోన్ యొక్క లాంచ్ తేదీ, ఫీచర్లు మరియు ధర వివరాలను తెలుసుకుందాం.
Vivo T3 5G లాంచ్ తేదీ వివరాలు:
Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ మార్చి 21న మధ్యాహ్నం 12:00 IST గంటలకు భారత మార్కెట్లో లాంచ్ జరుగుతుందని వివో సంస్థ మీడియా ఆహ్వానం ద్వారా ప్రకటించింది. ఇంకా, ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ ఫోన్ కు సంబందించిన డిజైన్ మరియు స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తూ కొత్త మైక్రోసైట్‌ను కూడా ఏర్పాటు చేసింది.

Vivo T3 5G స్పెసిఫికేషన్ల వివరాలు: ఈ ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD ప్లస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. మరియు దాని డిస్ప్లే 120Hz రిఫ్రెష్, 1800 nits పీక్ బ్రైట్‌నెస్ మరియు అద్భుతమైన సెక్యూరిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. అందువల్ల ఇది ఉపయోగించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో విడుదల చేయనున్నట్లు నివేదికలు తెలియచేస్తున్నాయి. అలాగే, ఈ అద్భుతమైన వివో T3 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా విడుదల చేయబడుతుంది. అయితే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ను కూడా పొందుతుంది.
వివో T3 5G ఫోన్ IP54 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజీ మరియు 8GB RAM + 256GB స్టోరేజీ తో రెండు వేరియంట్లలో రాబోతోంది. మీరు మెమరీ కార్డ్‌ని ఉపయోగించడానికి ఇది మైక్రో SD కార్డ్ స్లాట్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
ఇక కెమెరా వివరాలు గమనిస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ IMX882 సెన్సార్ + 8MP అల్ట్రా వైడ్ లెన్స్ + 2MP బోకె లెన్స్ యొక్క ట్రిపుల్ రియర్ కెమెరాలతో రాబోతోంది.ఇంకా,సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ఇందులో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ సహాయంతో 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చని సమాచారం. ఇది ఒక LT ఫ్లాష్ మరియు వివిధ కెమెరా ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త వివో క్రిస్టల్ ఫ్లేక్ మరియు కాస్మిక్ బ్లూ కలర్స్‌లో విడుదల కావడం గమనార్హం.
ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో లాంచ్ కాబోతోంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఇందులో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ చార్జర్ సదుపాయం ఉండటం కూడా గమనించదగ్గ విషయం. ఈ బ్యాటరీ మీకు రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ అంచనా ధర మరియు సేల్ వివరాలు: మార్చి 21 న భారతదేశంలో లాంచ్ కానున్న.ఈ కొత్త వివో ఫోన్ ధర రూ.20,000 బడ్జెట్ తో విడుదల అవ్వొచ్చని అంచనాలున్నాయి. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ కు రాబోతోంది.


Click it and Unblock the Notifications








