6 అద్బుతమైన కెమెరా సెటప్‌లతో సరసమైన ధరకు వివో V17 ప్రో

|

వివో సంస్థ గత కొన్ని వారాలుగా వివో V17 ప్రోను టీజ్ చేస్తోంది. ఇప్పుడు కంపెనీ ఎట్టకేలకు వివో V 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసింది. వివో నుంచి వచ్చిన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు అతిపెద్ద USP కెమెరాలతో మరియు ముందువైపు డ్యూయల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా సెటప్‌తో వచ్చిన మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు నాలుగు కెమెరాలను కూడా అందిస్తుంది.

ధరల వివరాలు
 

ధరల వివరాలు

వివో V17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధరను ఇండియాలో 29,990 రూపాయలుగా నిర్ణయించబడింది. వివో సంస్థ ఈ ఫోన్‌ను కేవలం ఒకే ఒక వేరియంట్ అది కూడా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో మాత్రమే అందిస్తోంది. అదనపు మెమొరీ విస్తరణ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ మద్దతుతో కూడా రాదు. ఈ కొత్త వివో స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, వివో యొక్క ఆన్‌లైన్ స్టోర్స్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

గూగుల్ ఫర్ ఇండియా 2019లో కొత్త ఆవిష్కరణలు

ఆఫర్ల వివరాలు

ఆఫర్ల వివరాలు

వివో V17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క హ్యాండ్‌సెట్ సెప్టెంబర్ 27 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో యొక్క ఆన్‌లైన్ స్టోర్స్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా విక్రయించబడుతుంది. అందుకోసం ఇప్పుడు దీనిని పొందడానికి ముందస్తు ఆర్డర్ల కోసం ఉంచింది. వివో యొక్క ఆఫ్‌లైన్ ద్వారా వీటి యొక్క ప్రీ-ఆర్డర్స్ పొందవచ్చు. వివో V17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ గ్లాసియర్ ఐస్ మరియు మిడ్నైట్ ఓషన్ కలర్ లలో లభిస్తుంది. ఆఫర్ల విషయానికొస్తే వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులతో 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

25 వేల లోపు ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్‌లు

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

వివో V17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ మొత్తం ఆరు కెమెరాలను కలిగి ఉంటుంది. మొదటగా కెమెరాల విషయానికి వస్తే ఇది పైన చెప్పినట్లుగా ముందు భాగంలో డ్యూయల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో 32-మెగాపిక్సెల్ మెయిన్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 105-డిగ్రీల సూపర్ వైడ్ యాంగిల్ కెమెరాతో జత చేయబడి ఉంటుంది. అలాగే రెండవ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ సెన్సార్ మద్దతుతో వస్తుంది. ఈ సెల్ఫీ కెమెరాలు సూపర్ నైట్ సెల్ఫీ మోడ్ మరియు పోజ్ మాస్టర్ మోడ్ వంటి లక్షణాలకు కూడా మద్దతును అందిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌
 

ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక భాగంలో ఉన్న కెమెరాల విషయానికి వస్తే ఇది 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు నాలుగు కెమెరాలను జతచేయబడి వస్తుంది. 2x టెలిఫోటో లెన్స్‌గా పనిచేసే 13 మెగాపిక్సెల్ షూటర్ రెండవ కెమెరాగా ఉంది. మిగిలిన రెండు కెమెరాలలో ఒకటి 8 మెగాపిక్సెల్ సూపర్-వైడ్-యాంగిల్ షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మద్దతుతో వస్తాయి. వివో V17 ప్రో 20: 9 కారక నిష్పత్తితో మరియు నో-నాచ్ డిజైన్‌తో గల 6.44-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 91.65 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంది. దీని యొక్క ప్యానల్ ఫుల్ HD + రిజల్యూషన్ మద్దతుతో పనిచేస్తుంది.

బ్యాటరీ

వివో యొక్క ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ మద్దతుతో వస్తుంది. ఇది అతి పెద్ద 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఛార్జింగ్ కోసం USB టైప్-సి మద్దతును అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ మద్దతును కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 SoC తో పనిచేస్తోంది. సాఫ్ట్‌వేర్ విషయంలో వివో V 17 ప్రో ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా సరికొత్త ఫన్‌టచ్ 9 ఓఎస్‌తో రన్ అవుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vivo V17 Pro Pre-order Starts in India: Price,Specifications,Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X